
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బెంగాలీకి చెందిన ప్రముఖ బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న టీవీ నటి సుచంద్ర దాస్‌గుప్తా బైక్ టాక్సీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్‌లో జరిగింది.
(ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్)
ఎలా జరిగిందంటే..
షూటింగ్ ముగించుకున్న సుచంద్ర దాస్ గుప్తా సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి ఓ యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకున్నారు. బైక్‌పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు ఓ సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు. దీంతో బైక్ రైడర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కిందపడిపోయింది.
ఆ సమయంలో వెనకాలే వస్తున్న ట్రక్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె హెల్మెట్ ధరించినా కూడా ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్నబారానగర్ పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. సుచంద్ర దాస్‌గుప్తా ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించారు. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యారు.
(ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..)
Comments
Please login to add a commentAdd a comment