జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య | Siddaramaiah And KR Ramesh Attended For Jaipal Reddy Last Rites | Sakshi
Sakshi News home page

జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య

Published Mon, Jul 29 2019 5:12 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యుడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ నాయకులు సిద్దరామయ్య, కేఆర్‌ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement