abdul
-
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు నూతన బాధ్యతలను అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అది ఫేక్ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్ -
‘రాయదుర్గం’లో ఎన్ఐఏ సోదాలు!
రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ (ఏఏఐ) పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాయదుర్గంలోని నాగులబావివీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇంట్లోనే విచారణ చేశారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ను అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీసు భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్‌ట్యాప్‌లో ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీలపై మరో మూడు గంటలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్‌కు సుహేల్, మాతిన్ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. నెలరోజుల క్రితమే బళ్లారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలోని తన స్వగృహంలోనే ఉంటున్నాడు. కేఫ్‌లో బాంబు పేలుడుపై అనుమానాలు..కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ పుటేజీ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగు పడేసి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ఎన్ఐఏ అదుపులో వికారాబాద్ పండ్ల వ్యాపారి?వికారాబాద్: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్‌లో ఒక పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్‌లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతడిపై కర్నాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్ఐఏ అధికార వర్గాల తెలిపాయి. -
శ్వాసే.. ఆ‘ఐ’శ !
వికారాబాద్: పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు అల్లాడిపోతుంది.. అలాంటిది ఏడేళ్లుగా నయం కాని వ్యాధితో చిన్నారి కళ్ల ముందు నేలకే పరిమితమైతే ఆ తల్లిదండ్రుల బాధ, వ్యథ చెప్పడానికి కూడా వీలుకాదు.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చౌడాపూర్ మండలంలోని అబ్దుల్ ఉస్మాన్ కుటుంబం. మందిపల్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఐదేళ్ల వరకు పెద్ద కూతురు అబ్దుల్ ఐశ(15) ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండో తరగతి చదువుకునే సమయంలో ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు సర్జరీ చేశారు. అప్పటి నుంచి బాలికలో ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు క్యాల్షియం లోపం వెంటాడింది. ఐశను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోయేవి. దీంతో తల్లిదండ్రులు బాలికను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఫలితం కనిపించలేదు. పేద కుటుంబ కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఐశ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉంచారు. ఖర్చులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఇంటికి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై నెట్టుకొస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆటో నడిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితిలో కూతురి వైద్యం కోసం నెలకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని అబ్దుల్ ఉస్మాన్ తెలిపారు. ఇన్వర్టర్, కరెంటు బిల్లు రూ. 2వేలు, వాతావరణం వేడిగా ఉండడం కోసం ఓ యంత్రం, ఆక్సిజన్ మిషన్‌కు నెలకు రూ. 6 వేలు, ఇతర ఖర్చులు మరో రెండు వేలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ఐశ స్వతహాగా ఏ పని చేసుకోలేదని, భోజనం కూడా తినిపించాలి ఉంటుందని, ధ్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నట్లు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలని తల్లి తెలిపింది. ఆక్సిజన్ మిషన్ పెట్టడం వల్ల కరెంటు పోకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మూడు గంటలపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐశను సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే పడుకోవాల్సి వచ్చిందని బోరున విలపించారు. ప్రస్తుతం వికలాంగ పింఛను రూ.3,016 వస్తోందని చెప్పారు. కొంత కాలం పాటు మందులు వాడితే బాలిక ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాలిక తండ్రి ఫోన్ నంబర్ 7036042976. -
నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ రుణపడి ఉంటాను : సాయితేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్‌ను అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి తరలించి సాయమందించాడు. దీంతో సాయితేజ్‌ను కాపాడినందుకు మెగా ఫ్యామిలీ అబ్దుల్‌కు కారు, బైకు, లక్ష రూపాయల వరకు నగదు.. ఇలా వరాలు కురిపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తొలిసారి అబ్దుల్ స్పందించాడు. చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్ తేజ్ నుంచి, ఆయన కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇలా అసత్య ప్రచారం వల్ల గతంలో పనిచేసే చోట జాబ్ కూడా మానేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది కాస్తా సాయితేజ్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. 'అబ్దుల్ ఫర్హాన్‌కు సాయం చేసినట్లు నేను, నా టీమ్ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాను. ఆయన ఫ్యామిలీకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయమని నా మేనేజర్ నెంబర్ ఇచ్చాను' అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇకపై తాను మాట్లాడాలనుకోవట్లేదని కూడా పేర్కొన్నాడు. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ To whomsoever it may concern.. Thank You Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023 -
పెళ్లి చేసుకోమంటూ వివాహిత పై దాడి
యాకుత్‌పురా: తనను పెళ్లి చేసుకోమంటూ మహిళను వేధిస్తూ హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్ సలాలా బిస్మిల్లా కాలనీ ప్రాంతానికి చెందిన సయ్యద్ అసద్, షాహేదా బేగం(35) దంపతులు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ అసద్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అసద్ భార్యతో కలిసి చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అబ్దుల్ వాహబ్(38) ఇంట్లో అద్దెకుండేవారు. ఇంటి యజమాని అబ్దుల్ వాహబ్.. షాహేదాబేగంతో సన్నిహితంగా ఉండడంతో పెళ్లి చేసుకోమంటూ వేధింపులు ప్రారంభించాడు. వేధింపులను భరించలేక షాహేదా బేగం ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. కాగా, షాహేదా ఈ నెల 23న యాకుత్‌పురా సాదత్‌నగర్‌లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్ వాహబ్ మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంట్లోకి చొరబడి షాహేదాతో గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మేనత్త అమీరున్నీసా విడిపించేందుకు ప్రయత్నించగా.. ఆమెనూ గాయపడిచాడు. ఇంటి చుట్టుపక్కల వారు రావడంతో వాహబ్ అక్కడి పరారయ్యాడు. షాహేదా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అబ్దుల్ వాహబ్‌ను అరెస్ట్ చేశారు. -
ఈ మూడూ ప్రశ్నించుకుని ముందుకు కదలండి
అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన రెండో ప్రతిజ్ఞ – సమగ్రతతో పనిచేసి సమగ్రతతో విజయాన్ని సాధిస్తాను–అని. ఆయన మాట వెనుక గంభీరమైన ఉద్దేశం ఏమిటంటే... నేను ఈ పని చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారా ? నేను ఈ పని చేస్తే వృద్ధిలోకి వస్తానా? నేను ఈ పని చేస్తే నేనొక్కడినే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజం సంతోషిస్తుందా? అని నిష్పక్షపాతంగా మీరు వేసుకునే ప్రశ్నలకు ఔననేదే సమాధానం అయితే మీరు నిరభ్యంతరంగా ముందడుగు వేయాలని మీకు స్పష్టత ఇవ్వడం. మీ సంకల్పం ఎంత పవిత్రమయితే మీ వెంట నడిచే వాళ్ళ సంఖ్య అంత బలంగా ఉంటుంది. దానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఎవరినీ కూడగట్టుకోనక్కరలేదు. స్వార్థంతో ఉన్నవాళ్ళు కూడా దాన్ని వదిలి మీతో కలిసి అడుగులేస్తారు. అన్నివేళలా మీ అధికారబలం చూసో లేక మీ స్థాయి చూసో మీ వెంట రారు, మంచి బుద్ది, మంచిసంకల్పం ఉంటే మీ వెనుక అశేషంగా జనం తరలి వస్తారు. దానికి ఒక ఉదాహరణ... అబ్దుల్ కలాం నిర్వహించినది భారత రాష్ట్రపతి పదవి. తరువాత ఆయన మరేపదవీ అధిష్టించలేదు. దానికి ముందు ఆయన ఒక శాస్త్రవేత్త. జీవిత పర్యంతం ఆయన శాస్త్రవేత్తే. అంతే. ఆయన శరీరం విడిచి పెట్టేసిన రోజున ఆశ్చర్యం.. చిన్నచిన్నపిల్లలు దీపాలు చేతిలో పెట్టుకుని కాగితాలమీద అబ్దుల్ కలాంగురించిన కొన్ని మాటలేవో రాసుకుని, దీనవదనాలతో నడిచి వెళ్ళారు. యావద్భారతం, ప్రపంచం అంతా ఒక మహాపురుషుడు వెళ్ళిపోయాడని చెప్పి ఎంత బాధపడిందో...!! దానికి కారణం... జీవితకాలంలో ఆయన సంకల్పాలు, ఆయన నడవడిక.. పదిమంది మంచికోరి ఆయన పడిన తపన, దేశంలోని విద్యార్థులందరి అభ్యున్నతి కోరి ఆయన పడిన ఆవేదన. అందుకే ఆయన శరీరం విడిచిపెట్టినా కీర్తి శరీరంతో నిలబడ్డాడు. ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన లక్షణం అది.దేనివల్ల మీరు ప్రేరణ పొందుతున్నారన్న విషయంలో మీకు స్పష్టత, ఒక అవగాహన ఉండాలి. అది లేకపోతే చేయకూడని పనివైపుకి, చేయకూడని ఆలోచన వైపుకి మీ మనసు మళ్ళిందనుకోండి. అక్కరలేని వ్యసనాలకు మనిషి అలవాటుపడతాడు. జీవితాలు భ్రష్టత్వం పడతాయి. మీరు చేసే పని ఇతరులను బాధపెట్టేది కాకూడదు. అది జీవితంలో అలవాటయిందా అంతకన్నా మంచిపని మరొకటి ఉండదు. అలాకాక ఇతరులు బాధపడినా, ఏడ్చినా, నాశనమయిపోయినా నా కేమీ సంబంధంలేదు, నేను ఒక్కడినీ సంతోషపడితే చాలు, నా మనసులో కోరిక తీరితే చాలు..అన్న సంకల్పం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. నేనెంత కష్టపడినా ఫరవాలేదు, పదిమంది సంతోషిస్తారు, కష్టపడడం అంటే తప్పుమార్గంలోకాదు, సంకల్పం పవిత్రమై, చాలామందికి మేలు కలుగుతుందంటే తప్పకుండా మీరు కష్టపడి అటువంటి పనిచేయండి. దీపం తాను హరించుకుపోతూ వెలుగును వెదజల్లినట్లుగా మహాత్ములయిన వాళ్ళందరూ వాళ్ళ జీవితకాలంలో పదిమంది సుఖం ఆశించి నానా బాధలు పడినవారే. బతికున్నంతకాలం కేవలం తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఆలోచించిన వాడెవడో అటువంటి వాడిని సమాజం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుని ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడిచి వెడుతుంది. ఆయన శరీరంలో ఉన్నాడా లేడా అన్న దానితో సంబంధంలేదు. ఆయన కీర్తి శరీరుడౌతాడు. సమగ్రత అన్నది మనిషికి ప్రాణంతో సమానం. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పేదింటికి రూ.45వేల కరెంట్ బిల్లు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,సైదాపురం : ఓ నిరుపేద ఇంటికి నెలకు రూ.45వేలకుపైగా విద్యుత్ బిల్లు వచ్చిన ఘటన తురిమెర్లలో చోటు చేసుకుంది. వివరాలు..తురిమెర్లకు చెందిన అబ్దుల్ తన ఇంటి సర్వీసు నంబర్ 3112335 000162పై ప్రతి నెల రూ.200 బిల్లు చెల్లిస్తుండగా, గత నెలకు సంబంధించి ఏకంగా రూ.45,739 బిల్లు వచ్చింది. దీంతో అవాక్కైన అబ్దుల్ బిల్లు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీశాడు. అధికారులకు సమస్యను విన్నవించి మీటర్‌ను మార్చి ఇవ్వాలని విన్నవించుకున్నాడు. -
ప్రియుడి కోసం భర్తను, అత్తను చంపేందుకు..
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు పెద్ద కుట్రను భగ్నం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకొని ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను, అత్తను గుట్టుచప్పుడు కాకుండా చంపివేద్దామనుకొని చేసిన ప్లాన్‌ను ఛేదించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ఉండగా అబ్దుల్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పశ్చిమ ఢిల్లీలో అబ్దుల్ (27) అనే వ్యక్తికి జిమ్ ఉంది. అందులోకి 40 ఏళ్ల గృహిణీ పొద్దున్నే వ్యాయామం కోసం వెళుతుంటుంది. ఈక్రమంలో వారి మధ్య సంబంధం పెరిగి వివాహేతర అక్రమసంబంధానికి దారి తీసింది. ఈ విషయం అత్త నారాయణ దేవి, భర్త అనూప్‌కి తెలిసి తీవ్రంగా మందలించారు. దీంతో ఎలాగైనా వారిని చంపేయాలని ప్రియుడు అబ్దుల్‌తో కలిసి కుట్ర చేసిన ఆమె ముందు ఆహారంలో మత్తుమందు పెట్టి కుటుంబానికి వడ్డించింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా తిన్నది. ఆ వెంటనే ఆమెను వదిలేసిన అబ్దుల్ ఆమె భర్త, అత్తపై దాడి చేసి చనిపోతారులే అనుకొని వెళ్లిపోయాడు. ఈ లోగా ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. అక్కడ ఏ వస్తువు కూడా దొంగిలించకపోవడంతోపాటు ఆమె భర్త, అత్తకు మాత్రమే గాయాలు అవడంతో ఇంట్లో వారే ఈ సంఘటనకు సహాయపడి ఉంటారని భావించిన పోలీసులు వారిచ్చిన సమాచారం మేరకు అబ్దుల్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కుట్రకు పాల్పడిన గృహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండంతో కోలుకోగానే అరెస్టు చేయనున్నారు.