బైక్‌ను ఢీకొట్టిన కారు.. మహిళ మృతి | bike rams into car, one died | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు.. మహిళ మృతి

Published Sun, Mar 12 2017 10:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

bike rams into car, one died

సూర్యాపేట: వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాయిన్‌గూడెం సమీపంలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీ కొట్టడంతో.. ద్విచక్ర వాహనంపై ఉన్న ఓ మహిళ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రకి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement