
బనశంకరి : ఓలా క్యాబ్ డ్రైవరు మహిళకు అశ్లీల వీడియో చూపించి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యలహంక ఓల్డ్‌టౌన్ నుంచి జేపీ.నగర్‌కు వెళ్లడానికి గురువారం ఓ మహిళ ఓలా క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌డ్రైవర్, సదరు మహిళను క్యాబ్‌లో పికప్ చేసుకుని విధానసౌధ సిగ్నల్‌నుంచి క్వీన్స్‌సర్కిల్ వైపు వెళుతున్న సమయంలో వెనుక సీటులో కూర్చున్న మహిళకు బ్లూ ఫిలిం కనబడేలా తన మోబైల్‌ను పట్టుకున్నాడు. క్యాబ్‌డ్రైవర్ ప్రవర్తనతో భయపడిన మహిళ వాహనం ఆపాలని కోరింది. అయితే అతను పట్టించుకోకుండా జేపీ నగరలో ఆపాడు. దీంతో బాధితురాలు ఒకరోజు ఆలస్యంగా కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment