బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనము 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కే. ‘కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ 60 ವರ್ಷಗಳ #LootIndia ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ವರ್ಣಿಸಿದ ಮೇಧಾವಿ ನಾಯಕರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು!
— Dr Sudhakar K (@mla_sudhakar) July 21, 2022
ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರೇ ಇಷ್ಟು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಭ್ರಷ್ಟಾಚಾರವನ್ನ ಒಪ್ಪಿಕೊಂಡಮೇಲೆ ಯಾವ ಮುಖ ಇಟ್ಟುಕೊಂಡು ಜನರ ಬಳಿ ಮತ ಕೇಳುತ್ತೀರಿ @INCIndia ನಾಯಕರೇ? pic.twitter.com/r0Kqt3OZpZ
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో గురువారం ఈడీ ముందు హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇందులో భాగంగానే బెంగళూరులోని పార్టీ కార్యాలయం నుంచి క్వీన్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు. అనంతరం ఫ్రీడమ్ పార్క్‌లో సమావేశం ఏర్పాటు చేసి నేతలు మాట్లాడారు.
ఇదీ చదవండి: National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ
Comments
Please login to add a commentAdd a comment