
మహేంద్ర, ధీరజ్, పావని ముఖ్య తారలుగా ధీరజ్ (ఎమ్. రమేశ్‌కుమార్) దర్శకత్వంలో డా. బి. మహేంద్ర నిర్మించిన చిత్రం ‘ఆడో ఎదవ’. రమేశ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక ఆత్మ మరో జీవిలోకి వెళ్లి చేసిన అలజడితో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా ఉంటుంది. కథ డిమాండ్ మేరకు మహేంద్ర భారీ బడ్జెట్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘దర్శకుడు నాకు చెప్పిన కథని పది రెట్లు ఎక్కువగా తెరమీద చూపించబోతున్నారు. ఇందులో 4 ఫైట్లు భారీ ఖర్చుతో తెరకెక్కించాం.
‘జబర్‌దస్త్’ టీమ్ చక్కటి వినోదం పంచారు. కిషన్ కవాడియా ఇచ్చిన పాటలు బాగున్నాయి. తెలుగులో ఇప్పటి వరకూ రాని కొత్త కథతో సినిమా తీశాం. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు మహేంద్ర. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్. ప్రకాష్‌రావు, సహ నిర్మాతలు: సత్విక్ తంగెళ్ల, అక్కరమణి కొండబాబు, వానపల్లి శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment