![Jaya Ahsan: I am Better Off Being Single - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/76.jpg.webp?itok=9W4WfLLZ)
సింగిల్‌గా ఉండటం ఎంతో బాగుందని అంటోంది నటి జయ ఆశన్. బంధాల్లో చిక్కుకోవడం కన్నా ఒంటరిగా స్వతంత్రంగా జీవించడమే బాగుందని చెప్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా చుట్టూ జరుగుతున్నవాటిని చూస్తుంటే ఒంటరిగా ఉండటమే నయమనిపిస్తోంది. సింగిల్‌గా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అయితే గతంలో మాత్రం కొన్ని స్పెషల్ మూమెంట్స్ మిస్ అవుతున్నట్లు తెలిపింది.
కలిసి కాఫీ తాగడాలు, కబుర్లాడుకోవడాలు మిస్ అవుతున్నానని అనిపించేదని, కానీ అలాంటి క్షణాలను తన కుటుంబం భర్తీ చేసేదని పేర్కొంది. హ్యాపీ సింగిల్ అని చెప్పుకోవడానికి బదులుగా స్వీయ భాగస్వామి అని చెప్పడానికే ఇష్టపడుతుంది నటి. కాగా జయ 1998లో మోడల్ ఫైజల్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా పెట్టారు. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2012లో విడిపోయారు.
ఇకపోతే బంగ్లాదేశీ నటి జయ ఆశన్ మొదటగా కోకా కోలా యాడ్‌లో నటించింది. పంచమి సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో పలు సినిమాలు చేసిన ఆమె ఇక్కడ బెంగాలీ భాషలో అబోర్టో చిత్రం చేసింది. ఆ తర్వాత ఎక్కువగా బెంగాలీలో సినిమాలు చేస్తున్న ఈ నటి త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అనిరుద్ధ చౌదరి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, సంజనా సాంఘి, పార్వతి తిరువోతు, దిలీప్ శంకర్, పరేశ్ పహుజా, వరుణ్ బుద్ధదేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తైంది.
Comments
Please login to add a commentAdd a comment