మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్‌ను అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి తరలించి సాయమందించాడు. దీంతో సాయితేజ్‌ను కాపాడినందుకు మెగా ఫ్యామిలీ అబ్దుల్‌కు కారు, బైకు, లక్ష రూపాయల వరకు నగదు.. ఇలా వరాలు కురిపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తొలిసారి అబ్దుల్ స్పందించాడు. చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్
తేజ్ నుంచి, ఆయన కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇలా అసత్య ప్రచారం వల్ల గతంలో పనిచేసే చోట జాబ్ కూడా మానేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది కాస్తా సాయితేజ్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు.
'అబ్దుల్ ఫర్హాన్‌కు సాయం చేసినట్లు నేను, నా టీమ్ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాను. ఆయన ఫ్యామిలీకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయమని నా మేనేజర్ నెంబర్ ఇచ్చాను' అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇకపై తాను మాట్లాడాలనుకోవట్లేదని కూడా పేర్కొన్నాడు. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్
To whomsoever it may concern..
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
Comments
Please login to add a commentAdd a comment