మల్కాజిగిరి: ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి? | Malkajgiri: 4 Years Girl Suspicious Death After Injection | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి: ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి?

Published Wed, Nov 3 2021 10:06 AM | Last Updated on Wed, Nov 3 2021 11:24 AM

Malkajgiri: 4 Years Girl Suspicious Death After Injection - Sakshi

సాక్షి, మల్కాజిగిరి: ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్‌ మల్కాజిగిరికి చెందిన ప్రసాద్‌ కుమార్తె చిన్నారి (4)కి వాంతులు కావడంతో సోమవారం మల్కాజిగిరిలోని ఓ మెడికల్‌ షాపులో క్లినిక్‌ నిర్వహిస్తున్న మధుసూదన్‌ వద్దకు తీసుకొచ్చారు.  వాంతులు తగ్గకపోవడంతో సాయంత్రం తీసుకెళ్తే చిన్నారికి ఇంజక్షన్‌ ఇచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
చదవండి: వివాహేతర సంబంధం: దూరంగా పెడుతుందనే కోపంతో..

గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం మెడికల్‌ షాపు వద్ద ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు. డాక్టర్‌ మధుసూదన్‌ పరారీలో ఉన్నాడు. 
చదవండి: బంజారాహిల్స్‌: బయటకు వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement