కోల్‌కతా: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టీనా మాస్టర్, నటి షహానాల మృతి మరవకముందే మరో నటి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బుల్లితెర నటి పల్లవి డే (25) ఆదివారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక విచారణలో నటి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ షగ్నిక్ చక్రవర్తిని సైతం విచారించారు. ఆదివారం ఉదయం సిగరెట్ తాగివచ్చేసరికి గది లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉందని, దీంతో డోర్ పగలగొట్టగా పల్లవి ఉరి వేసుకుని కనిపించిందని ఆమె ప్రియుడు తెలిపాడు. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం పల్లవిది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పల్లవి తన ప్రియుడు షగ్నిక్‌తో సహజీవనం చేస్తోంది. గత నెల రోజులుగా వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.
అయితే షగ్నిక్ రెండేళ్ల క్రితం ఓ అమ్మాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని, ఆ విషయం ఈ మధ్యే తెలిసిందని, దాని వల్లే పల్లవి జీవితంలో ఏమైనా సమస్యలు తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు నటి తండ్రి నీలూ డే. పల్లవి డే మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పల్లవి.. ఆమీ సైరాజెర్ బేగం, రేష్మ జపి, కుంజో ఛాయ, సరస్వతి ప్రేమ్, మొన్ మనే నా వంటి పలు బెంగాలీ సీరియల్స్‌లో నటించింది.
చదవండి: రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..
Comments
Please login to add a commentAdd a comment