ఉమాదేవి (ఫైల్)
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్‌డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది.
అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం
చదవండి: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే...
పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్‌తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment