Petrol price cut
-
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. -
పెట్రోల్ ధరలు.. రూ. 18 పెంచి 8 తగ్గిస్తారా? కేంద్రపై ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు
ముంబై: పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ఏమాత్రం సరిపోదని, ఇంధన ధరలను అరికట్టేందుకు మరిన్న చర్యలు అవసరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. గత ఆరేడేళ్ల క్రితం పెట్రోల్, డీజీల్ ధరలు ఎంతెంతున్నాయో ఆమేరకు కేంద్రం తగ్గించాలని ఠాక్రే శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితం కేంద్రం పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.18.42 పెంచిందని, కానీ, ఈరోజు కేవలం రూ.8 తగ్గించిందని, అదేవిధంగా డీజీల్ ధర లీటర్‌కు రూ.18.24 పెంచింది, ఇప్పుడు కేవలం రూ.6లు తగ్గించిందని కాబట్టి ఇదేమంత భారీ తగ్గింపు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం పెట్రోలు, డీజీల్ ధరలు ఎంతెంత ఉన్నాయో ఆ మేరకు తగ్గిస్తేనే భారీ ఎత్తున తగ్గించినట్లని, వినియోగదారులకూ గొప్ప రిలీఫ్ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం.. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు పెద్ద రిలీఫ్ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని పోస్ట్ చేశారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై రూ.8లు, డీజీల్‌పై రూ.6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పెట్రోల్, డీజీల్ లపై వసూలు చేసే ఎక్సైజ్ సుంకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్రలోనే ఎక్కువని, కేంద్రం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎౖMð్సజ్‌సుంకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. పెట్రోల్, డీజీల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు. చదవండి: ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ -
గుడ్‌న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
గుడ్‌న్యూస్..! పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 తగ్గింపు..! ఎక్కడంటే..
టూవీలర్ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. గత కొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రూ. 5, డిజీల్ రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జార్ఖండ్‌లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ధరలపై భారీ ఊరటను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. టూవీలర్ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री @HemantSorenJMM pic.twitter.com/MsinoGS60Y — Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021 చదవండి: ఎలన్‌మస్క్ కీర్తికిరీటంలో 2021 ఘనతలు -
అతి స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
హైదరాబాద్: పెట్రోలు ధరల నుంచి వినియోగదారులకు చమురు కంపెనీలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. 36 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లీటరు పెట్రోలు, డీజిల్‌లపై కేవలం 20 పైసల వంతున ఛార్జీలు తగ్గించాయి. అంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు రోజుకు 20 పైసల వంతున మొత్తం 60 పైసల వరకు లీటరు డీజిల్ ధరను తగ్గించాయి. మొత్తంగా డీజిల్ ధర 80 పైసలు, పెట్రోలు ధర 20 పైసల వంతున తగ్గింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే నుంచి జులై 16 వరకు రోజు విడిచి రోజు అన్నట్టుగా పెట్రోలు ధరలు పెరిగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోవడంతో ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్లకు దిగువన నిలకడగా ఉండటంతో చమురు కంపెనీలు స్వల్పంగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాయి. తగ్గిన ధరతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 105.60గా లీటరు డీజిల్ ధర రూ. 97.15లుగా ఉంది. చదవండి: టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ -
పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం!
చెన్నై: లీటరు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది పెట్రోలు. ఆగకుండా పెరుగుతున్న ధరతో ఫ్యూయల్ కోసం బంకు వెళ్లిన ప్రతీసారీ బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట పద్దు తయారీ సందర్భంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 3 తగ్గింపు పెట్రోలు ధరలను తగ్గిస్తూ తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదు.. సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాట్‌లో కోత దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటేసింది. పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)లను విధిస్తున్నాయి. ఇలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో సామాన్యులకు పెట్రోలు ధరల నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వ్యాట్‌ను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. వంద దిగువకు ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే డీజిల్ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. -
పెట్రోలు ధర రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్
గువహటి : పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అక్కడి బీజీపే సర్కారు వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!) సవరించిన ఈ రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించాం..కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తాజా రేటు కోతను ప్రకటించామన్నారు. దీంతో పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త గరిష్టాలను తాకిన సమయంలో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది. -
భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. దేశీ ఇంధన ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ ధర 2.69 పైసలు, డీజిల్ ధర 2.33 పైసలు చొప్పున క్షీణించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.70.29కు, డీజిల్ ధర రూ.63.01కు తగ్గింది. చదవండి : తగ్గిన ‘పెట్రో’ ధరలు -
పడిపోయిన చమురు ధరలు
-
తగ్గిన ‘పెట్రో’ ధరలు
న్యూఢిల్లీ: సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. సోమవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్‌పై 24–27 పైసలు, డీజిల్‌పై 25–26 పైసలు తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధర లీటర్ రూ.71కి పడిపోయింది. 1991 గల్ఫ్‌యుద్ధం తర్వాత ఇంత భారీగా ధరలు పడిపోవడం ఇదే ప్రథమం. చమురు ఉత్పత్తి చేసే సౌదీ నేతృత్వంలోని ఒపెక్, రష్యా మధ్య విభేదాలు ధరల యుద్ధానికి తెరలేపాయి. దీంతో సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరుకుంది. 2019 జూలై తర్వాత ఇదే తక్కువ ధర. డీజిల్ ధర కూడా లీటర్ రూ.63.26కి పడిపోయింది. దేశీయ చమురు అవసరాల్లో 84 శాతం వరకు భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ లీటర్ ధర రూ. 68.88గా ఉంది. (చదవండి: చమురు ‘బేజార్’) -
పండగ వేళ తగ్గిన పెట్రో సెగలు..
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. పెట్రోల్ లీటర్‌కు 15 పైసలు, డీజిల్ లీటర్‌కు 14 పైసల మేర చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడంతో ఆయా నగరాల్లో పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ హైదరాబాద్‌లో 16 పైసలు తగ్గి రూ 80.33 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ 75.55కు దిగివచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ 81.14, కోల్‌కతాలో రూ 78.23, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ 72.83 పలికింది. అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో బ్యారెల్‌కు 70 డాలర్లకు ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల 64 డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. -
14వ రోజు: పెట్రోల్ ధర ఎంత తగ్గింది?
సాక్షి, ముంబై: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.ఇటీవల రికార్డ్ స్థాయిలను తాకిన ఇంధన ధరలు వరసగా 14వ రోజు మంగళవారం కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్ పై 10పైసల చొప్పున ధరలు క్షీణించాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ, కోలకతా, ముంబై, చెన్నైతదితర మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 15,11 పైసలు తగ్గాయి. ఈ సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 76.43 రూపాయలుగా ఉంది. కోలకతాలో రూ.79.10 ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33 రూపాయలుగా ఉంది. ఇక డీజిల్ ధర విషయానికి వస్తే కోల్‌కతా, ఢిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు 10 పైసలు తగ్గగా ముంబయి, చెన్నైలలో లీటరుకు 11 పైసలు తగ్గింది. హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి రూ.80.96గా ఉండగా, డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ. 73.75గా ఉంది. జూన్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. గత 14 రోజులుగా పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రెండు రూపాయలు తగ్గింది. డీజిల్ ధర రూ1.50 తగ్గింది. -
పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. లీటర్ ధరపై రూ.1.09 తగ్గింది. మూడున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో డీజిల్ ధర లీటర్ కు 56 పైసలు పెంచారు. సవరించిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.51, డీజిల్ లీటర్ రూ. 58.40 కానున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూపాయిన్నర తగ్గే అవకాశముంది. డీజిల్ ధర 72 పైసలు పెరగనుంది.