వాషింగ్టన్ : ఉక్రెయిన్,రష్యా యుద్ధాన్ని పిచ్చితనంతో పోల్చారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు తక్షణ కాల్పుల విరమణ, చర్చలు జరపాలని కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో చైనా కీలక పాత్ర పోషించగలదని ట్రంప్ అభిప్రాయ పడ్డారు.
2019లో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్రాన్స్‌లోని నోట్రే డామ్ కేథడ్రల్‌ను పునఃప్రారంభించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్‌లు ఒక ఒప్పందం కుదుర్చుకుని పిచ్చి (యుద్ధాన్ని)ని ఆపాలని జెలెన్ స్కీ కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ ఇప్పటికే దాదాపు 400,000 మంది సైనికులను కోల్పోయింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి. ఇందుకోసం ఇరుదేశాలు చర్చలు జరపాలి. చర్చలు జరిపేందుకు చైనా సహాయం చేస్తుంది. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాలని, యుద్ధం ఆపాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment