
సాక్షి, బెంగళూరు: ప్రాణం ఉన్న వారు మాట్లాడాలి. నాకు జీవం లేదు. నాలుగురోజుల క్రితమే చనిపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం బెళగావిలో ఎంఈఎస్ విధ్వంసకాండపై స్పందించాలని రమేశ్‌కుమార్‌ను విలేకరులు కోరగా, చేతులెత్తి నమస్కరించారు. నేను జీవించిలేను. నాలుగురోజుల క్రితం మృతి చెందానంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మహిళలపై అత్యాచారాల గురించి ఆయన అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనిపై మహిళా సంఘాలు తీవ్ర నిరసనలు చేయడం తెలిసిందే.
చదవండి: పెళ్లి కాలేదని జీవితం మీద విరక్తితో..
Comments
Please login to add a commentAdd a comment