Two-wheeler
-
సరికొత్తగా హోండా యాక్టివా 125
గురుగ్రామ్: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా అధునాతన ఫీచర్లతో సరికొత్త యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రూ.94,422 ధరతో డీఎల్ఎక్స్, రూ.97,146 ధరతో హెచ్–స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బ్లూటూత్ అనుసంధానంతో 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే కలిగి ఉంది. 123.99 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ పీజీఎం–ఎఫ్ఐ ఇంజిన్‌తో తయారైంది. ఇది 6.20 కిలోవాట్ల శక్తిని, 10.5ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ సదుపాయం ఉంది. పర్ల్ ఇగ్నోస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సిరెన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీసియఎస్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. -
ఇక నుంచి అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
-
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది. -
Delhi: బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
రైడ్ షేరింగ్ సంస్థలకు సుప్రీం కోర్ట్ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
తార్‌మార్ తక్కెడ మార్
‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్ తక్కెడ మార్ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ బెంగళూరులో టూ–వీలర్ ర్యాపిడో(బైక్ ట్యాక్సీ సర్వీస్)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్లైన్లు, హసిల్ కల్చర్ గురించి చర్చించారు. ఒక యూజర్ గత నెల వైరల్ అయిన వీడియో పోస్ట్ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కనిపిస్తాడు!! -
వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు
రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా మంది ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తుంటారు. సిగ్నల్స్ పట్టించుకోకుండా రయ్యిమంటూ దూసుకెళ్తుంటారు. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతివేగంగా వెళ్తుంటారు. పరిమితికి మించి లగేజ్‌ను తీసుకెళ్తుంటారు. ఇలాంటివారు తమ జీవితాన్నే నాశనం చేసుకోకుండా వేరే వాళ్ల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై ఇలాగే వెళ్తూ కనిపించాడు. తన టూవీలర్‌పై పరిమితికి మించి అధిక బరువులను తీసుకెళ్తున్నాడు. స్కూటీపై కనీసం తను కూడా కూర్చోడానికి ప్లేస్ లేకుండా వస్తువులతో నింపేసి.. బండి చివర కూర్చొని ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతని కాళ్లు కిందకు ఆనుతుంటే.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సాగర్ అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్టు చేశాడు. ‘నా 32GB ఫోన్ 31.9 GB డేటాను తీసుకువెళుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇందులోని వ్యక్తి ఎవరో.. ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. There is a possibility to retrieve the data from the Mobile, even if it's damaged. But not life... So our appeal to people avoid putting their life's at risk and others too.#FollowTrafficRules #RoadSafety @HYDTP @CYBTRAFFIC @Rachakonda_tfc @hydcitypolice @cyberabadpolice https://t.co/Z6cipHFfDr — Telangana State Police (@TelanganaCOPs) June 21, 2022 దీనిని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు. దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ..‘మొబైల్ దెబ్బతిన్నప్పటికీ డాటా రికవరీ చేయవచ్చు కానీ జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను కూడా ప్రమాదంలో పడకుండా నివారించండి’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతని డ్రైవింగ్ భయంకరంగా ఉంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు. అతనికి భారీ జరిమానా విధించండి.’ అంటూ తిట్టిపోస్తున్నారు. -
హీరో వాహనాలు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ధర పెంచుతోంది. మోడల్‌నుబట్టి రూ.2,000 వరకు ఈ పెంపు ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు వ్యయాలు అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. -
గుడ్‌న్యూస్..! పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 తగ్గింపు..! ఎక్కడంటే..
టూవీలర్ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. గత కొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రూ. 5, డిజీల్ రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జార్ఖండ్‌లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ధరలపై భారీ ఊరటను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. టూవీలర్ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री @HemantSorenJMM pic.twitter.com/MsinoGS60Y — Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021 చదవండి: ఎలన్‌మస్క్ కీర్తికిరీటంలో 2021 ఘనతలు -
భారత బైక్... చలో బంగ్లాదేశ్!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం భారత టూవీలర్ పరిశ్రమకు కలిసివస్తోంది. 6.5 శాతం సగటు జీడీపీ వృద్ధిరేటును నమోదుచేస్తూ బంగ్లా ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లటానికి ప్రధాన కారణం అక్కడి రెడీమేడ్ దుస్తుల పరిశ్రమే. దుస్తుల ఎగుమతులతో గణనీయ వృద్ధి రేటు నమోదవుతుండటంతో... అక్కడి ప్రజల వినియోగ అలవాట్లూ మారుతున్నాయి. యువతకు బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. ఫలితం... భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టూ–వీలర్స్ జాబితాలో బంగ్లాదే మొదటి స్థానం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2017–18లో బంగ్లాకు ఎగుమతైన ద్విచక్ర వాహనాల విలువ ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది. బంగ్లాలో భారత కంపెనీల హవా ప్రస్తుతం బంగ్లా టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో రెండింటిదే హవా. ఈ రెండూ అక్కడ సగం వాటాను సొంతం చేసుకున్నాయి. మార్కెట్ లీడర్‌గా ఎదిగే విషయంలో ప్రస్తుతం బజాజ్ ఆటో కాస్త ముందంజలో ఉండగా, హీరో మోటో కార్ప్ సైతం కాస్త అటూఇటుగా దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలకు గతేడాది ఇండియా నుంచి రూ.13,793 కోట్ల విలువైన మోటార్ సైకిళ్ల ఎగుమతి కాగా దీన్లో బంగ్లాదేశ్ వాటానే 14 శాతం కావటం విశేషం. మరోవంక ఇక్కడి నుంచి శ్రీలంకకు ఎగుమతి అవుతున్న ద్విచక్ర వాహనాలు 3.5% తగ్గుదల నమోదుచేయగా.. నేపాల్ ఎగుమతులు 3.7 శాతం పెరిగాయి. ‘హీరో’కు బంగ్లాలో సొంత ప్లాంట్ బంగ్లా మార్కెట్లో వాటా పెంపునకు హీరో మోటోఅక్కడి సంస్థ నిలాయ్ మోటార్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. హెచ్ఎమ్సీఎల్ నిలాయ్ బంగ్లాదేశ్ లిమిటెడ్ (హెచ్ఎన్బీఎల్) పేరిట ఏర్పాటైన ఈ సంస్థలో హీరోకు 55 శాతం వాటా ఉంది. ఏడాదికి 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ జేవీ గతేడాది జూన్ నుంచి కార్యకలాపాలను మొదలెట్టింది. ట్రక్కుల ఎగుమతిలోనూ.. గతేడాదిలో భారత్ నుంచి బంగ్లాకు ఎగుమతి అయిన ట్రక్కుల విలువ రూ.1,598 కోట్లుగా నమోదయింది. భారత్ నుంచి ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి జరుగుతున్న దేశాల జాబితాలో టాప్ 20లో బంగ్లా కూడా ఉంది. అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు... ద్విచక్ర వాహనాల కంపెనీలతో పాటు బంగ్లాదేశ్‌లో అనేక ప్యాసింజర్ వాహన సంస్థలకూ స్థానికంగా అసెంబ్లింగ్ యూనిట్లున్నాయి. టాటా మోటార్స్ అక్కడి సంస్థ నిటోల్ మోటార్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేసింది. ఈ జేవీ కంపెనీ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలనూ విక్రయిస్తోంది. మరో దేశీ దిగ్గజం అశోక్ లేలాండ్ సైతం అక్కడి సంస్థతో కలిసి జేవీని ఏర్పాటుచేసి, అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పింది. భారత్ అవసరం చాలానే ఉంది..! ‘వాహన మార్కెట్ బంగ్లాదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రాంతీయంగా అక్కడి ఆటోమొబైల్ ఉత్పత్తి రంగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ దేశానికి భారత్ అవసరం అధికంగానే ఉంది. అవసరం రీత్యా అనేక భారత కంపెనీలతో బంగ్లా సంస్థలు జట్టుకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం కోసం గతేడాది ఫిబ్రవరిలో ఢాకాలో ఇండో–బంగ్లా ఆటోమోటివ్ షోను సియామ్ నిర్వహించింది. మరోమారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ షోను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
రోడ్డుపై రచ్చ
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పబ్లిక్‌తో ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ ఆ దిశగా పనిచేయడం లేదు. హత్యా నేరాల్లో పోలీసుల పాత్ర ఉంటుండడం... పోలీసు ఉన్నతాధికారులే ఆ విషయాలను తేల్చి చెప్పడంతో పబ్లిక్కు కూడా పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేకుండాపోతోంది. దీంతో పోలీసులపై పబ్లిక్ తిరగబడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేయడం... కోపావేశంతో ఆ ద్విచక్ర వాహనదారుడు కూడా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి చేయడం చకాచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై ఉదయం 11 గంటల ప్రాంతంలో సౌత్ జైల్‌రోడ్డు (విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల)వైపు వెళ్తున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ద్విచక్ర వాహనదారుడిని ఆపి రికార్డులు చూపించమన్నాడు. చూపించాడో.. లేదో.. తన వద్ద ఉన్నాయో లేవో తెలీయదు గానీ.. వారిద్దరి(పోలీస్, ద్విచక్ర వాహనదారుడి మధ్య) మధ్య వాగ్వివాదం నెలకొంది. ఆ తగదా ముదరడంతో యువకుడిపై పోలీస్ చేయి చేసుకున్నాడు. అవమానం భరించలేక అసహనం... ఆగ్రహంతో ఆ యువకుడు తన సోదరుడికి ఫోన్ చేసి పిలిచాడు. వీరిద్దరూ విధుల్లో ఉన్న ఆ ట్రాఫిక్ పోలీస్‌పై దాడికి దిగారు. ఇంతలో పోలీస్ రక్షక్ వాహనం అక్కడకు వచ్చింది. రక్షక్‌లో ఉన్న పోలీసులు ఆ యువకుల మెడ పట్టుకుని వాహనంలోకి తీసుకెళ్తుంటే... మేము వస్తామన్నాం కదా... ఎందుకు రౌడీలులా తీసుకెళ్తున్నారంటూ ఎదురించారు. ఆ తర్వాత రక్షక్ వాహనంలో కూడా పోలీసులు.. ఆ యువకుల మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత ఆ ఇద్దరు యువకులను పోలీసులు రెండో పట్టణ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. టూ టౌన్ ట్రాఫిక్ ఎస్ పైడిరెడ్డి ఫిర్యాదు మేరకు యువకులు ఆళ్ల అనిరుధ్, ఆళ్ల శ్రీవర్షపై కేసు నమోదు చేశారు. అయితే ప్రశాంత విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికితోడు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టూ వీలర్స్ అమ్మకాలపై ఇక్రా అంచనాలు
టూవీలర్ అమ్మకాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం బాగానే ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ నెల వరకూ రెండంకెల స్థాయిలో పరుగుపెట్టిన టూవీలర్స్ రంగం పెద్ద నోట్ల రద్దుతో కాస్త నెమ్మదించిందని రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. అయితే ఈ ఏడాది ద్విచక్ర వాహన అమ్మకాలు 7-8 శాతం వృద్ధి కనబరచనున్నట్లు నివేదించింది. వెరసి వాహన అమ్మకాలు ఏడాది మొత్తంగా 7-8 శాతం ప్రగతిని సాధించగలవని నివేదిక అభిప్రాయపడింది. డీమానిటైజేషన్ కారణంగా ద్రవ్య సంక్షోభం కారణంగా అమ్మకాలు నవంబర్ ,జనవరి మధ్య 11.3 శాతం పడిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్-4 ప్రమాణాల మార్పిడి వంటి అంశాల కారణంగా నవంబర్ నుంచీ జనవరి వరకూ వాహన విక్రయాలు 11 శాతం చొప్పున మందగించినట్లు నివేదిక తెలియజేసింది. నోట్ బ్యాన్ సమయంలో మోపెడ్ల అమ్మకాలు డబుల్ డిజిట్ నమోదు చేశాయని, స్కూటర్ల అమ్మకాల వృద్ది 12.5 శాతంగా ఉన్నట్టు, సెప్టెంబర్ మాసం నాటి 24.7 శాతంతో పోలిస్తే చాలా తక్కువ అని అభిప్రాయపడింది. మొత్తంమీద, పరిశ్రమ వృద్ధి రేటు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలతో మెరుగ్గానే ఉండనున్నట్టు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల(ఏప్రిల్-జనవరి)లో ద్విచక్ర వాహన అమ్మకాలు 8 శాతంపైగా వృద్ధి సాధించాయి. గత నాలుగేళ్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, మార్చిలలోనూ 7 శాతం స్థాయిలో అమ్మకాలు నమోదుకాగలవని, 2018 లో మంచి అమ్మకాలు నమోదు కానున్నాయని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికాలో విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపింది. తదుపరి రెండవ ఆర్థభాగంలో ప్రధానమైన మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ఎగుమతులు క్రమంగా వచ్చే మూడేళ్లలో 8-10 శాతం వృద్ధి ఉండనుందని నివేదించింది. 2018లో తిరిగి 8-10 శాతం స్థాయిలో వృద్ధి నమోదుకావచ్చని ఐసిఆర్ఎ తన నివేదికలో పేర్కొంది. 2018లో స్కూటర్ల అమ్మకాలు మోటార్ సైకిళ్లను మించిపోగలవని ఇక్రా అభిప్రాయపడింది. -
బష్ ఎక్షా పోశా!
హ్యూమర్ ప్లస్ రాశి ఫలాల్లో వాహనయోగం అని వుంటే ఏంటో అనుకున్నా. టూ వీలర్ చెడిపోయి బస్సెక్కడం అనుకోలేదు. బైక్ సైలెన్సర్ సైలెంట్‌గా వుండక దగ్గడం మొదలుపెట్టింది. వంద సిగరెట్లు తాగిన దానిలా పొగ వదలసాగింది. నల్లటి దట్టమైన పొగకి, నా వెనుక వస్తున్నవాళ్ళు కకావికలైపోతున్నారు. జిపిఎస్ లాగా నేనెక్కడున్నానో ఆ పొగని చూసి గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. పోకుండా, పొగపెట్టిన ఆ బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాను. నాడి పట్టి పరిశీలించి పెదవి విరిచాడు. దింపుడు కళ్ళెం ఆశ వదిలేసి కర్మకాండ జరిపించమన్నాడు.తరువాత సిటీబస్సు ఎక్కడం ప్రారంభించాను. దీంట్లో వున్న సుఖం ఏమంటే మనం నడపక్కరలేదు, మనల్ని ఎవరో నడుపుతారు. కాకపోతే రన్నింగ్‌లో ఎక్కి రన్నింగ్‌లో దిగడం తెలిసుండాలి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడ ఎక్కుతున్నానో, దిగుతున్నానో తెలిసేది కాదు. చిల్లరదో సమస్య. టికెట్ వెనుక కండక్టర్లు రాస్తారు. చిన్నప్పుడు చూసిన షోలే సినిమాలో డైలాగులు గుర్తుంటాయి కానీ, చిల్లర గుర్తుండదు. చెల్లని చెక్కుల్లా జేబులో టికెట్లు మిగిలిపోతున్నాయి.డబ్బులు లేకపోయాయి కానీ, బస్సులో బోలెడంత కాలక్షేపం, కామెడీ. ఈమధ్య ఫిల్మ్‌నగర్ సిగ్నల్ దగ్గర ఒకడు వుండలా దొర్లుకుంటూ ఎక్కాడు, లేదా ఎగబ్రాకాడు. సీటులో సగమే కూచుని ‘బష్ ఎక్షా పోశా’ అన్నాడు. అదే రకం భాషో లేడీ కండక్టర్‌కి అర్థం కాలేదు. ‘టికెట్’ అంది తన భాషలో. ‘బష్ ఎక్షాపోశా కక్ర్’ అని వాడు మరాఠీ బెంగాలీ కలిపి వాగాడు. ఫుల్‌గా తాగినట్టున్నాడు. కిక్కెక్కినపుడు బస్సు ఎందుకు ఎక్కాడో అర్థం కాలేదు. ‘‘ఏమంటున్నాడన్నా వీడు’’ అడిగింది కండక్టర్. వాడి భాషపై నాక్కొంచెం భాషాభిమానం వుండడం వల్ల అనువాదం చేసి ‘‘బస్సు ఎక్కడికి పోతుంది కండక్టర్’’ అని అడుగుతున్నాడని చెప్పాను. ‘‘నువ్వెక్కడికి పోవాలా’’ అడిగింది కండక్టర్. మనవాడు సేమ్ డైలాగ్ పాములాంటి బుసతో రిపీట్ చేశాడు. లేడీ కండక్టర్ బాడీ బిల్డర్‌లా మారి విజిల్ కొట్టి బస్సు ఆపి వాడిని బయటికి విసిరేసింది. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఒక కరెంటు పోల్ కింద సెటిలయ్యాడు. ∙∙ ఇంకోసారి ఒక సీనియర్ సిటిజన్ తగిలాడు. రూల్స్‌కి రోల్ మోడల్లా వున్నాడు. చిరిగిపోయి వంద రూపాయలిచ్చి టికెటివ్వమన్నాడు. నోట్ వేరేది ఇవ్వమన్నాడు కండక్టర్.‘‘నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి అవునా కాదా?’’ అని అడిగాడు సిటిజన్. అవునన్నాడు కండక్టర్ అయోమయంగా.‘‘మరి మీ గవర్నమెంట్ ప్రింట్ చేసిన నోట్‌ని, గవర్నమెంట్ ఎంప్లాయిగా నువ్వెందుకు తీసుకోవు?’’‘‘అన్నా, ఆ నోటు నేనియ్యలే కదా నీకు’’ అన్నాడు.‘‘ఇచ్చింది మీ గవర్నమెంటే కదా’’‘‘అరే, లొల్లి చేయకురా భయ్’’సిటిజన్ వినలేదు. దాంతో కండక్టర్‌కు ఏం చేయాలో తెలియక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, బస్సుని స్లోగా నడుపుతున్న డ్రయివర్ వరకూ అందర్నీ తిట్టాడు. ఎందుకు తిట్టాడో అతనికి కూడా తెలియదు. ‘‘మీ గవర్నమెంట్ మీద మీకే గౌరవం లేకపోతే మాకెందుకుండాలి?’’ అని సిటిజన్ దిగిపోయాడు. ‘‘ఎక్కణ్నుంచి వస్తార్రా ఈ ఎర్రగడ్డ బ్యాచంతా’’ అని కండక్టర్ గొణుక్కుంటూ రైట్ చెప్పాడు. బస్సులు లేనపుడు సర్వీస్ ఆటోల్లో ఎక్కడానికి ప్రయత్నించాను కానీ అదంత సులభం కాదు. డ్రైవర్ మీద ప్రయాణీకులు కూచుంటారో, ప్రయాణీకుల మీదే డ్రైవర్ కూచుంటాడో అర్థం కాదు. ఒక్కోసారి డ్రైవర్ నిలబడి కూడా డ్రైవ్ చేస్తాడు. గోతులు, స్పీడ్ బ్రేకర్లు దేన్నీ లెక్కచేయడు. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. తిరుపతిలో జెవిఆర్కె రెడ్డి అని మంచి మిత్రుడున్నాడు. మనిషి ఎంత మృదువో, డ్రైవింగ్‌లో అంత కఠినం. స్పీడ్‌బ్రేకర్ల దగ్గర బ్రేక్ వేయకూడదని ఆయన సిద్ధాంతం. ఆయన బండిలో కూచుంటే ఇంటికే పోతామో, డాక్టర్ దగ్గరికి పోతామో చెప్పలేం. వాహనాల గురించి ఎప్పుడు రాసినా, ఆయన్ని స్మరించకుండా వుండలేను. – జి.ఆర్. మహర్షి -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
జీడిమెట్ల: ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం తీశాయి. రోడ్డు గుంతల్లో ద్విచక్రవాహనం జారి పడింది. దానిపై ప్రయాణిస్తున్న గృహిణి రోడ్డుపై పడగా.. అదే సమయంలో దూసుకొచ్చిన బస్సు ఆమై నుంచి దూసుకెళ్లడంతో మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై లింగ్యానాయక్ కథనం ప్రకారం.. సురారం కాలనీకి చెందిన మన్మథరావు భార్య సంధ్య(25) ఆదివారం సాయంత్రం పనిపై స్కూటీపై ఎర్రగడ్డ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సురారం వెళ్లెందుకు జీడిమెట్ల మైలాన్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డు గుంతల్లో స్కూటీ స్క్రిడ్ కావడంతో పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (టీఎస్ యూబీ 0448) సంధ్యపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన సంధ్యను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందింది. సోమవారం భర్త మన్మథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుంతలు పడ్డ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మోటార్ సైకిళ్ల చోరి ముఠా అరెస్టు
- భారీగా మోటారు సైకిళ్లు స్వాధీనం - 113 గ్రాముల బంగారు, 4 వందల కేజీల వెండి అభరణాలు స్వాధీనం - పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు కొవ్వూరు: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, మోటారు సైకిళ్ల చోరీ, చైన్ స్నాచింగ్స్‌కి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కొవ్వూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున మోటారు సైకిళ్లు, 113 గ్రాముల బంగారు, 403 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టోల్గేట్ జంక్షన్ వద్ద నేర పరిశోధన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. గత నెల14న పట్టణంలో కొవ్వూరు రౌండ్ పార్కు వద్ద మహిళ మెడలో గొలుసు దొంగతనానికి మట్టా దినేష్, వల్లూరి కిషోర్‌కుమార్ లు పాల్పడ్డారు. పోలీసులు మోటారు సైకిళ్లు తనిఖీ చేస్తుండగా వీరు కొవ్వూరులో దొరికారు. విచారించగా వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడినట్టు తెలిపారు. వీరు అందించిన సమాచారంతో పోతురాజు దిబ్బ ఏరియాలో రెండిళ్లలో చోరీకి పాల్పడిన గోడి సతీష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 43 గ్రాముల బంగారు ఆభరణాలు, 403 కేజీల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరుకి చెందిన రౌతు శ్రీనివాస్, రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్‌కి చెందిన యనగంటి సూరిబాబులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా కాకినాడ, తణుకు, రాజమండ్రి, విజయవాడ, కొవ్వూరు, దేవరపల్లి, భీమవరం తదితర ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు చోరీలు చేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ముత్యాల చిట్టి వీరన్న అనే వ్యక్తి ద్వారా ఇరువురు విక్రయానికి ఉంచిన 12 మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. మోటారు సైకిళ్ల చోరీలకు సంబంధించి వీరిపై 22 కేసులు నమోదయినట్టు డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ పి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్, క్రైం ఎస్సైలు కేవీ రమణ, బీ శ్రీనివాస్ సింగ్, ఏఎస్సై ఎస్.శ్రీనివాసరావు, హెచ్‌సీలు పీఎన్ శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, శ్రీనివాస్, జయరామ్, విజయకుమార్ ఈ చోరీల కేసును చేధించినట్లు ఆయన వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు బైక్‌పై ఖమ్మం జిల్లా మణుగూరుకు సోమవారం వెళుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో దుగినేపల్లి సమీపంలోని వాగుపై ఉన్న బ్రడ్జిపైకి రాగా... బైక్ అదుపుతప్పి కిందకు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పుడప్పుడూ హడావుడి..
♦ ఆర్టీఏ.. పోలీసులు.. రెండు శాఖల్లోనూ కనిపించని చిత్తశుద్ధి.. ♦ టూ వీలర్లకు హెల్మెట్లే శ్రీరామరక్ష.. ♦ రోజురోజుకు పెరుగుతున్న టూ వీలర్ ప్రమాదమృతులు అప్పుడప్పుడూ హడావుడి.. నెలకో.. ఆర్నెల్లకోసారి తనిఖీలు.. అప్పుడు కూడా లెసైన్స్, ఆర్సీ బుక్ అడుగుతారు.. కానీ.. రక్షణ కవచాలైన హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్లకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు.. ఇదీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరు.. దీంతో వాహనదారులు హెల్మెట్లు కొన్నా.. వాడటం లేదు. ఇటీవలి కాలంలో టూ వీలర్లు ఢీకొని, జారి కిందపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలు.. ఇందులో కేవలం హెల్మెట్ లేని కారణంగానే 90 శాతం మృత్యు ఒడికి చేరుతున్నారని ఇటు పోలీసులు.. అటు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. పరిగి: టూ వీలర్లకు హెల్మెట్లే శ్రీరామరక్ష అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 70 శాతం మంది హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నా.. 10 శాతం మంది కూడా వాటిని వాడటం లేదు.. రోజురోజుకూ టూ వీలర్ ప్రమాదాలు పెరుగుతుండగా.. మరణాలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. అర్బన్ ప్రాంతంలో 50 శాతం వరకు హెల్మెట్లు వాడుతుండగా.. ఇటీవల తనిఖీలు పెరగటంతో 60 శాతం వాడకం పెరిగింది. నిరంతరంగా అమలు చేయాలి.. టూ వీలర్లు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలనే నిబంధనను పోలీసులు, ఆర్టీఏ అధికారులు నిరంతరం అమలు చేయాలి. ఓపక్క అవగాహన మరోపక్క తనిఖీలు ఏకకాలంలో జరగాలి. పోలీసులు, ఆర్టీఏ అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు తదితర అన్ని స్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. ♦ మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన ఓ రైతు తన బైకుపై పరిగికి వచ్చాడు. దారిలో ఎదురుగా వస్తున్న మరో బైకు ఢీకొట్టింది. దీంతో అతడు రోడ్డుపై పడిపోవటంతో తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.. హెల్మెట్ ఉండి ఉంటే అతనికి ప్రాణాపాయం తప్పేదని వైద్యులు పేర్కొన్నారు. ♦ నెలక్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కూతురిని చూసేందుకు పరిగికి వస్తున్నాడు. సయ్యద్ మల్కాపూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఇతడి బైకును ఢీకొట్టింది. రెండు బైకులపై ఉన్న వారెవరూ హెల్మెట్ ధరించలేదు. ఇందులో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ♦ ఇటీవల పరిగి మండలం భర్కత్‌పల్లికి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై పరిగి వస్తుండగా.. మరో వాహనం రాసుకుంటూ వెళ్లడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ముందుగా అవగాహన.. హెల్మెట్లు వాడటం, లెసెన్సు కలిగి ఉండటం, ఇన్సూరెన్సు చేయించుకోవటం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం.. తర్వాత తనిఖీలు చేపడతాం.. అనంతరం కేసులు నమోదు చేస్తాం.. జరిమానాలు విధిస్తాం.. - ప్రసాద్, సీఐ, పరిగి -
బ్యాంకాక్ లో ఉబెర్ బైక్ ట్యాక్సీలు
థాయ్ః యాప్ ద్వారా అద్దె కార్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నఉబెర్ సంస్థ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వినియోగదార్లకు ఇప్పటివరకూ కార్లను మాత్రమే సరఫరా చేస్తున్న సంస్థ తాజాగా మోటర్ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశ పెడుతోంది. బ్యాంకాక్ లో పైలట్ పథకాన్ని ప్రారంభించిన ఉబెర్.. త్వరలో ఆసియా మొత్తం తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. కారు యజమానులు ఎక్కువవడం, సిటీ ప్లానింగ్ సరిగా లేకపోవడంతో థాయ్ రాజధాని నగరం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. ఇది గమనించిన ఉబెర్ సంస్థ నగరంలో మోటర్ బైక్ ల వాడకానికి నాంది పలికింది. ట్రాఫిక్ జామ్ లను నివారించడంలో భాగంగా ప్రారంభించిన ఉబికిటస్ మోటార్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఆరెంజ్ జాకెట్లను ధరించి నగరంలో ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సింగపూర్ కు చెందిన గ్రాబ్ ట్యాక్సీ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశపెట్టి, ప్రయాణీకులను ఆకట్టుకుంటుండగా... ఉబెర్ పోటీగా తన మోటర్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గతేడాది బ్యాంకాక్ లో ట్యాక్సీలను పరిచయం చేసిన సంస్థ.. ఇంటినుంచి, లేదా ఆఫీసులనుంచి ప్రయాణీకులను తరలిస్తూ ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుని, ప్రస్తుతం మోటర్ బైక్ సర్వీసులను కూడ ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఉబెర్ సంస్థ... ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 బిలియన్ డాలర్లతో 68 దేశాల్లోతమ సేవలను ప్రారంభించినప్పటినుంచీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పలు ప్రాంతాల్లో డ్రైవర్ల కారణంగా ఎన్నో అడ్డంకులను చవిచూసింది. అయితే ఇతర ట్యాక్సీల మీటర్లు, రేట్లతో ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రయాణీకులను ఆకట్టుకోవడంతో పాటు బ్యాంకాక్ లో గ్రాబ్ టాక్సీలకు సవాలుగా నిలుస్తోంది. సాధారణ మోటర్ బైక్ ట్యాక్సీలకంటే భిన్నంగా అత్యంత చవుకగా ఇప్పుడు ఉబెర్ మోటర్ బైక్ ట్యాక్సీలను ముందుగా బ్యాంకాక్ లోని కొన్ని జిల్లాల్లో ప్రవేశ పెడుతోంది. ట్రాఫిక్ సమస్యతో బాధపడే థాయిల్యాండ్ పై అధికంగా దృష్టిని పెట్టిన ఉబెర్... ఇప్పుడు ఆసియాలోని అనేక ట్రాఫిక్ బాధిత ప్రాంతాలపై కూడ దృష్టి సారించనుంది. -
పండుగ వేళ..మృత్యుహేల
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం ఇద్దరు యువకుల దుర్మరణం మద్యం మత్తులో నడపడమే కారణం? శోకసంద్రంలో మృతుల కుటుంబాలు ములుగు : ద్విచక్రవాహనం అదుపు తప్పి శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతిగా మద్యం తాగి ఇంటికొస్తుం డగా ఎదురుగా వచ్చిన లారీ లైట్ల వెలుతురు కళ్లపై పడటంతో సదరు యువకులు ద్విచక్రవాహనంపై అదుపు కోల్పోరుు, లారీని ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరి దుర్మరణంతో బాధిత కుటుంబాల్లో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నారుు. ములుగు మండలంలోని పాల్సాబ్పల్లికి చెందిన బిల్లా నర్సింహారెడ్డి అలియాస్ నాని (28), ములుగు మండలకేంద్రానికి చెందిన పైడిమల్ల శ్రావణ్ (23) సంక్రాంతి రోజున స్థానికంగా విందు చేసుకున్నారు. విందు అనంతరం ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా జాకారంలోని మసీదు సమీపంలో రోడ్డు పక్కకు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు.మృతులిద్దరూ అవివాహితులే. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను 108 వాహనంలో ములు గు సివిల్ ఆస్పతికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామాల్లో అం త్యక్రియలు నిర్వహించారు. ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, ఎంపీటీసీ పోరిక గోవింద్‌నాయక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. తల్లి మందలించినా వినకుండా వెళ్లిన శ్రావణ్ మృతుడు పైడిమల్ల శ్రావణ్ ఇటీవల అయ్య ప్ప మాల వేసుకొని విరమించుకున్నాడు. అతడి తండ్రి సురేందర్ మాలను కొనసాగిం చి విరమణకు శబరిమలకు బయలుదేరారు. తండ్రి ఇంట్లో లేకపోవడంతో శ్రావణ్ శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళుతుండగా..‘ ఈ రాత్రి ఎటుపోతన్నవ్ కొడుక. ఎక్కడికి పోకు’ అని మందలించింది. తల్లి మాట లను పట్టిం చుకోకుండా శ్రావణ్ తన స్నేహితుడు బిల్లా నానితో కలిసి విందుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా తమ కుమారుడు మృతిచెందాడనే విషయం తెలుసుకున్న సురేందర్ శబరి యూత్రనువిరమించుకొని, ఇంటికి తిరిగి బయలుదేరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్రంగా గాయపడింది. తిప్పర్తి మండలం మడకలపల్లికి చెందిన కట్టా వెంకటరెడ్డి, ఆయన భార్య వాణి మోటార్ బైక్‌పై వేములపల్లికు వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న మైలురాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా వాణి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. గాయపడిన వాణిని వేములపల్లి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పోలవరం మండలం కృష్ణారావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. తాళ్లపూడి నుంచి పోలవరం వైపు ద్విచక్రవాహనం పై వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. మృతిచెందిన యువకుడు సింగనపల్లి గ్రామానికి చెందిన జారేపల్లి చిన్నారావు(27)గా గుర్తించారు. -
ఐదు నెలల్లో పది లక్షల హోండా యాక్టివా అమ్మకాలు
నంబర్ వన్ టూవీలర్గా హ్యాట్రిక్ ముంబై: హోండా యాక్టివా స్కూటర్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 10 లక్షలు అమ్ముడయ్యాయి. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ-వీలర్‌గా యాక్టివా నిలిచిందని హోండా మోటార్‌సైకిల్ అండ స్కూటర్ ఇండియా తెలిపింది. కొన్ని నెలలుగా టూవీలర్ల మార్కెట్లో అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నప్పటికీ, ఈ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలానికి 10,01,350 యాక్టివాలను విక్రయించామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని వివరించారు. పండుగ సీజన్ ఇలాంటి జోష్‌తో ఆరంభమైనందుకు ఆనందంగా ఉందని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత మురమత్సు చెప్పారు. వరుసగా మూడు నెలల పాటు అత్యధికంగా అమ్ముడైన టూవీలర్గా యాక్టివా హ్యాట్రిక్ కొట్టిందని తెలిపారు. భారత్‌లో విక్రయమవుతున్న టూవీలర్లలో మూడోవంతు స్కూటర్లదే. ఈ స్కూటర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 59 శాతంగా ఉండగా, ఒక్క యాక్టివా బ్రాండ్ స్కూటర్ల వాటానే 51 శాతంగా ఉంది. మొత్తం టూవీలర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 27 శాతమని అంచనా. -
మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
చాదర్‌ఘాట్ (హైదరాబాద్ సిటీ) : హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉస్మానియా లా కాలేజ్ వద్ద గత నెల 17న చైన్‌స్నాచర్ దాడిలో సునీత ( 40 ) అనే మహిళ తీవ్రంగా గాయపడి మరణించిన ఉదంతం మరువకముందే అలాంటి సంఘటనే మలక్‌పేటలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఫ్లైఓవర్‌పై మంగళవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. మలక్‌పేటకు చెందిన భార్యాభర్తలు నాంపల్లిలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు దుండగులు వారిని బైక్ పై వెంబడించారు. మహిళ మెడలోని నాలుగు తులాల గొలుసును బలంగా లాక్కుని ఉడాయించారు. ఈ ఘటనలో వర్థనమ్మ అనే మహిళ బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అమెను యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలా వెళ్లి.. అలా వస్తున్నారు..
- చైన్స్నాచర్లకు నామమాత్రంగానే శిక్షలు - వెంటనే బెయిల్ - గత మూడేళ్ల రిపోర్టులే నిదర్శనం - తొలిసారిగా ఓ మహిళ మృతి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. బంగారానికి డిమాండ్ ఉండటంతో పాటు సులభంగా విక్రయించడం, ఈ చోరీ కేసులో నామమాత్రపు శిక్షలు పడుతుండటం కూడా వీరి ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. కలచివేసిన సుమిత్ర మృతి.. తార్నాక ఎస్బీహెచ్లో తమ ఖాతా వివరాలు తెలుసుకొని తిరిగి కుమారుడితో ద్విచక్రవాహనంపై ఓయూ క్యాంపస్ మీదుగా వెళుతున్న సుమిత్ర మెడలోని బంగారు గొలుసును తెంచే క్రమంలో ఆమెను నెట్టేయడంతో మెదడుకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళ చైన్ స్నాచింగ్ ఘటనలో మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. బంగారం పోతే మళ్లీ కొనుక్కోవచ్చు.. కానీ పోయిన ప్రాణాన్ని ఎవ్వరూ తెచ్చివ్వగలరూ అంటూ కుటుంబసభ్యులు చేస్తున్న రోదనలు కలచివేస్తున్నాయి. నామమాత్రపు శిక్షలేనా..? 2012లో 667 కేసులు నమోదైతే 304 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. వీటిలో 53 కేసుల్లో నామమాత్రపు శిక్ష పడింది. 62 వీగిపోగా, రెండు రాజీకి వచ్చాయి. 2013లో 695 కేసులు నమోదైతే 286 చార్జిషీట్లు దాఖలయ్యాయి. 47 కేసుల్లో నిందితులకు శిక్ష పడగా, 34 వీగిపోయాయి. నాలుగు రాజీ కుదిరాయి. 2014లో 555 కేసులు నమోదైతే 104 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. 15 కేసుల్లో శిక్ష పడగా, నాలుగు వీగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 150 కిపైగా బంగారు గొలుసు దొంగతనాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ పెద్ద సంఖ్యల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. ఐపీసీ 382 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేస్తుండటంతో వీరు జైలుకు అలా వెళ్లి ఇలా బెయిల్ తెచ్చుకుంటున్నారు. శిక్ష కాలం కూడా తక్కువగా ఉండటంతో ఈ నేరాలనే కొనసాగిస్తున్నారు. కొన్ని కేసులు చార్జిషీట్ వరకు కూడా వెళ్లడం లేదు. కొందరు అమ్యామ్యాలు తడిపి కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇప్పటివరకు బంగారు గొలుసు దొంగలను పట్టుకొని స్వాధీనం చేసుకున్న సంఘటనలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెరపైకి ఐపీసీ 302 సెక్షన్.. సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టం చేస్తామని చెబుతున్న సిటీ పోలీసులు కనీసం పోలీసు స్టేషన్ ముందున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వాడటం లేదు. అవి పనిచేసి ఉంటే సుమిత్ర మృతికి కారకుడైన దొంగ దొరికి ఉండే వాడేమో. అయితే ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో సీసీటీవీ వైర్లు తెగిపోయి అవి పనిచేయడం లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తార్నాకతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డ సుమిత్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగినా రోజునా ఐపీసీ 356 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా యూనివర్సిటీ పోలీసులు, సుమిత్ర మృతితో తాజాగా ఐపీసీ 302 సెక్షన్ (హత్య కేసు) కింద కేసు నమోదుచేశారు. తొలి సెక్షన్ కింద కేవలం ఆరునెలలే జైలు శిక్ష పడే అవకాశముండగా, తాజాగా నమోదుచేసిన 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార పడే అవకాశముంది. బాధితురాలి మరణించడంతో నేర తీవ్రతను పెంచుతూ తొలిసారిగా ఐపీసీ 302 సెక్షన్‌ను చైన్ స్నాచర్‌పై నమోదుచేశారు. చాలా బాధగా ఉంది... చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళ మృతి చెందడం చాలా బాధగా ఉంది. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నా. గొలుసు చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పొల్చుకుంటే కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఘటనను మేం తీవ్రంగా తీసుకొని ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. దొంగను పట్టుకునేందుకు ఇప్పటికే నగరంలోని వివిధ విభాగాల బృందాలు పనిచేస్తున్నాయి. -స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, సిట్ అండ్ క్రైమ్స్ -
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
-
టూవీలర్ అమ్మకాల్లో టాప్ హోండా యాక్టివా
-
రహ‘దారి’ ఏది?
- ఏటా లక్షల్లో రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు - విపరీతంగా పెరుగుతున్న ద్విచక్రవాహనాల సంఖ్య - నగరవాసుల్లో ఏడాదికేడాది పెరుగుతున్న మోజు - ఫలితంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు - ఆందోళనను కలిగిస్తున్న కాలుష్యం తీవ్రత సాక్షి, ముంబై: నగరంలో రోజురోజుకూ ద్విచక్ర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తత్ఫలితంగా కిక్కిరిసిన వాహనాలతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముంబై రిక్షామెన్ యూనియన్ నాయకుడు తంపీ కురేన్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు.. ఏప్రిల్-2013 నుంచి మార్చి 2014 మధ్య కాలంలో వాహనాల సంఖ్య 1,86,640 కు పెరిగింది. మార్చి 1998 నుంచి మార్చి 2013 వరకు ప్రతి సంవత్సరం 88,510 వాహనాలు సగటున రోడ్లపైకి వస్తున్నాయి. కొత్తగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను చూసి అధికారులు నిర్ఘాంత పోతున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలోని మూడు ఆర్టీవో కేంద్రాల్లో 23,74,038 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో అంధేరి ఆర్టీవో కార్యాలయంలో 1,86,640 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వడాలా, తాడ్‌దేవ్ ఆర్టీవో కార్యాలయాలలో 1,02,829 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో నగరంలో ద్విచక్రవాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో తెలుస్తోంది. 1998 ఆర్థిక సంవత్సరం వరకు నగరంలో కేవలం 3,54,799 ద్విచక్రవాహనాలు ఉండగా మార్చి 2013లో వీటి సంఖ్య 12,35,282కు పెరిగింది. 1998 నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా కార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. 1998లో నగర రోడ్లపై 2,73,581 కార్లు ఉండగా, మార్చి 31, 2014 వరకు కార్ల సంఖ్య 7,28,225కు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో 166 శాతం కార్ల సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు. దీంతో కాలుష్య కారకాల జాబితాలో ఆటోలతోపాటు కార్లు కూడా చేరాయి. ప్రస్తుతం నగర రహదారులపై డీజిల్ కార్ల సంఖ్య పెరగడంతో కార్ల వల్ల జరుగుతున్న కాలుష్యం కూడా ఏమంత తక్కువేం కాదన్నారు. దీంతోపాటు అత్యంత క్యూబిక్ కెపాసిటీ(సీసీ) ఉన్న వాహనాలు రోడ్లపైకి వస్తుండడం, వాటి వేగం కూడా ఎక్కువగా ఉంటుండడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. -
హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ను ధరించి ప్రాణ రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విజయనగర పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ రకాల హోర్డింగ్ (ప్లెక్సీ), బ్యానర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలతో పాటు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్ల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణాలతో బయటపడడంతో పాటు కాలుష్యం బారి నుంచి బయట పడతారన్నారు. 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరిం చుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు, వాహనచోదకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాలీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రవాణాకు మాత్రమే ఉపయోగించాల్సిన వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, హెడ్లైట్లు, సిగ్నల్ లైట్లు సరిగ్గా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణంగా గుర్తించామన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన హోర్డింగ్‌లను పట్టణంలో ముఖ్య కూడళ్లలోను, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు ట్రాఫిక్ గుర్తులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, ఒకటో పట్టణ సీఐ ఎ.రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి.లీలారావు, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ వి.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.