సాక్షి, న్యూఢిల్లీ : రూపాయి బలహీనపడటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సోమవారం అత్యంత గరిష్ట స్ధాయికి చేరాయి. డీజిల్ లీటర్‌కు 14 పైసలు పెరగ్గా, పెట్రోల్ లీటర్‌కు 13 పైసలు భారమైందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 82.60కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 85.33కు పెరగ్గా, డీజిల్ ధరలు రూ.77.91కు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ఈనెల 16 నుంచి ఇంధన ధరలు భగ్గుముంటున్నాయి.
డాలర్‌తో రూపాయి విలువ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత కనిష్టస్ధాయిలో రూ 70.32 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి మారకపు విలువతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, లెవీలతో ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తుండటంతో ఇంధన ధరలు రికార్డు స్ధాయిలకు చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment