girl suspicious death
-
మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి?
సాక్షి, మల్కాజిగిరి: ఇంజక్షన్ వికటించి బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన ప్రసాద్ కుమార్తె చిన్నారి (4)కి వాంతులు కావడంతో సోమవారం మల్కాజిగిరిలోని ఓ మెడికల్ షాపులో క్లినిక్ నిర్వహిస్తున్న మధుసూదన్ వద్దకు తీసుకొచ్చారు. వాంతులు తగ్గకపోవడంతో సాయంత్రం తీసుకెళ్తే చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. చదవండి: వివాహేతర సంబంధం: దూరంగా పెడుతుందనే కోపంతో.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం మెడికల్ షాపు వద్ద ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. డాక్టర్ మధుసూదన్ పరారీలో ఉన్నాడు. చదవండి: బంజారాహిల్స్: బయటకు వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
హైదరాబాద్ : నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది. అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆస్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
-
ఎంత పనిచేశావు చిట్టితల్లీ!
పెందుర్తి: తల్లి మందలించిందని జనారణ్యంలోకి అడుగు పెట్టిన బాలిక.. కొద్ది గంటలు కూడా కాకముందే ప్రాణాలు పోగొట్టుకుంది. ఓ యువకుడితో మాట్లాడిందని అమ్మ మందలించడంతో అలిగి బయటకు రావడమే ఆమె పాలిట శాపమైంది. బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాలివి.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది. శనివారం తనూజ పాఠశాల నుంచి ఓ యువకుడితో కలిసి వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి తనూజని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే అపార్ట్మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు. తనూజ మృతదేహానికి వైద్యులు ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనుమానాలెన్నో.. మరోవైపు తనూజ మరణం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తనూజ స్నేహితురాలు ఉంటున్న అపార్ట్మెంట్ వైపు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు చేరేది. ఎందుకంటే తనూజ రాత్రి 7 గంటలకు బయటకు రాగా రాత్రి 1 గంట వరకు ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసిన తరువాత రాత్రి 1 గంటకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే తనూజ వెళ్లినట్టు చెబుతున్న స్నేహితురాలిని కూడా వీరు ఆరా తీసి ఉంటారు. మరో కోణంలో చూస్తే తనూజ మాట్లాడిన యువకుడు ఓ బ్యాచ్ తో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ యువకుడిని కలిసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ గ్యాంగ్‌తో కలిసి తనూజపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడి ఆమెను హతమార్చాడా అన్నది మరో అనుమానం. తనూజ మృతదేహంపై సగం వస్త్రాలు, రక్తస్రావం ఆనవాళ్లు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఆమె ముఖంపై మాత్ర మే తీవ్ర గాయాలుండడంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందనుకోవడానికి ఆస్కారం తక్కువ. తనూజను హతమార్చి ఈ అపార్ట్మెంట్ వద్ద మృతదేహాన్ని పడేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలానికి వంద మీటర్ల దూరంలో పోలీసుల నైట్‌బీట్ పాయింట్ ఉండడం గమనార్హం. ముమ్మర దర్యాప్తు తీవ్ర సంచలనం రేపిన తనూజ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులతో పాటు స్నేహితులను, స్థానికులను విచారించారు. తనూజతో మాట్లాడినట్లు చెబుతున్న యువకుడిని తక్షణమే అదుపులోనికి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. ఘటనపై సీపీ యోగానంద్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ భీమారావ్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. -
బాలిక అనుమానాస్పద మృతి
వేటపాలెం: ఓ బాలిక పురుగుమందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక బీబీహెచ్ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం జరిగింది. వివరాలు.. పేరాలకు చెందిన పోగుల బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. 9 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. బ్రహ్మయ్య ఇల్లు వదిలి ఎటో వె ళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలను వేటపాలెం నాయినపల్లికి చెందిన మేనమామ చుండూరి శ్రీనివాసరావు తీసుకెళ్లి పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట మద్దులూరి సీతామహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు బాలిక పద్మినిని తమ ఇంటికి తీసుకెళ్లారు. బాలికతో వారు ఇంటి పనులు చేయించుకుంటున్నారు. దుస్తులు సరిగా సర్దలేదని ఇంటి యజమాని బాలికను మందలించింది. మనస్తాపం చెంది ఇంట్లో పూల మొక్కలకు ఉపయోగించే పురుగుమందు తాగింది. ఇంటి యజమాని స్థానిక వైద్యుల వద్ద బాలికకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందింనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఇంటి యజమాని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎండీ షరీఫ్ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆ తంతును ఆపించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ ఎండీకే ఆల్తాఫ్‌హుసేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించారు. మృత దేహన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.