న్యూయార్క్: ఉత్తర కొరియాకు భారీ ఊరట దక్కింది. అణుసామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగాలు సాగిస్తున్న ఉత్తరకొరియాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో వీగిపోయింది.
ఐరాసలోని 15 దేశాల భద్రతా మండలిలో అమెరికా చేసిన ఈ తీర్మానం 13–2 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయడంతో ప్రపంచ దేశాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రష్యా సంగతి ఏమోగానీ.. చైనా బహిరంగంగా ఆంక్షలను(అమెరికా) వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ వస్తున్నాడు కిమ్. ఈ పరీక్షలపై పొరుగు దేశం దక్షిణ కొరియా సహా జపాన్, అమెరికాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ శాంతి స్థాపనకు నార్త్ కొరియాను, నియంతాధ్యక్షుడిని కట్టడి చేయాలని మిగతా దేశాలను కోరుతున్నాయి. కానీ, కిమ్ మాత్రం తాజా పరిణామంతో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment