పేదింటికి రూ.45వేల కరెంట్‌ బిల్లు | poor home abdul shocked power bill comes 45,739 | Sakshi
Sakshi News home page

పేదింటికి రూ.45వేల కరెంట్‌ బిల్లు

Published Tue, Sep 19 2017 10:55 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

భారీగా వచ్చిన విద్యుత్‌ బిల్లు  ,బాధితుడు అబ్దుల్‌ - Sakshi

భారీగా వచ్చిన విద్యుత్‌ బిల్లు ,బాధితుడు అబ్దుల్‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,సైదాపురం : ఓ నిరుపేద ఇంటికి నెలకు రూ.45వేలకుపైగా విద్యుత్‌ బిల్లు వచ్చిన ఘటన తురిమెర్లలో చోటు చేసుకుంది. వివరాలు..తురిమెర్లకు చెందిన అబ్దుల్‌  తన ఇంటి సర్వీసు నంబర్‌ 3112335 000162పై ప్రతి నెల రూ.200 బిల్లు చెల్లిస్తుండగా, గత నెలకు సంబంధించి ఏకంగా రూ.45,739 బిల్లు వచ్చింది.

దీంతో అవాక్కైన అబ్దుల్‌ బిల్లు పట్టుకుని విద్యుత్‌ కార్యాలయానికి పరుగులు తీశాడు. అధికారులకు సమస్యను విన్నవించి మీటర్‌ను మార్చి ఇవ్వాలని విన్నవించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement