బనశంకరి: బైక్ ట్యాక్సీ రైడర్ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి బైకు నుంచి కిందకు దూకిన యువతి గాయపడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. బాధితురాలు (30) ప్రైవేటు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్ చేసింది.
ఈ క్రమంలో యువతిని పికప్ చేసుకున్న బైకర్ ఆమె మొబైల్‌ను లాక్కుని, కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. వెళ్లాల్సిన చోటుకు కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. భయాందోళనకు గురైన ఆమె బీఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ వద్ద బైకు నుంచి దూకడంతో గాయపడింది. ఒక స్నేహితురాలికి, అలాగే పోలీసులకు కాల్ చేసి సాయం అడిగింది. అయితే పోలీసులు ఇది ప్రేమికుల గొడవ అనుకుని స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగికదాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bengaluru: Woman Jumps Off Moving Bike As Rapido Driver Allegedly Tried To Grope Her, In Yelahanka#TNShorts #Bengaluru #Rapido pic.twitter.com/d8terilj3z
— TIMES NOW (@TimesNow) April 26, 2023
Comments
Please login to add a commentAdd a comment