నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్రంగా గాయపడింది.
నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్రంగా గాయపడింది. తిప్పర్తి మండలం మడకలపల్లికి చెందిన కట్టా వెంకటరెడ్డి, ఆయన భార్య వాణి మోటార్ బైక్‌పై వేములపల్లికు వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న మైలురాయిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా వాణి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. గాయపడిన వాణిని వేములపల్లి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.