Jharkhand: Govt Gives Concession Of 25 A Litre Petrol To Two-Wheeler Riders - Sakshi
Sakshi News home page

టూవీలర్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 తగ్గింపు..! ఎక్కడంటే..

Published Wed, Dec 29 2021 4:22 PM | Last Updated on Wed, Dec 29 2021 5:12 PM

Jharkhand Govt Gives Concession Of 25 A Litre Petrol To Two-Wheeler Riders - Sakshi

టూవీలర్‌ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు.

గత కొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరలు సెంచరీ దాటేశాయి. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ రూ. 5, డిజీల్‌ రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జార్ఖండ్‌లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌ ధరలపై భారీ ఊరటను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

టూవీలర్‌ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్‌ సోరెన్‌ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

చదవండి: ఎలన్‌మస్క్‌ కీర్తికిరీటంలో 2021 ఘనతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement