రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే | Case filed against JD-U MLA for misbehaving with woman on Rajdhani Express | Sakshi
Sakshi News home page

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

Published Tue, Jan 19 2016 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

పట్నా: బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదివారం కటిహార్లో గువహటి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో సర్ఫరాజ్ ఎక్కారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషన్గంజ్ జిల్లా జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement