నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశాడని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది.