సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తే దేశంలో ప్రజస్వామ్యం ఉన్నట్టుగా, గెలవకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎల్లో మీడియాలో చూపించడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విటర్‌లో ఓ పోస్ట్ ఉంచారు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పు, ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయనేదే చంద్రబాబు భయమని సజ్జల తెలిపారు. అందుకే చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.
అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగని ఘటనలు జరిగినట్టుగా సృష్టించి, పచ్చ ఫిర్యాదుల కట్టను తన మనిషైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు పంపించాలని చంద్రబాబు టీడీపీ కేడర్‌ను ఆదేశించారని సజ్జల విమర్శించారు. వాటికి నంబరింగ్ ఇచ్చి మరో రచ్చకు సిద్దం కావాలన్నదే చంద్రబాబు పథకమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment