JDU MLA
-
రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్
పాట్నా: బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగమే కారణం. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసకుంది. అసలేం జరిగిందంటే.. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌లోని దిల్‌నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు(బనియన్,అండర్వేర్)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు. అయితే అదే కంపార్ట్మెంట్లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్ వేషాధారణపై అ్యభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్ ఆ వ్యక్తితో వాదనకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను సైతం దూషించాడు. కాగా మండల్ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని, వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడటంతో కాల్చి వేస్తామని కూడా బెదిరించాడని పాశ్వాన్ ఆరోపించారు. అయితే అతను బిహార్ ఎమ్మెల్యే అని తనకు తెలీయదని పేర్కొన్నారు. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మండల్‌ను రైలులోని మరో కోచ్‌కు మార్చారు. అయితే చివరికి గోపాల్ మండల్ తన చర్యలను సమర్థించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పి ఉందని అందులే కేవలం లోదుస్తులు ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫోటోలు, వివరణ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతన్ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘అండర్ వేర్లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని మాకు తెలియదే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. గోపాల్ మండల్ స్నేహితుడు కునాల్ సింగ్ మాట్లాడుతూ.. మండల్ డయాబెటిస్ పేషెంట్ అని, ఏదో "అత్యవసర పని మీదసం ఢిల్లీ వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మండల్ అధిక బరువు కారణంగా బట్టలతో వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయాడని అందుకే లుంగీ మీద వాష్‌రూమ్ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు. ‘రైలు ఎక్కిన తర్వాత, గోపాల్ వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. తొందరపాటులో తన లోదుస్తుల్లో వెళ్లాడు. అప్పుడే ఓ ప్యాసింజర్ మండల్‌తో మాట్లాడాడు. దీనికి మండల్ బదులేమి ఇవ్వకుండా వాష్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాసింజర్‌తో మాట్లాడారు "అని కునాల్ సింగ్ చెప్పారు. #WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq — ANI (@ANI) September 3, 2021 -
రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం
పట్నా: నలందా మెడికల్ కాలేజీ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటన పట్నా రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో మృత దేహాన్ని గుర్తించారు. చనిపోయింది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్‌గా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నా ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్‌లో ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉందని గురువారం రాత్రి దీపక్ ఇంటినుంచి వెళ్లాడని తెలిపారు. కాగా, బిహార్ రాజకీయాల్లో దీపక్ తండ్రి అవ్‌దేష్ మండల్ కీలక నేతగా ఉన్నారు. ఆయనకు రాజకీయంగా మిత్రులు, శత్రువులు కూడా ఎక్కువేననీ, దీపక్‌ను ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఎమ్మెల్యే కుంటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
బిహార్ టాపర్స్ స్కాంలో మరో సంచలనం!
పాట్నా: బిహార్ టాపర్స్ స్కాం వరుసలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జేడీయూ మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో అత్యంత దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. అంతేకాదు అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనగా.. యూనివర్సిటీ ప్రారంభమైందే 1976లో. అయినా రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో ఎలా కంప్లీట్ చేశారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ఉషా సిన్హా తన పీహెచ్‌డీని సైతం 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం చూసి ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో హిందీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. టాపర్స్ స్కామ్‌లో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. ఈమె భర్త లోకేశ్వర్ ప్రసాద్ గతంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. -
'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు'
పట్నా: ఈ నెల 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన మాట వాస్తవమేనని, అయితే మహిళను తాను వేధించలేదని బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పోలీసులకు చెప్పారు. కాగా ఇంతకుముందు తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత నిజం అంగీకరించారు. 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఎమ్మెల్యేను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మరోసారి ఆయన్ను విచారించనున్నారు. జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే
పట్నా: బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం కటిహార్‌లో గువహటి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సర్ఫరాజ్ ఎక్కారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషన్‌గంజ్ జిల్లా జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.