ప్రియుడి కోసం భర్తను, అత్తను చంపేందుకు.. | Man Arrested for Plotting to Kill Lover's Husband, in-laws | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం భర్తను, అత్తను చంపేందుకు..

Published Thu, Jun 22 2017 10:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

ప్రియుడి కోసం భర్తను, అత్తను చంపేందుకు..

ప్రియుడి కోసం భర్తను, అత్తను చంపేందుకు..

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు పెద్ద కుట్రను భగ్నం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకొని ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను, అత్తను గుట్టుచప్పుడు కాకుండా చంపివేద్దామనుకొని చేసిన ప్లాన్‌ను ఛేదించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ఉండగా అబ్దుల్‌ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పశ్చిమ ఢిల్లీలో అబ్దుల్‌ (27) అనే వ్యక్తికి జిమ్‌ ఉంది. అందులోకి 40 ఏళ్ల గృహిణీ పొద్దున్నే వ్యాయామం కోసం వెళుతుంటుంది. ఈక్రమంలో వారి మధ్య సంబంధం పెరిగి వివాహేతర అక్రమసంబంధానికి దారి తీసింది. ఈ విషయం అత్త నారాయణ దేవి, భర్త అనూప్‌కి తెలిసి తీవ్రంగా మందలించారు.

దీంతో ఎలాగైనా వారిని చంపేయాలని ప్రియుడు అబ్దుల్‌తో కలిసి కుట్ర చేసిన ఆమె ముందు ఆహారంలో మత్తుమందు పెట్టి కుటుంబానికి వడ్డించింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా తిన్నది. ఆ వెంటనే ఆమెను వదిలేసిన అబ్దుల్‌ ఆమె భర్త, అత్తపై దాడి చేసి చనిపోతారులే అనుకొని వెళ్లిపోయాడు. ఈ లోగా ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అర్ధం చేసుకున్నారు.

అక్కడ ఏ వస్తువు కూడా దొంగిలించకపోవడంతోపాటు ఆమె భర్త, అత్తకు మాత్రమే గాయాలు అవడంతో ఇంట్లో వారే ఈ సంఘటనకు సహాయపడి ఉంటారని భావించిన పోలీసులు వారిచ్చిన సమాచారం మేరకు అబ్దుల్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కుట్రకు పాల్పడిన గృహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండంతో కోలుకోగానే అరెస్టు చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement