తార్‌మార్‌ తక్కెడ మార్‌ | Bangalore woman working on laptop while riding pillion on Rapido bike taxi | Sakshi
Sakshi News home page

తార్‌మార్‌ తక్కెడ మార్‌

Published Sun, May 21 2023 1:19 AM | Last Updated on Sun, May 21 2023 1:19 AM

Bangalore woman working on laptop while riding pillion on Rapido bike taxi - Sakshi

‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్‌ తక్కెడ మార్‌ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్‌ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ  ఫొటో మాత్రం తెగ వైరల్‌ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

దక్షిణ బెంగళూరులో టూ–వీలర్‌ ర్యాపిడో(బైక్‌ ట్యాక్సీ సర్వీస్‌)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్‌ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్‌లైన్‌లు, హసిల్‌ కల్చర్‌ గురించి చర్చించారు. ఒక యూజర్‌ గత నెల వైరల్‌ అయిన వీడియో పోస్ట్‌ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్‌ చేస్తూ కనిపిస్తాడు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement