నగరంలో ఉబెర్ బైక్ ట్యాక్సీ సర్వీస్
హైదరాబాద్: బహుళ జాతి సంస్ధ ఉబెర్ బైక్ ట్యాక్సీ సర్వీస్‌ను హైదరాబాద్లో ప్రారంభించింది. దేశంలో బెంగళూరు, గుర్గావ్ తర్వాత హైదరాబాద్‌లోనే ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
బైక్ ట్యాక్సీ సర్వీస్లో మొదటి మూడు కిలోమీటర్ల వరకు రూ.20 వసూలు చేస్తారు. ఆపైన ప్రతి కిలోమీటరుకు రూ.5 చోప్పున చార్జ్ అవుతుంది. బండి నడిపే వారితో పాటు ప్రయాణించే వారికి కూడా హెల్మెట్ ఉంటుంది. సుశిక్షితులైన డ్రైవర్లను నియమించినట్లు సంస్థ పేర్కొంది.