సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు. ఉత్తమ అధికారిగా మన్ననలు అందుకున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేష్‌కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేయడం విశేషం. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ)
కమిషనర్‌గా శ్రీనివాసరావు
రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీఎస్ జీవో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment