bike taxi
-
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు
రాత్రి వేళల్లో మహిళలు, బయటికి వెళ్లాలంటేనే భయపడే రోజులు. మెట్రోలు, క్యాబ్ లాంటిసేవలు ఎన్ని అందుబాటులో ఉన్నా భద్రత ఎపుడూ ఒక సవాల్‌గానే ఉంటుంది. ప్రతీ పదిమంది ఏడుగురు వేధింపులకు లోనవుతున్నారు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు విశేషంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మహిళలు, బాలికల భద్రత, సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు సోదరీమణులు. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకోసం మహిళా డ్రైవర్లతో మహిళలే నిర్వహిస్తున్న సేవలు కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ద్వయం మహిళల కోసమే ఈ బైక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. జైనాబ్ కాతూన్,ఉజ్మా కాతూన్ ప్రత్యేక బైక్టాక్సీ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ ‘డవ్‌లీ’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. డోవ్లీలో రైడర్లు, కస్టమర్లు మహిళలే ఉంటారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీఅందిస్తుంది. వీరికి మహమ్మద్ ఒబైద్ ఉల్లా ఖాన్, మసరత్ ఫాతిమా సహకారం అందించారు.భద్రతకు పెద్ద పీట‘డవ్‌లీ’ వ్యవస్థాపకురాలు,సీఈవో జైనాబ్ ఖాతూన్ మాటల్లో చెప్పాలంటే నగరంలోని మహిళలు , బాలికలకు రోజువారీ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ,సౌకర్యవంతంగా సేవలందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భద్రతకు పెద్ద పీట వేస్తూ రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అయితే రైడర్ ప్రయాణం ముగిసేవరకు లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా మొదలైన డోవ్లీ సేవలు చాలా తక్కువ సమయంలోనే బాగా విస్తరించాయి. వందలమంది మహిళా డ్రైవర్లకు ఉపాధి లభించింది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పెంచి, భవిష్యత్తులో రైడర్ల సంఖ్య పెంచి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని భావిస్తున్నారు. విరివిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. దీంతో వీరి స్టార్టప్ మరింత విజయం సాధించాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
బైక్ ట్యాక్సీలకు ‘మహాలక్ష్మి’ గండం
హైదరాబాద్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచి్చంది’ అన్నట్లుంది తెలంగాణలో బైక్ ట్యాక్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో.. దీని ప్రభావం ప్రత్యక్షంగా ఆటోలు, క్యాబ్‌లు, బైక్ ట్యాక్సీలపై పడుతోంది. మహిళలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం చాలా వరకు తగ్గించారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే గ్రేటర్లో 5 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. బైక్ ట్యాక్సీల బుకింగ్‌లు తగ్గిపోవడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బైక్ ట్యాక్సీ కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో బైక్ క్యాపె్టన్ల ఆదాయం సగానికి పైగా తగ్గిపోయింది. తగ్గిన ఆదాయం.. ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్లు బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నాయి. సాధారణంగా ఈ బైక్ ట్యాక్సీలను నిరుద్యోగులు, విద్యార్థులు పార్ట్‌టైం జాబ్‌గా నడుపుతుంటారు. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 70 వేల మంది బైక్ ట్యాక్సీ క్యాపె్టన్లు ఉండగా.. వీరిలో మహిళా బైక్ క్యాపె్టన్లు 300 నుంచి 400 మంది ఉంటారు. వీరికి కిలోమీటర్ల చొప్పున ఆయా కంపెనీలు బైక్ క్యాపె్టన్లకు కమీషన్ ఇస్తుంటాయి. అయితే మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఒక్కో క్యాపె్టన్కు రోజుకు 20కి పైగా బుకింగ్‌లు వస్తుండేవి. పెట్రోల్ ఖర్చులు పోను రోజుకు రూ.1,000 పైగానే ఆదాయం సమకూరేది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలుల్లోకి వచ్చాక బుకింగ్‌లు చాలా వరకు తగ్గిపోయాయని ఓలా బైక్ క్యాపె్టన్ శ్రీను తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు అగ్రిగేటర్ సంస్థలు కూడా బైక్ క్యాప్టెన్ల కమీషన్లను సగానికి పైగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ధరలను తగ్గించాయన్నారు. గతంలో 15–25 కిలో మీటర్ల బుకింగ్‌కు కనిష్టంగా రూ.150–180 వరకు ఛార్జీ వచ్చేదని, కానీ ఇప్పుడు రూ.60–80కి మించి రావడం లేదన్నాడు. మార్గదర్శకాలు రూపొందించాలి.. సాధారణంగా వాహన అగ్రిగేటర్లే ధరలను నిర్ణయిస్తుంటారు. కంపెనీల వద్ద కస్టమర్ల డేటా నిక్షిప్తమై ఉండటంతో ఆల్గరిథం సాంకేతికతతో కస్టమర్ల డేటా, రోజు, డిమాండ్‌ను బట్టి సంస్థలు ధరలను మారుస్తుంటాయని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సల్లావుద్దిన్ తెలిపారు. అందుకే ఆటో, క్యాబ్, బైక్ అగ్రిగేటర్లు ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ఇందుకోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఆటోలు, క్యాబ్‌ల తరహాలోనే బైక్ ట్యాక్సీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. -
నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్‌ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. రైడ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు. డబ్బులు ఎలా సంపాదించాలి? రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్ విడుదల చేసిన ఓ పాంప్లెట్లో పేర్కొన్నారు. ఓలా విడుదల చేసిన పాంప్లెట్లో ఏముందంటే? బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్ వరకు ఫిక్స్డ్ పేమెంట్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్‌ల కోసం డ్రైవర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు. వాళ్లు మాత్రం అనర్హులే అదే సమయంలో, డ్రైవర్లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది. తక్కువలో తక్కువగా నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్ 10 రైడ్లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్లో హైలెట్ చేసింది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం
హైదరాబాద్: బైక్ ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టినట్లు ఆటో–టెక్ అగ్రిగేటర్ సంస్థ ర్యాపిడో తెలిపింది. ఇందులో భాగంగా రేట్ కార్డును సవరించినట్లు వివరించింది. 8 కిలో మీటర్ల వరకు కిలో మీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీనితో ఇతర ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మరింత ఎక్కువగా ట్యాక్సీ కెప్టెన్లకు ఒక్కో ఆర్డరుకు కనీసం రూ. 60 ఆదాయం లభించగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వివరించారు. మిగతా ప్లాట్‌ఫామ్‌లలో ఇది రూ. 40–45గా ఉన్నట్లు పేర్కొన్నారు. కెప్టెన్లకు ట్రిప్పులపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. అంటే రైడర్లు బుక్ చేసే గమ్యస్థానాల గురించి బైక్ కెప్టెన్లకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. బుకింగ్ క్యాన్సిలేషన్లను తగ్గించడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బెంగాలీకి చెందిన ప్రముఖ బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న టీవీ నటి సుచంద్ర దాస్‌గుప్తా బైక్ టాక్సీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్‌లో జరిగింది. (ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) ఎలా జరిగిందంటే.. షూటింగ్ ముగించుకున్న సుచంద్ర దాస్ గుప్తా సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి ఓ యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకున్నారు. బైక్‌పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు ఓ సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు. దీంతో బైక్ రైడర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న ట్రక్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె హెల్మెట్ ధరించినా కూడా ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్నబారానగర్ పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. సుచంద్ర దాస్‌గుప్తా ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించారు. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యారు. (ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) -
తార్‌మార్ తక్కెడ మార్
‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్ తక్కెడ మార్ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ బెంగళూరులో టూ–వీలర్ ర్యాపిడో(బైక్ ట్యాక్సీ సర్వీస్)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్లైన్లు, హసిల్ కల్చర్ గురించి చర్చించారు. ఒక యూజర్ గత నెల వైరల్ అయిన వీడియో పోస్ట్ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కనిపిస్తాడు!! -
బైక్ ట్యాక్సీ రైడర్ వికృత చేష్టలు.. బైక్‌పై నుంచి దూకిన మహిళ!
బనశంకరి: బైక్ ట్యాక్సీ రైడర్ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి బైకు నుంచి కిందకు దూకిన యువతి గాయపడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. బాధితురాలు (30) ప్రైవేటు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్ చేసింది. ఈ క్రమంలో యువతిని పికప్ చేసుకున్న బైకర్ ఆమె మొబైల్‌ను లాక్కుని, కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. వెళ్లాల్సిన చోటుకు కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. భయాందోళనకు గురైన ఆమె బీఎంఎస్ ఇన్స్టిట్యూట్ వద్ద బైకు నుంచి దూకడంతో గాయపడింది. ఒక స్నేహితురాలికి, అలాగే పోలీసులకు కాల్ చేసి సాయం అడిగింది. అయితే పోలీసులు ఇది ప్రేమికుల గొడవ అనుకుని స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగికదాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Bengaluru: Woman Jumps Off Moving Bike As Rapido Driver Allegedly Tried To Grope Her, In Yelahanka#TNShorts #Bengaluru #Rapido pic.twitter.com/d8terilj3z — TIMES NOW (@TimesNow) April 26, 2023 -
నీకు ఇక్కడేం పని.. బైక్ ట్యాక్సీపై ఆటో డ్రైవర్ ఫైర్
బెంగళూరు: ప్రస్తుత కాలంలో బయటకు వెళ్లాలంటే కొంత మంది ట్యాక్సీలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో టాక్సీలు, బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో, వారు ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఓ ఆటో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతో నేలపై కొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ..‘మిత్రులారా, అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి రాజు ఇక్కడ బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోయింది. వేరే దేశానికి చెందిన అతడు వైట్ నంబర్ ప్లేట్ బోర్ట్(ఎల్లో కలర్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ కాకుండా) ఉన్నప్పటికీ ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు’ అంటూ సీరియస్ అయ్యాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్.. పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. సదరు ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. @indiranagaraps is investigating the incident. Strict and necessary action will be taken. https://t.co/QosaVAF0gO — ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) March 7, 2023 -
Dovely: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం
హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గపోయింది. ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. మెట్రోరైలు ఉన్నా రాత్రి వేళలో సర్వీసులు లేవు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు. మహిళలు.. మహిళలు నగరానికి చెందిన జైనాబ్ కాతూన్, ఉజ్మా కాతూన్, మసరట్ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్‌గా మహిళలే ఉండగా ఇందుగా కస్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి. సెక్యూరిటీ కీలకం శాంతిభద్రతలు ఎంతగా మెరుగైనా ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో సరికొత్త సవాళ్లు ఉదయిస్తూనే ఉన్నాయి. అందుకే విమెన్ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ డోవ్లీని అందుబాటులో తెచ్చారు. రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అప్పటి వరకు రైడర్ లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా వాట్సాప్ వేదికగా డోవ్లీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డోవ్లీ పేరుతో యాప్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ప్లేస్టోర్, యాప్స్టోర్లలో అందుబాటులోకి తేలేదు. ప్రస్తుతం డోవ్లీలో కస్టమర్ల సంఖ్య నాలుగు వందలు ఉండగా రైడర్ల సంఖ్య ఇరవైకి పైగా ఉన్నారు. అతి త్వరలోనే రైడర్ల సంఖ్యను రెండు వందల వరకు తీసుకుళ్లి నగరంలో విరివిరిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. చదవండి: ఇది చాలా సీరియస్ ప్రాబ్లెమ్.. పట్టించుకోక పోతే అంతే సంగతులు -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
బౌన్స్ స్కూటీల దొంగ అరెస్ట్
మూసాపేట: పార్కింగ్ చేసిన స్కూటీలను దొంగిలించి అమ్ముతున్న దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఔసలి నరేష్ (28), శంకర్‌పల్లిలోని మైతాబ్ ఖాన్‌గూడలో నివాసముంటున్నాడు. 2018 నుంచి 2020 వరకు బౌన్స్ ద్విచక్ర వాహనాల కంపెనీలో టెక్నికల్ వింగ్‌లో పని చేసి ఆ తర్వాత మైతాబ్‌ఖాన్‌గూడలో మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి స్టేషన్ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పరిధిలో 2 వాహనాలను దొంగిలించి తన షెడ్డుకు తరలించాడు. గతంలో కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో పార్కింగ్ చేసిన వాహనాల జీపీఎస్ తొలగించి సులువుగా వాహనాన్ని దొంగిలించి తన షెడ్డుకు తరలించేవాడు. మూడు వాహనాలను బౌన్స్ స్టిక్కర్ తొలగించి, రంగు మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల దొంగిలించిన మరో వాహనానికి జీపీఎస్ తొలగించకుండా షెడ్డులో ఉంచి ఊరికెళ్లాడు. డీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎల్లస్వామి, పరమేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో జీపీఎస్ ద్వారా మైతాబ్‌ఖాన్‌గూడకు వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకుని నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
బైక్ ట్యాక్సీలతో బెంబేలే!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు రెంటల్ బైక్స్ ఓ రకంగా నరకం చూపిస్తుంటే... బైక్ ట్యాక్సీలు మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నగరంలోని అనేక మంది ఈ బైక్ ట్యాక్సీల వినియోగదారులకు కొన్ని అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటున్నాయి. వీటినిపట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటుఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరువదిలేస్తున్నారు. ఈ తరహాఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా మూడు సంస్థలు ఈ బైక్ ట్యాక్సీ సర్వీసుల్ని అందిస్తున్నాయి. చిన్నాచితకా మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ స్మార్ట్ఫోన్లలో యాప్‌ల ఆధారంగా పని చేసే సంస్థలే. ప్రత్యేక అనుమతి లేకుండానే... రాజధానిలో ఆటోలు నడపాలన్నా, ట్సాక్సీలు డ్రైవ్ చేయాలన్నా ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు కావాలి. ఈ వాహనాలకు ఎల్లో నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలు కావడంతో డ్రైవర్ల అనునిత్యం ప్రయాణికుల్ని రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీరికి ప్రథమ చికిత్స నిర్వహణపై అవగాహన అవసరం. దీనికి సంబంధించిన శిక్షణ ఇచ్చిన తర్వాతే ఈ వాహనాల డ్రైవర్లకు ఆర్టీఏ విభాగం బ్యాడ్జ్ నెంబర్ ఇస్తుంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఈ నెంబర్ కూడా ఉంటేనే వాళ్లు ఆయా వాహనాలు నడపడానికి, ప్రయాణికుల్ని తీసుకుపోవడానికి అర్హులు. అయితే బైక్ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ అమలులో లేవు. వైట్ నెంబర్ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వాళ్లే ఆయా సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకుని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సైతం ఏది బైక్ ట్యాక్సీనో, ఏది సొంత బైకో అర్థం కాని పరిస్థితి. రెండో హెల్మెట్ అత్యంత అరుదే... దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. ఈ నిబంధనను ఇప్పుడిప్పుడే రాజధానిలోని మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే బైక్ ట్యాక్సీని నడిపే డ్రైవర్ కచ్చితంగా తన వద్ద రెండు హెల్మెట్లు కలిగి ఉండాలి. ఒకటి తాను ధరించినా రెండోది తనను బుక్ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. కమర్షియల్ వాహనం కావడంతో ఈ బాధ్యత డ్రైవర్ పైనే ఉంటుంది. అయితే నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్ కమ్ ఓనర్ల వద్ద ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. తన కస్టమర్‌కు కూడా అందించడానికి రెండో హెల్మెట్ కలిగి ఉండటం అనేది అత్యంత అరుదైన సందర్భంలోనే కనిపిస్తోంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజిస్ట్రేషన్ చేసే సంస్థలు చెప్తున్నా అమలు చేస్తున్న వారు మాత్రం ఐదు శాతం కూడా ఉండట్లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం తక్కువ సమయంలోనే ‘మాయం’ అవుతున్నాయి. పని వేళల అమలులో ఆమడ దూరం... ఆ కేటగిరీలో రిజిస్టర్ చేస్తున్నా, లేకున్నా కిరాయికి సంచరించే బైక్‌లు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇది కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనలకు, ప్రమాదాలకు కారణం అవుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పేరొకరిది... వచ్చేది ఇంకొకరు... బైక్ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉంటే... డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే ఫర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో నిర్వాహకులు ‘బ్లాక్’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. పార్ట్‌టైమర్లతో ఇబ్బంది లేదు నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో రెండు రకాలైన వాళ్లు ఉంటున్నారు. దీన్నే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న వాళ్లు మొదటి రకమైతే... పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్న వాళ్లు ఇంకో రకం. రెండో కేటగిరీకి చెందిన వారిలో స్టూడెంట్లు, ఉద్యోగులు ఉంటున్నారు. వీరు తమ విధులకు వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు యాత్రమే ఈ యాప్స్‌ను ఆన్ చేసుకుని, ఆయా మార్గాల్లో ప్రయాణించే వారిని మాత్రమే తరలిస్తుంటారు. వీరి వల్ల పెద్దగా ఇబ్బందులు రావట్లేదు. మొదటి కేటగిరీకి చెందిన వారే ఎక్కువ ట్రిప్పులు వేస్తే అధిక మొత్తం సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో, నిర్వాహకులు అందించే ఇన్సెంటివ్స్ కోసం టార్గెట్స్ పూర్తి చేయడానికో ఎడాపెడా నడిపేస్తూ ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ బైక్ ట్యాక్సీలకు అనుమతులు ఇచ్చేది ఆర్టీఏ విభాగమే.– ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి -
హలో... బైక్ 'పే' చలో
సాక్షి, సిటీబ్యూరో: రాజేశ్ జీడిమెట్ల నుంచి కూకట్పల్లి మెట్రోస్టేషన్‌కు వెళ్లాలి. బస్టాపులో గంటల తరబడి వేచి చూసినా బస్సు రాలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు అరకొరగా తిరుగుతున్నాయి. ఇక లాభం లేదని మరోఆలోచనకు తావు లేకుండా ర్యాపిడో బైక్ ట్యాక్సీనిబుక్ చేసుకున్నాడు.కొద్దిసేపట్లోనే బైక్ ట్యాక్సీ వచ్చేసింది. మెట్రో వరకు ప్రయాణం సాఫీగాసాగిపోయింది. ...ఇలా ఒక్క రాజేశ్ మాత్రమే కాదు.. ఎంతో మంది నగరవాసులు ఇప్పుడు బైక్ ట్యాక్సీల సేవలు వినియోగించుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సకాలంలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకునేందుకు ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఒకే రూట్లో ప్రయాణం చేసేవారు సాధారణంగా క్యాబ్‌లను షేర్ చేసుకునేవారు. కానీ మార్గం ఒక్కటే అయిన వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణికులను చేరవేయాల్సి రావడంతో కొంత జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో చాలామంది ప్రయాణికులు షేర్ క్యాబ్‌లకు బదులు బైక్ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు. సోలో ప్యాసింజర్స్‌కు బైక్ ట్యాక్సీలు ఎంతో అనుకూలంగా ఉంటున్నాయి. క్యాబ్‌ల తరహాలోనే కొన్ని ట్యాక్సీలు రాత్రింబవళ్లు ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తుండగా... మరికొన్ని అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి క్యాబ్‌లతో పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. ఉబర్, ఓలా లాంటి సంస్థలు వివిధ రకాల క్యాబ్ సర్వీసులతో పాటు బైక్ ట్యాక్సీలను కూడా ప్రవేశపెట్టాయి. కానీ ఇటీవల ప్రజారవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ ‘ర్యాపిడో’ బైక్ ట్యాక్సీలతోనే ప్రయాణికులకు చేరువైంది. ఒక్క ర్యాపిడో బైక్ ట్యాక్సీలే నగరంలో ప్రతిరోజు సుమారు 30శాతం ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఉబర్, ఓలా బైక్‌లు సైతం పోటీపడి విస్తరిస్తుండగా... ర్యాపిడో మరో అడుగు ముందుకేసి మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా రైడర్లను ఏర్పాటు చేసింది. మెట్రోరైలుకు అనుసంధానం మెట్రో రైలు ఇప్పుడు లైఫ్‌లైన్‌గా మారింది. ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కానీ చాలామందికి మెట్రో స్టేషన్ వరకు చేరుకోవడం పెద్ద సవాల్‌గా మారింది, మెట్రో మార్గానికి అనుసంధానం చేసే విధంగా సిటీ బస్సులు విస్తరించకపోవడం, మినీ బస్సులు, ఇతరత్రా రవాణా సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ప్రత్యామ్నాయ సదుపాయాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బైక్ ట్యాక్సీలు ప్రస్తుతం ఎంతో అనుకూలంగా మారాయి. ఉదాహరణకు ఉప్పల్ బస్టాపునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మావతి కాలనీ, వెంకటేశ్వర టెంపుల్, శ్రీశ్రీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు నేరుగా వెళ్లేందుకు సిటీ బస్సులు అందుబాటులో లేవు. ఆటోలు బస్టాపు వరకే వెళ్తాయి. అక్కడి నుంచి స్టేషన్ వరకు సెవెన్ సీటర్ ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒక్క రూట్లోనే కాదు. మెట్రోకు సమీపంలోని అనేక ప్రాంతాల్లో, సిటీ బస్సులు అందుబాటులో లేని కాలనీల్లో బైక్ ట్యాక్సీలు పరుగులు తీస్తున్నాయి. మెహిదీపట్నం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్లు, కూకట్పల్లి, జేఎన్టీయూ తదితర ప్రాంతాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. ‘నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోకు రెండువైపులా కనీసం 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా బుకింగ్‌లు వస్తున్నాయి. చాలామంది రాత్రిపూట మెట్రో దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బైక్ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు’ అని చెప్పారు ర్యాపిడో రీజినల్ హెడ్ రాజీవ్ భైరి. ఒక్క ర్యాపిడో మాత్రమే కాదు.. ఉబర్, ఓలా బైక్‌లకు సైతం రాత్రి వేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందని పలువురు రైడర్లు అభిప్రాయపడ్డారు. ప్రమాద బీమా రూ.5 లక్షలు ర్యాపిడో సంస్థ ప్రయాణికులకు ప్రమాద బీమా సైతం కల్పిస్తోంది. ప్రయాణం ప్రారంభమైన వెంటనే ప్రయాణికుడికి, రైడర్‌కు ఇది వర్తిస్తుంది. ‘దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే దాని తీవ్రత మేరకు రూ.5 లక్షల వరకు బీమా ఉంటుందని’ రాజీవ్ తెలిపారు. ప్రస్తుతం బైక్ ట్యాక్సీలు రూ.10 కనీస చార్జీలతో మొదలవుతున్నాయి. కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ బైక్‌ను కొద్దిసేపు వెయిటింగ్లో ఉంచదలిస్తే నిమిషానికి రూ.1.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడి నుంచి చార్జీల రూపంలో వచ్చే డబ్బులో 70శాతం వెంటనే రైడర్ ఖాతాలో చేరిపోతుంది. మరో 30శాతం ర్యాపిడోకు చేరుతుంది. ఆటోలు, క్యాబ్‌ల కంటే బైక్ ట్యాక్సీ చార్జీలు కొంతమేరకు అందుబాటులో ఉండడం వల్ల కూడా ప్రయాణికులు వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. ‘హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి సమీప ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ కంటే బైక్ బెటర్’ అని చెప్పారు విశాల్. సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న అతడు ప్రతిరోజు హైటెక్‌సిటీ నుంచి తార్నాకవరకు మెట్రోలో ప్రయాణం చేస్తున్నాడు. ‘ట్రైన్ దిగిన తర్వాత ఆఫీస్‌కు చేరుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేది. 5 కిలోమీటర్ దూరానికి ఒక్కోసారి గంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధ తప్పింద’ని ఆనందం వ్యక్తం చేశారు విశాల్. సమ్మె ఎఫెక్ట్.. మరింత డిమాండ్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బైక్ ట్యాక్సీలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం బస్సులు అరకొరగా తిరుగుతుండడం వల్ల ప్రయాణికులు వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 7గంటల ఉంచి రాత్రి 12గంటల వరకు ఇళ్లకు చేరుకునే ప్రయాణికులు బైక్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల భద్రత విషయంలో అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తున్నట్లు క్యాబ్ సంస్థలు తెలిపాయి. ‘డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే మా ఎమర్జెన్సీ టీమ్ రెస్పాండ్ అవుతుంది. ఇది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ర్యాపిడో మొబైల్ యాప్‌లో ప్రయాణికుల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. దుష్ప్రవర్తన కలిగిన రైడర్లను తొలగిస్తున్నాం. మా ప్రతి సర్వీసుపై పోలీసుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు రాజీవ్. రోజుకు రూ.1500 ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే రూ.1500 వరకు వస్తాయి. ఒకప్పుడు హైటెక్‌సిటీ నుంచి ఎక్కువ బుకింగ్‌లు ఉండేవి. ఇప్పుడు సిటీలో అన్ని ప్రాంతాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయి. గూగుల్ మ్యాప్ ఆధారంగానే ఎక్కడికైనా వెళ్తున్నాం. – మల్లేష్, రైడర్ సంతృప్తి.. మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వరకు ప్రయాణికులను చేరవేస్తాను. ఈ ప్రొఫెషన్ నాకు చాలా తృప్తినిచ్చింది. ప్రయాణికులు ఎంతో గౌరవం ఇస్తున్నారు. గతంలో మగవారి నుంచి కూడా బుకింగ్‌లు వచ్చేవి. ఇప్పుడు మహిళా రైడర్లు అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులకే ప్రాధాన్యంఇస్తున్నారు. – గాయత్రి, రైడర్ -
బైక్ టాక్సీ బుక్‌చేసిన యువతితో డ్రైవర్..
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సికందర్ బాగ్ నుంచి బైక్ టాక్సీపై న్యూ హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళుతున్న 27 ఏళ్ల అమెరికా యువతిని డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ప్రైవేట్ భాగాల దగ్గర టచ్ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె బైక్ నుంచి దిగిపోయి, తన తోటి ఉద్యోగులకు విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన ఒక యువతి హజరత్ గంజ్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, న్యూ హైదరాబాద్‌లోని మేథా లెర్నింగ్ ఫౌండేషన్‌లో పనిచేస్తోంది. ఉదయం ఆమె తన కార్యాలయానికి వెళ్లేందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఆమెను బైక్‌పై తీసుకు వెళుతుండగా డ్రైవర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఆమెను వేధించడం మొదలెట్టాడు. వద్దని వారించినా వినకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో బైకి దిగి వెళ్లిపోయిన యువతి.. తోటి ఉద్యోగుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ ట్యాక్సీలకు ఆదరణ కరువు..
♦ పెట్టుబడులకూ కొరతే ♦ మూతబడుతున్న పలు స్టార్టప్‌లు ♦ నిబంధనల్లో అస్పష్టత కూడా కారణం క్యాబ్‌లకు దీటుగా పలు స్టార్టప్ సంస్థలు బైక్ ట్యాక్సీ సేవలను అట్టహాసంగా ప్రారంభించినా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, పెట్టుబడుల కొరత మొదలైన సమస్యలు దీనికి తోడు కావడంతో దేశీ స్టార్టప్ సంస్థలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి పెద్ద సంస్థల తరహాలో భారీ సబ్సిడీలివ్వలేక కుదేలవుతున్నాయి. ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే బైక్ ట్యాక్సీ సర్వీసులకు లైసెన్సులు ఇస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి చూస్తే తెలంగాణ, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు వాణిజ్యపరమైన బైక్ ట్యాక్సీ సేవలకు ఆమోదముద్ర వేశాయి. హరియాణాలో కమర్షియల్ బైక్ ట్యాక్సీ లైసెన్సులు ఇస్తున్నప్పటికీ .. యాయా, డాట్, టూవీల్జ్, రైడ్జీ వంటి సంస్థలు కార్యకలాపాలు నిలిపివేశాయి. బాక్సీ, ఎంటాక్సీ వంటి మరో రెండు సంస్థలు డెలివరీస్ కార్యకలాపాలకు మళ్లాయి. కాస్తో కూస్తో బాక్సీ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక బెంగళూరు సంగతి తీసుకుంటే హెడ్‌లైట్, హేబాబ్, జింగో సంస్థలు కూడా మూతబడ్డాయి. వ్యాపార సంస్థలకు మాత్రమే సర్వీసులు అందించే అవకాశాన్నీ పరిశీలించామని.. కానీ నిధులు పూర్తిగా అయిపోవడంతో అప్పటికే ఆలస్యమైపోయిందని హేబాబ్ వ్యవస్థాపకుడు విశాల్ బీఎం తెలిపారు. అటు ఇన్వెస్టర్ల నుంచి కూడా ఆసక్తి లేకపోవడంతో మూసివేయక తప్పలేదని పేర్కొన్నారు. ఉబెర్, ఓలా ఆసక్తి అంతంతే.. బైక్ ట్యాక్సీ మార్కెట్ వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోవడంతో ఓలా, ఉబెర్‌లు కూడా పెద్దగా దీనిపై ఆసక్తి కనపర్చడం లేదు. నిబంధనలపరమైన విషయాల్లో నియంత్రణ సంస్థలతో చర్చల్లో పురోగతి లేకపోవడం వల్లే బైక్ ట్యాక్సీల కార్యకలాపాలు ముందుకు సాగలేదని ఉబెర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే, చర్చలు కొనసాగిస్తామని, తగిన సమయంలో బైక్స్‌ను మళ్లీ లాంచ్ చేస్తామని వివరించాయి,. త్వరలోనే బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. సాధారణంగా బైక్ నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 1.7గా ఉంటుంది. కిలోమీటరుకు కనీసం రూ. 8 మేర చార్జీ, కనీసం అయిదు కి.మీ. ప్రయాణ దూరం ఉంటే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని, వ్యాపారాలు నిలదొక్కుకోగలవని బైక్ ట్యాక్సీ సంస్థలు అంటున్నాయి. ఆటోలతో పోలిస్తే ఇది చాలా చౌకేనని చెబుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణాలకి సంబంధించి.. బేస్ ఫేర్ మొదలైనవి కూడా కలిపి చార్జీలు కి.మీ.కి రూ. 7–8 మధ్యలో ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ... కేంద్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై కొత్తగా ముసాయిదా నిబంధనలు రూపొం దించడం స్టార్టప్ సంస్థల్లో కాస్త ఆశలు రేపుతోంది. పడుతూ.. లేస్తూ.. బాక్సీ మిగతా బైక్ ట్యాక్సీ సంస్థలతో పోలిస్తే బాక్సీ, ర్యాపిడో మొదలైనవి కాస్త పెట్టుబడులు దక్కించుకోగలిగాయి. అరవింద్, పవన్, రిషికేష్‌లు ప్రారంభించిన ర్యాపిడో ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి గణనీయంగా పెట్టుబడులు సమీకరించగలిగింది. ఇన్వెస్ట్ చేసిన వారిలో గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్, హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అటు బాక్సీ సైతం దాల్మియా గ్రూప్, హెచ్‌టీ మీ డియా లాంటి దిగ్గజ గ్రూప్‌లతో పాటు ఏంజె ల్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 9 కోట్లు సమీకరించింది. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో బాక్సీ ప్లాట్‌ఫాంపై ప్రస్తుతం 600 పైగా బైక్‌లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 40 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. కేవలం యాప్ బుకింగ్స్‌పైనే ఆధారపడకుండా.. మెట్రో స్టేషన్లు, బైక్ ట్యాక్సీ స్టాం డ్స్‌లో కూడా తమ వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే తోడ్ప డుతోందని బాక్సీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే లాభాలూ ఆర్జించగలమని ధీమా వ్యక్తం చేశాయి. -
నగరంలో ఉబెర్ బైక్ ట్యాక్సీ సర్వీస్
హైదరాబాద్: బహుళ జాతి సంస్ధ ఉబెర్ బైక్ ట్యాక్సీ సర్వీస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దేశంలో బెంగళూరు, గుర్గావ్ తర్వాత హైదరాబాద్‌లోనే ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. బైక్ ట్యాక్సీ సర్వీస్‌లో మొదటి మూడు కిలోమీటర్ల వరకు రూ.20 వసూలు చేస్తారు. ఆపైన ప్రతి కిలోమీటరుకు రూ.5 చోప్పున చార్జ్ అవుతుంది. బండి నడిపే వారితో పాటు ప్రయాణించే వారికి కూడా హెల్మెట్ ఉంటుంది. సుశిక్షితులైన డ్రైవర్లను నియమించినట్లు సంస్థ పేర్కొంది. -
మహిళలకోసం 'బైక్సీ పింక్' సర్వీసులు
-
మహిళలకోసం 'బైక్సీ పింక్' సర్వీసులు
మహిళల సురక్షిత ప్రయాణం కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పింక్ ట్యాక్సీ, పింక్ ఆటో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వినూత్నంగా గుర్గావ్ లో మహిళల కోసం మహిళా డ్రైవర్లతో పింక్ బైక్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారం క్రితం ఐదు పింక్ స్కూటీ సర్వీసులను 'బైక్సీ పింక్' పేరుతో ప్రారంభించారు. ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్నట్లే ఈ బైక్సీలను కూడా యాప్ ద్వారా మొబైల్ నుంచి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ద్విచక్రవాహనాలపై అద్దెకు ప్రయాణించే అవకాశం ఇప్పుడు గుర్గావ్ మహిళలకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త బైక్ టాక్సీ సర్వీసులను జనవరి 20న ప్రారంభించారు. ఇప్పటివరకూ ఇటువంటి సర్వీసు దేశంలో మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దివ్యా కాలియా... ఆమె భర్త మోహిత్ శర్మ లు ఈ బైక్సీ సర్వీసులను ప్రారంభించారు. పదిరోజుల క్రితం మహిళలకోసం బైక్సీ పింక్ లను ప్రారంభించిన ఆ దంపతులు... రోజువారీ ప్రయాణీకులకోసం బైక్సీ బ్లూ సర్వీసులను కూడా ప్రవేశపెట్టారు. మొదటి రెండు కిలోమీటర్లకు పది రూపాయలు, ఆపైన ప్రతి కిలోమీటర్ కు ఐదు రూపాయలచొప్పున బైక్సీ పింక్ ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తారు. ఈ సర్వీసుల్లో ప్రయాణికుల భద్రత, శుభ్రత కోసం చోదకులు తమతో పెప్పర్ స్ప్రే ను ఉంచుకోవడంతోపాటు, హెల్మెట్ లోపల డిస్పోజబుల్ షవర్ క్యాప్ లను కూడా వాడేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రయాణీకుల భద్రతకోసం బైక్సీ యాప్ లో SOS బటన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ బైక్సీ పింక్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే మోటార్ వెహికిల్ యాక్ట్ లో ఇంతకు ముందు బైక్ లను ట్యాక్సీలుగా నడిపే సదుపాయం లేదు. కాగా హర్యానాలో ప్రస్తుతం వాణిజ్య ప్రయోజనాల కోసం ద్విచక్రవాహనాల నిబంధనల్లోనూ రవాణా చట్టాలకు సవరణ చేసి, బైక్ లను కూడా ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో అనేక ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రాంతంలో ట్యాక్సీ సర్వీసులను ప్రారంభిచాయి. ముఖ్యంగా దివ్యా కాలియా ఈ బైక్సీ పింక్ సర్వీసులను తరచుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు, మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు అందుబాటులో ఉండేట్టు ప్రవేశ పెట్టారు. ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యే ఈ బైక్సీలు ప్రవేశపెట్టేందుకు దివ్యాను ప్రోత్సహించింది. ప్రతిరోజూ గుర్గావ్ స్టేషన్ కు ప్రయాణించేందుకు తాను ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చేదని, ఆటోల కొరత, ఎక్కువ డబ్బు వసూలు చేస్తుండటంతో విసిగిపోయి, సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా ఈ బైక్సీ పింక్ లను ప్రారంభించానని దివ్యా చెప్తోంది.