![US Woman Molested By Bike Taxi Driver In Lucknow - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/17/taxi.jpg.webp?itok=qlDtbcrj)
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సికందర్ బాగ్ నుంచి బైక్ టాక్సీపై న్యూ హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళుతున్న 27 ఏళ్ల అమెరికా యువతిని డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ప్రైవేట్ భాగాల దగ్గర టచ్ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె బైక్ నుంచి దిగిపోయి, తన తోటి ఉద్యోగులకు విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన ఒక యువతి హజరత్ గంజ్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, న్యూ హైదరాబాద్‌లోని మేథా లెర్నింగ్ ఫౌండేషన్‌లో పనిచేస్తోంది. ఉదయం ఆమె తన కార్యాలయానికి వెళ్లేందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఆమెను బైక్‌పై తీసుకు వెళుతుండగా డ్రైవర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఆమెను వేధించడం మొదలెట్టాడు. వద్దని వారించినా వినకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో బైకి దిగి వెళ్లిపోయిన యువతి.. తోటి ఉద్యోగుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment