
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు.
మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్ రమేశ్..
జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్‌కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment