సాక్షి, అనంతపురం: రైతు భరోసా కింద ఒక్కొ రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.
‘‘కరవు రైతులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. హంద్రీనీవా, తుంగభద్ర జలాలను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరున్నా ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడం దారుణం. రాయలసీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరు?. రైతుల సమస్యల కన్నా మద్యం, ఇసుక నుంచి కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్న ధ్యాసే ముఖ్యమా?’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment