misbehave with woman
-
బైక్ ట్యాక్సీ రైడర్ వికృత చేష్టలు.. బైక్‌పై నుంచి దూకిన మహిళ!
బనశంకరి: బైక్ ట్యాక్సీ రైడర్ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి బైకు నుంచి కిందకు దూకిన యువతి గాయపడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. బాధితురాలు (30) ప్రైవేటు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్ చేసింది. ఈ క్రమంలో యువతిని పికప్ చేసుకున్న బైకర్ ఆమె మొబైల్‌ను లాక్కుని, కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. వెళ్లాల్సిన చోటుకు కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. భయాందోళనకు గురైన ఆమె బీఎంఎస్ ఇన్స్టిట్యూట్ వద్ద బైకు నుంచి దూకడంతో గాయపడింది. ఒక స్నేహితురాలికి, అలాగే పోలీసులకు కాల్ చేసి సాయం అడిగింది. అయితే పోలీసులు ఇది ప్రేమికుల గొడవ అనుకుని స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగికదాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Bengaluru: Woman Jumps Off Moving Bike As Rapido Driver Allegedly Tried To Grope Her, In Yelahanka#TNShorts #Bengaluru #Rapido pic.twitter.com/d8terilj3z — TIMES NOW (@TimesNow) April 26, 2023 -
ఫ్రెండే కదా అని ఇంటి పిలిస్తే.. దోస్తు భార్యతో అసభ్య ప్రవర్తన!
యశవంతపుర: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన స్నేహితుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కరోశి గ్రామానికి చెందిన సునీల్ (25), జైనాపురకు చెందిన మహంతేశ్‌లు మంచి స్నేహితులు. ఇటీవల మహంతేశ్ భార్యతో సునీల్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, ఆగ్రహానికి గురైన మహంతేశ్ ఈ నెల 2న మాట్లాడాలి అని చెప్పి అతడిని ఇంటికి పిలుపించుకున్నాడు. అనంతరం, కరోశి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీకల దాక సునీల్‌కు మద్యం తాగించాడు. అప్పటికే ఆగ్రహంతో రగలిపోతున్న మహంతేశ్.. మద్యం మత్తులో ఉన్న సునీల్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం, ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో, మహంతేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
తాగిన మత్తులో రెచ్చిపోయిన ఏఎస్పీ.. మహిళతో ఇలాగేనా ప్రవర్తించేది?
మద్యం మత్తులో ఓ జిల్లా పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయాడు. బలవంతంగా యువతిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమిటని ప్రశ్నించిన మహిళలు, పాత్రికేయులపై దాడికి దిగాడు. అడ్డు చెప్పబోయిన సిబ్బందిపైనా లింగ వివక్షతో దూషణలకు దిగాడు. ఉదయమే అనారోగ్యంతో బాధ పడుతున్నానని మొసలి కన్నీరు కార్చుతూ ఆస్పత్రిలో చేరాడు. ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం.. బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా జీవిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు.. అక్కడి ఏఎస్పీ జయకృష్ణ బెహరాను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆయన యువతి ఉన్న ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం కనుగొని, బలవంతంగా తన వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున ఆర్తనాదానాలు చేయడంతో సమీపంలో ఉన్న పాత్రకేయులు దృశ్యాలను రికార్డింగ్ చేయడం ప్రారంభించారు. గమనించిన ఏఎస్పీ.. ఆగ్రహంతో ఊగిపోయారు. లాఠీలతో పాత్రికేయులపై దాడి చేశారు. అడ్డుకొన్న సమీపంలోని మహిళలను కూడా చితకబాదారు. వారించిన సిబ్బందిని సైతం రాయలేని భాషలో దూషించారు. ఏఎస్పీ దగ్గర నుంచి మద్యం వాసన రావడంతో అడ్డుకోవడానికి వచ్చిన స్థానిక మహిళలు సైతం దూరంగా జరిగారు. అనంతరం బాధిత మహిళను రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. వెంటనే పాత్రికేయులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకు దిగారు. విషయం తెలుకున్న కలెక్టర్ భాస్కర్ రైతా ఘటనా స్థలానికి చేరుకుని, పాత్రికేయలతో చర్చలు జరిపారు. @GovernorOdisha @CMO_Odisha @DGPOdisha @odisha_police @MoSarkar5T @CIDOdisha @homeodisha @SecyChief @SpNabarangpur @DMnabarangpur @ministryofhome1 I strongly urge to throw out the Addl.SP Nabarangpur Cum Khaki Clad Goon Jaikrushna Behera immediatly for his heinous & hatred action pic.twitter.com/siDk3s7PXP — Bhajaman Biswal National Human Rights Defender (@Bhajaman_Biswal) September 15, 2022 దర్యాప్తుకు కొరాపుట్ ఎస్పీ ఆదేశాలు బాధిత యువతితో పాటు అడ్డుకోవాడనికి వెళ్లిన మహిళల శరీర భాగాలను తాకుతూ ఏఎస్పీ జయకృష్ణ బెహరా వీరంగం సృష్టించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠీ గురువారం ఉదయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తక్షణమే ఏఎస్పీని విధుల నుంచి తొలగించి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం పార్టీ జిలా అధ్యక్షురాలు షర్మిష్టా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళను అగౌరవంగా పరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యం కారణంతో ఏఎస్పీ జయకృష్ణ గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బాధిత మహిళను పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్ జిల్లా ఎస్పీ వరుణ్ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ బ్రహ్మ దర్యప్తు ప్రారంభించారు. #ସାମ୍ବାଦିକଙ୍କୁ_ମାଡମାରିଲେ_ଅତିରିକ୍ତ_ଏସପି ନବରଙ୍ଗପୁର ଜିଲ୍ଲା ପାପଡାହାଣ୍ଡି ଥାନାରେ ଖବର ସଂଗ୍ରହ ପାଇଁ ଯାଇଥିବା ବେଳେ ସାମ୍ବାଦିକଙ୍କୁ ମାଡମରାଯାଇଛି । ଅତିରିକ୍ତ ଏସପି ସାମ୍ବାଦିକଙ୍କ ଉପରେ ଆକ୍ରମଣ କରିଥିଲେ । #Nabarangpur #Police #Attack #KanakNews pic.twitter.com/g769QBnkOJ — Kanak News (@kanak_news) September 15, 2022 -
అప్పు ఇచ్చిన మహిళ పట్ల దురుసు ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: అప్పిచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన తోట ప్రేమ్‌కుమార్ (43) 2014లో స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలను అప్పుగా తీసుకుని ఏడాది తర్వాత ఇస్తానన్నారు. ఏడాదైనా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో విచారణ చేసిన న్యాయస్థానం సోమవారం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
అసభ్య ప్రవర్తన?.. ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తుండగా స్థానిక ట్రాఫిక్ ఎస్సైతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఉన్నట్లుండి జనాలంతా కలిసి ఆ ఎస్సైను చితకబాదేశారు. ఘటనకు కారణం ఏంటన్నదానిపై అధికారిక స్పష్టత లేకుంది. కానీ, ఓ యువతి సదరు ట్రాఫిక్ ఎస్సై కాలర్ పట్టుకుని మరీ రెండు చెంపలను చెడామడా వాయించడం ఆధారంగా.. ఆ యువతితో ఎస్సై అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సదరు యువతితో పాటు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సైతం అతనిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ట్రాఫిక్ ఎస్సైను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ట్రాఫిక్ ఉల్లంఘించిన సదరు యువతి.. ఆ ట్రాఫిక్ ఎస్సై తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. యువతి, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టూ చేరిన కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను ఉతికి ఆరేశారు. అయితే పక్కనే వైట్ డ్రెస్‌లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను రక్షించే ప్రయత్నం చేశారు. COP ASSAULTED IN DELHI A traffic cop was assaulted in public in South #Delhi's Sangam Vihar. The cop was later dragged by his collar and slapped. @nagar_pulkit reports. pic.twitter.com/FY2Sn9JYyr — Mirror Now (@MirrorNow) June 8, 2022 #WATCH | Delhi: A man and two girls misbehaved with and manhandled Police and Traffic Police personnel. They were stopped as they were triple riding on a motorcycle that was coming from the wrong side and had no front number plate. (Source: Viral video, verified by Police) pic.twitter.com/1ZwP2iBI0N — ANI (@ANI) June 8, 2022 -
యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేసన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ నుంచి ఆర్టీసీ బస్సులో ఓ యువతి(22) ప్రయాణిస్తున్న ఈ క్రమంలో బస్సులో ఎక్కిన ఓ యువకుడు ఆమె వైపు చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే ఆమె 100కు ఫోన్ చేయగా మియాపూర్ పోలీసులు అప్పటికే బస్సు కూకట్పల్లి వరకు రావడంతో అక్కడ పోలీసులను అప్రమత్తం శారు. దీంతో ఆమె బస్ దిగే వరకు.. అక్కడికి చేరుకున్న పోలీసులు తనపై అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తనను క్షేమంగా కాపాడినందుకు పోలీసులకు, మంత్రి కేటీఆర్‌కు సదరు యువతి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. -
మహిళా ఆర్ఎంపీ నెంబర్ తీసుకుని.. ఫోన్లు, మెసేజ్‌లు.. ఏకంగా క్లినిక్‌కు వెళ్లి..
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి): మహిళా ఆర్ఎంపీ డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్థించిన వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన దళిత మహిళ(28) ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తూ గ్రామంలోనే క్లినిక్ నడుపుతుంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం క్లినిక్‌కు వెళ్లి చూపించుకున్నాడు. అదే సమయంలో ఆమె సెల్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 17న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించి క్లినిక్ నుంచి వెళ్లగొట్టింది. రాత్రి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అతన్ని అడగడానికి ఇంటికి వెళ్లగాఅప్పటికే అతడు పరారయ్యాడు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్‌తో టీచర్‌పై.. కుటుంబం ఆత్మహత్య: తండ్రి వివాహేతర సంబంధమే కారణం! -
20 ఏళ్లు జైల్లో.. అయినా మళ్లీ
బంజారాహిల్స్( హైదరాబాద్): మర్డర్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినా ప్రవర్తనలో మార్పు రాలేదు.. పీడీయాక్ట్ నమోదు చేసి రెండేళ్లు జైల్లో ఉంచినా తీరు మార్చుకోలేదు. రౌడీషీట్ ఓపెన్ చేసి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా మార్పులేదు.. తరచూ బెదిరింపులకు పాల్పడుతూ, దారికాచి బెదిరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తూ.. పలువురిని ఇబ్బందులకు గురిచేసే క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. గత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షలో భాగంగా సత్ప్రవర్తన కింద ఏడాది క్రితం విడుదలయ్యాడు. జైలులో ఉన్న స్రత్పవర్తన సమాజంలోకి వచ్చాక మళ్లీ పాత కథనే కొనసాగిస్తున్నాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్‌ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని లక్ష్మీనరసింహ నగర్లో నివసించే ఓ మహిళ పట్ల అదే ప్రాంతంలో నివసిస్తున్న రౌడీషీటర్ లక్ష్మణ్(46) ఈ నెల 11వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను కొట్టడమే కాకుండా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అరుపులు విన్న భార్య అక్కడికి చేరుకొని ఆపేందుకు యత్నించగా లక్ష్మణ్ ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను కిందకు తోసేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రౌడిషీటర్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘పని ఉంది రా’.. ఉద్యోగినిపై ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, కడప: యోగివేమన విశ్వవిద్యాలయం విద్యారంగంలో అభివృద్ధి బాటలో నడుస్తుంటే కొందరు అధ్యాపకుల తీరువల్ల ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయంలోని ‘ప్రధాన’ ఆచార్యుల కార్యాలయంలో సదరు ఆచార్యుడు అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం రోజున కార్యాలయంలో పని ఉందని సిబ్బందిని పిలిపించుకున్న ఈ ఆచార్యుడు ఓ ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఉద్యోగిని ఏడ్చుకుంటూ బయటకి రావడంతో తోటి ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. ఆచార్యుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వాయిస్ రికార్డును బాధితురాలు ఓ అధ్యాపక సంఘం నాయకుడికి పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆచార్యుడిని, ఉద్యోగినిని వేర్వేరుగా పిలిచి ఉన్నతాధికారులు విచారించారు. దీంతో పాటు విశ్వవిద్యాలయం ఉమన్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యులు సైతం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. కాగా మరో ఉద్యోగినికి సైతం రాంగ్‌కాల్స్, అసభ్యకర కాల్స్ వస్తుండటంతో ఆమె కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మూడు నెలల క్రితం ఓ అధ్యాపకుడు ఓ విద్యారి్థని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి సదరు అధ్యాపకుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వీటన్నింటిపైనా కమిటీ వేసి విచారణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. -
బాధితురాలుతో అసభ్య ప్రవర్తన, బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెట్టి మొహం చాటేశారు. డబ్బులు ఇస్తామని నమ్మించి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా నడికుడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆర్.రంగమ్మ కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో హస్పిటల్లో టెక్నీషియన్‌గా పని చేసేది. హస్పిటల్‌కు వచ్చే నర్సింహ్మరావు పరిచయం అయ్యాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇస్తారని చెప్పి జంగిపురం వనపర్తి జిల్లాకు చెందిన ఆవుల రాజేష్‌ను పరిచయం చేశారు. పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇవ్వడంతో పాటు ష్యూరిటీ కింద వనపర్తిలో 7 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికారు. 2019 మార్చి ఏప్రిల్, మే నెలలో రాజేష్‌కు రూ.55 లక్షలు, అతని స్నేహితుడైన సింహచలంకు రూ.15 లక్షలు రాయదుర్గంలోని టింబర్లేక్ కాలనీలో గల వైట్ వాటర్ అపార్ట్మెంట్లో ఇచ్చింది. నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వకపోవడంతో వనపర్తికి వెళ్లి నిలదీయడంతో గత ఫిబ్రవరిలో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి రూ.35 లక్షల చెక్, మధ్యవర్తిగా ఉన్న ఎన్ఎంవీ రావు రూ.35 లక్షల చెక్‌లు ఇచ్చారు. రాజేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆగస్టు 23న రంగమ్మ, ఆమె భర్త రామరావు వనపర్తిలో రాజేష్ ఇంటికి వెళ్లారు. డబ్బు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఇంటి ముందు కూర్చున్నారు. బాకీ తీసుకున్న డబ్బులు ఇవ్వట్లేదని వనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మాట్లాడుకుందామని చెప్పి కారులో శంషాబాద్‌లోని ఓ లాడ్జ్ తీసుకెళ్లగా అక్కడే రెండు రోజుల పాటు అక్కడే ఉన్నట్లు బాదితురాలు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోగా రాజేష్‌తో పాటు సింహచలం వరప్రసాద్, జలవడి సోమశేఖర్, నక్కల రవిందర్‌యాదవ్, ఎం.వీ.రాజు, పవన్‌రెడ్డి, ప్రమోద్ లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి చంపేస్తామని బెదిరించినట్లు రంగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 29న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 420, 506,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. డబ్బులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇచ్చానని బాధితురాలు చెప్పడంతో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం లీగల్ ఒపినీయన్, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
-
పోకిరి రాంబాబు పాడుబుద్ధి
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిని దిశ పోలీస్‌స్టేషన్ సిబ్బంది, మహారాణిపేట పోలీసులు సంయుక్తంగా సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ వివరాలు వెల్లడించారు. జూన్ 24న, అదే నెల 30న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నోవాటల్లో పనిచేస్తున్న అమ్మాయిని ఒక ఆకతాయి పందిమెట్ట ప్రాంతంలో బైక్‌పై వచ్చి హెల్మెట్ పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత మరో మహిళను కూడా అదేమాదిరిగా వేధించాడు. బాధితులు నగర పోలీస్ కమిషనర్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ సహకారంతో మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమారా ఫుటేజీ సాయంతో నిందితుడి బైక్ నంబర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నోవాటల్ జంక్షన్, బీచ్‌రోడ్డులో మఫ్టీలో మహిళా పోలీసులు, బాధితులు, మహారాణిపేట పోలీసులు విడివిడిగా నిఘా పెట్టారు. నోవాటల్ వద్దకు నిందితుడు వచ్చేసరికి మఫ్టీలో గల పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇంతలో బాధిత మహిళలు కూడా అక్కడకు చేరుకుని నిందితుడిని గుర్తుపట్టి దేహశుద్ధి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దిశ చట్టం ప్రకారం ఐపీసీ 354, 354–ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ప్రేమ్‌కాజల్. పక్కన నిందితుడు దుప్పాడ రాంబాబు (నిల్చున్న వ్యక్తి) నిందితుడి దినచర్య అదే.. నిందితుడు అఫీసియల్ కాలనీకి చెందిన దుప్పాడ రాంబాబు(30)గా పోలీసులు గుర్తించారు. పందిమెట్ట ప్రాంతంలో గల ఓ షిప్పింగ్ కంపెనీలో అకౌంటెంట్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని, పెళ్లై భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని ఏసీపీ ప్రేమ్‌కాజల్ తెలిపారు. ఇంటి నుంచి కంపెనీకి వెళ్లే మార్గంలో ఒంటరిగా కనిపించే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే దినచర్యగా పెట్టుకున్నా డు. రాంబాబును విచారించగా గతంలో ఆర్టీసీ కాంప్లక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఒంటరి మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. ధైర్యంగా ఫిర్యాదు చేయండి మహిళల పట్ల ఆకతాయిలు దాడులకు పాల్పడినా, లైంగికంగా వేధించినా బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయా లని ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ కోరారు. ఆకతాయి వేధింపుల విషయంలో బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయడంతో వారిని నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా అభినందించారన్నారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100, 112, మహిళా మిత్ర, సైబర్ మిత్ర (9121211100, 9493336633) ద్వారా పోలీస్‌లకు సమాచారమిస్తే అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాజాగా సోమవారం నుంచి ఈ రక్షాబంధన్ యాప్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారన్నారు. దీనిపై మహిళలకు పూర్తి అవగాహన కలి్పస్తామని పేర్కొన్నారు. సమావేశంలో దిశ పోలీస్ స్టేషన్ సీఐ జి.నిర్మల, టూ టౌన్ సీఐ వెంకటరావు, మహారాణిపేట ఎస్ఐ ఆర్.హెచ్.ఎన్.వి.కుమార్ పాల్గొన్నారు. -
క్యాబ్ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?
సాక్షి, బెంగళూరు : ‘హల్లో నువ్వు నా క్యాబ్ దిగి నోర్మూసుకొని వెళ్తావా లేదా నీ దుస్తులు విప్పి నడిరోడ్డుపై రచ్చరచ్చ చేయాలా’ అంటూ ఉబర్ క్యాబ్ ఎక్కిన ఓ మహిళని డ్రైవర్ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా అర్థరాత్రి నడిరోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. క్యాబ్ డ్రైవర్ బెదిరింపులకు చిగురుటాకులా వణుకుతూ.. బిక్కుబిక్కుమంటూ నడిరోడ్డుపైనే ఆమె అరగంటకు పైగా వేచి ఉన్నారు. అనంతరం మరో క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలు పేరు అపర్ణ. క్యాబ్ ప్రయాణంలో తనకు ఎదురైన ఈ భయానక సంఘటనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆమె ఏమన్నారంటే.. ‘హాల్లో ఫ్రెండ్స్ నా జీవితంలో ఎదురైన భయానక ఘటన ఒకటి మీతో పంచుకుంటున్నాను. గత రాత్రి నేను స్నేహితులో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. రాత్రి సమయం కావడంతో నా స్నేహితులు ఉబర్ క్యాబ్ బుక్ చేసి నన్ను ఇంటికి పంపిచారు. మార్గమధ్య డ్రైవర్ తన స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ.. కస్టమర్లను బూతులు తిట్టాడు. అయినప్పటికీ నేను అతని జోలికి పోలేదు. ఫోన్ మాట్లాడిన తర్వాత అతను నావైపు తిరిగి ‘ చూడడానికి చదువుకున్నదానిలా ఉన్నావ్..డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లొచ్చు కదా? ఎందుకు తాగుతారు. రాత్రి 7గంటలలోపు ఇంటికి వెళ్లక స్నేహితులతో కలిసి ఎందుకు తాగుతారు’ అంటూ నన్ను ప్రశ్నించారు. నేను మద్యం సేవించలేదని, నా గురించి అడగాల్సిన అవసరం మీకు లేదన్నాను. దీంతో అతను నాపై విరుచుపడ్డాడు. చెప్పడానికి వీలు కాని మాటలు అన్నాడు. నువ్వు నా కీప్‌గా కూడా పనికి రావు. నా బూట్లు తూడవడానికి కూడా నువ్వు సరిపోవంటూ అసభ్యకర పదజాలంతో తిట్టడం మొదలెట్టాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో నేను ఉబర్ సేప్టీ బటన్ నొక్కాను. ఉబర్ కస్టమర్ కేర్ నాకు ఫోన్ చేయకుండా డ్రైవర్‌కు ఫోన్ చేశారు. అతను నేను బాగా తాగి ఉన్నానని కస్టమర్ కేర్‌కు బదులిచ్చాడు. నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను. నాకు సహాయం చేయాలని కస్టమర్ కేర్‌ను కోరాను. అయినప్పటికీ ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కస్టమర్‌కేర్‌కు కాల్ చేస్తే అది డ్రైవర్‌కు వెళ్తోంది. నేను గట్టిగా అరవడంతో కస్టమర్ కేర్ నాతో మాట్లాడి క్యాబ్ దిగాల్సిందిగా కోరారు. మరొక క్యాబ్ బుక్ చేశామని అందులో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో డ్రైవర్ మరింత రెచ్చిపోయాడు. వెంటనే క్యాబ్ ఆపేసి ‘ వెంటనే నా కారు దిగి వెళ్లిపో.. లేదంటే ఇక్కడే నీ దుస్తులు విప్పి రచ్చరచ్చ చేస్తా’ అని బెదిరించారు. అప్పుడు రాత్రి 11.15గంటల సమయం అవుతుంది. ఉబర్ కస్టమర్ చెప్పిన ప్రకారం మరో క్యాబ్ రాలేదు. చేసేది ఏమి లేక నా స్నేహితులకు ఫోన్ చేసి మరో క్యాబ్‌లో ఇంటికి వెళ్లాను. ఉబర్ సంస్థ కస్టమర్లకు ఎంత సెక్యూరిటీని ఇస్తుందో ఈ సంఘటన ద్వారా తెలిసిపోయింది. తర్వాత కూడా ఉబర్ నుంచి నాకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. ఒక వేళ నాకు అక్కడ ఏదైనా జరిగిఉంటే ఎలా? ఉబర్ సంస్థ తమ కస్టమర్లకు కల్పించే సెక్యూరిటీ ఇదేనా?’ అంటూ అపర్ణ ట్విటర్లో ప్రశ్నించారు. అమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమకు జరిగిన అనుభవాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఉబర్ క్యాబ్ డ్రైవర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎన్ని కేసులు నమోదైనా సంస్థ తగిన చర్యలు తీసుకోవడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. -
ఖాకీపై క్రమశిక్షణ చర్యలేవీ?
కొందరు పోలీసు అధికారులవ్యవహారశైలి ఆ శాఖకే మచ్చ తెచ్చిపెడుతోంది. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగానే విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగువేస్తున్నారు. ఇందుకు కనగానపల్లిఎస్‌ఐ శ్రీనివాసులు వ్యవహారమేనిదర్శనం. అనంతపురం , కనగానపల్లి: కనగానపల్లి మండలంలో భానుకోట ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం. ఎస్ఐ శ్రీనివాస్ తరచూ తనిఖీల పేరుతో గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సోదాల కోసం వెళ్లినపుడు తన పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడని వివాహిత ఆరోపించింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఎస్పీని కలిసి ఎస్ఐ అసభ్యప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్‌కుమార్ హామీ ఇచ్చారు. 15 రోజులైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తూతూ మంత్రంగా విచారణ ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ వివాహిత ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. అయితే డీఎస్పీ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టకుండా బాధితురాలితో పాటు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని పంపించేశారు. ఎస్ఐ తీరుపై ఆదినుంచీ విమర్శలే.. వీఆర్‌లో ఉన్న శ్రీనివాస్‌ను ఏడాది కిందట కనగానపల్లి ఎస్ఐగా నియమించారు. ఇక్కడ విధుల్లోకి చేరినప్పటి నుంచి అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీస్ సోదాలు, విచారణల పేరుతో గ్రామాలకు వెళ్లినపుడు ఇద్దరు, ముగ్గురు యువతులను ఎస్ఐ ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా చిరుద్యోగిని కూడా లొంగిదీసుకొని వారి సంసారంలోనూ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఎస్ఐ వ్యవహారశైలిపై కొందరు పోలీస్ సిబ్బంది సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహిళా ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో ఆగిన చర్యలు ఎస్ఐ శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే సమయంలో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతిని«ధి జోక్యం చేసుకున్నారు. ఆమె ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసినట్లు తెలిసింది. తనను వచ్చే ఎన్నికల సమయం వరకు ఇక్కడే ఉంచితే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్యమైన నాయకులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు నమోదు చేస్తానని అధికార పార్టీ నాయకులకు ఎస్ఐ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మహిళా ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఎస్ఐపై చర్యలకు బ్రేక్ పడినట్లు తెలిసింది. తోటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసును మహిళా ప్రజాప్రతినిధి వెనకేసుకురావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రయాణికురాలి పట్ల ఓలా డ్రైవరు అసభ్యప్రవర్తన
బనశంకరి : ఓలా క్యాబ్ డ్రైవరు మహిళకు అశ్లీల వీడియో చూపించి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యలహంక ఓల్డ్‌టౌన్ నుంచి జేపీ.నగర్‌కు వెళ్లడానికి గురువారం ఓ మహిళ ఓలా క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌డ్రైవర్, సదరు మహిళను క్యాబ్‌లో పికప్ చేసుకుని విధానసౌధ సిగ్నల్నుంచి క్వీన్స్సర్కిల్ వైపు వెళుతున్న సమయంలో వెనుక సీటులో కూర్చున్న మహిళకు బ్లూ ఫిలిం కనబడేలా తన మోబైల్‌ను పట్టుకున్నాడు. క్యాబ్‌డ్రైవర్ ప్రవర్తనతో భయపడిన మహిళ వాహనం ఆపాలని కోరింది. అయితే అతను పట్టించుకోకుండా జేపీ నగరలో ఆపాడు. దీంతో బాధితురాలు ఒకరోజు ఆలస్యంగా కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌కు మహిళల దేహశుద్ది
-
జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పిన గవర్నర్
చెన్నై : విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్ట్ పట్ల తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కోరారు. అసలేం జరిగిందంటే.. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
-
మహిళా జర్నలిస్ట్ చెంపను తాకిన గవర్నర్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అనుచిత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల ఆయన ప్రవర్తించి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి పేర్కొనడంతో ఆయన ఇరుకున పడినట్లయింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మహిళా పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. సమావేశ ముగింపు సమయంలో వేదికపై నుంచి వస్తున్న గవర్నర్‌ను ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం మంచి పద్థతి కాదంటూ ఆయన చర్యను ఖండించింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి.. ‘ ఆయన ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ గౌరవానికి అలా భంగం కలిగించడం సభ్యత అనిపించుకోదంటూ’ ట్వీట్ చేశారు. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్ అనుబంధ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. Washed my face several times. Still not able to get rid of it. So agitated and angered Mr Governor Banwarilal Purohit. It might be an act of appreciation by you and grandfatherly attitude. But to me you are wrong. — Lakshmi Subramanian (@lakhinathan) April 17, 2018 -
మరో షాక్.. ప్రయాణికురాలికి ఎయిర్ఏషియా సిబ్బంది వేధింపులు
సాక్షి, బెంగళూర్ : ప్రయాణికుల పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు రోజలు క్రితం ఇండిగో సిబ్బంది ఓ వ్యక్తిని ఈడ్చిపడేయటం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే బెంగళూర్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రయాణికురాలిపై ఎయిర్ఏషియా ఎయిర్‌లైన్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పైలెట్‌సహా ఇద్దరు సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె కేసు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో వారి పేర్లను చేర్చారు. అసలేం జరిగిందో యువతి మాటల్లోనే... నవంబర్ 3న ఆ యువతి రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్ ఏషియా విమానంలో ప్రయాణించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమని సూచించటంతో యువతి ఆ పని చేసింది. అయినప్పటికీ పైలెట్‌తో సహా ఆ ఇద్దరు సిబ్బంది అనవరసంగా దూషించారని.. ఒకానోక సమయంలో విమానం నుంచి దించేస్తామని తనను బెదిరించారని ఆమె చెప్పింది. ఇక విమానం సరిగ్గా ఉదయం 12గం.45ని. సమయంలో బెంగళూర్‌లో ల్యాండ్ కాగా.. ప్రయాణికులందరినీ పంపించి వేసి తనను మాత్రం అడ్డుకున్నారని యువతి తెలిపింది. తన తప్పేంటో చెప్పకుండా తనను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే.. పైలెట్‌కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని చెప్పి ఆ ఇద్దరు సిబ్బంది సమాధానమిచ్చారంట. క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. బయట దొరకబుచ్చుకుని సంగతి తేలుస్తామని బెదిరించారని చెప్పింది. అలా కాసేపు సతాయించాక మూడు గంటల ప్రాంతంలో తనను ఎయిర్‌పోర్టు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి నిబంధనలు ఉల్లంఘించినట్లు రిపోర్ట్ చేశారని ఆమె పేర్కొంది. ఆపై స్నేహితురాలి సాయంతో ఆమె ఎయిర్ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనపై ఎయిర్ఏషియా ఇంకా స్పందించలేదు. -
'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు'
పట్నా: ఈ నెల 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన మాట వాస్తవమేనని, అయితే మహిళను తాను వేధించలేదని బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పోలీసులకు చెప్పారు. కాగా ఇంతకుముందు తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత నిజం అంగీకరించారు. 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఎమ్మెల్యేను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మరోసారి ఆయన్ను విచారించనున్నారు. జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే
పట్నా: బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం కటిహార్‌లో గువహటి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సర్ఫరాజ్ ఎక్కారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషన్‌గంజ్ జిల్లా జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.