![Ukraine Crisis: Russia Creates New Record With Highest Sanctions - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/8/Putin_Sanctions_Record.jpg.webp?itok=8oj5EAtZ)
Russia Faced Most Sanctions In The World: ఉక్రెయిన్‌పై యుద్ధం(మిలిటరీ చర్యల) నేపథ్యంలో.. రష్యా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా ఘనత సొంతం చేసుకుంది(ఇప్పటివరకు). గతంలో ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని ఇప్పుడు దాటేసింది.
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన పదిరోజుల్లోనే.. ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది రష్యా. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలను లెక్కించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) గణాంకాల ప్రకారం..
రష్యా.. ప్రస్తుతానికి 5,530 (కొనసాగింపు)
ఇరాన్.. అణు కార్యక్రమం, తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందన్న ఆరోపణలతో ఇరాన్ గత దశాబ్ద కాలంగా 3,616 ఆంక్షలను ఎదుర్కొంటోంది.
సిరియా
ఉత్తరకొరియా
వెనిజులా
మయన్మార్
క్యూబా.. ఇలా ఉంది లిస్ట్.
► ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేస్తూ వస్తున్నాడు. అందుకే.. తమ పొదిలో ఉన్న ఆంక్షలనే ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. అయినప్పటికీ రష్యా మాత్రం తగ్గేదేలే అంటోంది.
► ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై 2,778 కొత్త ఆంక్షలను విధించాయి. దీంతో మొత్తంగా రష్యాపై ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది.
► రష్యా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై ‘ఇది ఆర్థిక అణుయుద్ధం, చరిత్రలో అతిపెద్ద ఆంక్షల ఘటన’.. అంటూ ఒబామా, ట్రంప్ హయాంలో మాజీ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారి పీటర్ పియాట్‌స్కీ అభివర్ణిస్తున్నారు.
► ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రెండు వారాల్లోనే రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలకు లక్ష్యంగా మారడం గమనార్హం. రష్యా, ఇరాన్ తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో సిరియా, ఉత్తరకొరియా, వెనిజులా, మయన్మార్, క్యూబా ఉన్నాయి. ఓవైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా.
Comments
Please login to add a commentAdd a comment