
ప్రేమ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: అప్పిచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన తోట ప్రేమ్‌కుమార్ (43) 2014లో స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలను అప్పుగా తీసుకుని ఏడాది తర్వాత ఇస్తానన్నారు.
ఏడాదైనా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో విచారణ చేసిన న్యాయస్థానం సోమవారం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.