సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. పెట్రోల్ లీటర్‌కు 15 పైసలు, డీజిల్ లీటర్‌కు 14 పైసల మేర చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడంతో ఆయా నగరాల్లో పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ హైదరాబాద్‌లో 16 పైసలు తగ్గి రూ 80.33 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ 75.55కు దిగివచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ 81.14, కోల్‌కతాలో రూ 78.23, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ 72.83 పలికింది. అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో బ్యారెల్‌కు 70 డాలర్లకు ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల 64 డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment