బడ్జెట్‌ తర్వాత భారీ పెట్రో షాక్‌ | Petro Prices Reached Record Highs | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ తర్వాత భారీ పెట్రో షాక్‌

Published Wed, Sep 18 2019 1:42 PM | Last Updated on Wed, Sep 18 2019 1:43 PM

Petro Prices Reached Record Highs - Sakshi

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారం ఒక్కరోజునే పెట్రో ధరలు అత్యధికంగా పెరిగాయి.

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బడ్జెట్‌ అనంతరం ఒకేరోజు ఈస్ధాయిలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమనడంతో పాటు సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో పెట్రో ధరలు పేట్రేగిపోతున్నాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 25 పైసలు పెరగ్గా, డీజిల్‌ ధర లీటర్‌కు 24 పైసల మేర పెరిగింది. పెట్రో ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ 72.42 కాగా, హైదరాబాద్‌లో రూ 76.99 ముంబైలో రూ 75.26, చెన్నైలో రూ 69.57, కోల్‌కతాలో రూ 68.23 పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement