ola cab driver
-
ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్
-
హీరోయిన్‌కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్‌స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్‌పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్‌స్టా గ్రామ్‌లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
‘అతని వల్ల మర్చిపోలేని జ్ఞాపకంగా మారింది’
ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్‌లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్‌కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్‌లో మర్చిపోయానేమో అని భావించి పథాన్కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్‌ను క్యాబ్‌లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు. -
‘ఎక్కడ ఉంటావో తెలుసు.. ముక్కలుగా నరికేస్తా’
బెంగళూరు : ఇంటికి వేళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడో ఓలా క్యాబ్ డ్రైవర్. డబ్బుల విషయంలో గొడవపడి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. బెదిరింపుల దిగాడు. ఎక్కడ ఉంటావో తెలుసు.. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా... నిన్ను అమ్మెస్తా.. నీ సంగతి చూస్తా అంటూ బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్జిత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీకెండ్ జాలీగా గడుపుదామని కోరామంగలాలో సోదరి ఇంటికి వెళ్లారు. గత సోమవారం తిరిగి ఇంటికి వచ్చేందుకై ఆమె నాన్న ఓలా యాప్ ద్వారా షేర్ క్యాబ్ బుక్ చేశాడు. గత సోమవారం ఉయదం 9 గంటల ప్రాంతంలో ఆమె క్యాబ్ డ్రైవర్‌కు పోన్ చేశారు. అతను రాగానే తోటి ప్రయాణికులతో కలిసి కారు ఎక్కారు. మార్గమధ్యలో అందరు దిగిపోయారు. ఆమె చేరాల్సిన ప్రదేశం వచ్చింది. ఆమె క్యాబ్ దిగగానే రూ. 200 ఇవ్వమని అడిగాడు. తన తండ్రి ఓలా మనీ ద్వారా రూ. 70 పే చేశాడని, మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తానని చెప్పింది. దీంతో క్యాబ్ డ్రైవర్ ఆమెపై మండిపడ్డాడు. అసభ్య పదజాలంతో తిట్టసాగాడు. దీంతో ఆర్జిత వాళ్ల నాన్నకు ఫోన్ చేసి డ్రైవర్‌తో మాట్లాడమని చెప్పింది. అతను ఫోన్ లాక్కొని అతన్ని బెదిరించాడు. ‘ మీ కూతురిని చంపేస్తా. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా డబ్బులు ఇవ్వమని చెప్పు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆర్జితకు ఫోన్ ఇవ్వకుండా ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని బెదిరించాడు. చివరకు రూ.500 ఇచ్చి ఆర్జిత తన ఫోన్‌ను తీసుకుంది. అనంతరం సాయంత్రం తండ్రితో కలిసి బనస్వాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. -
మేము బంద్ చేస్తోంటే.. నువ్ పని చేస్తావా..
సాక్షి, ముంబై : పని వేళల్లో మార్పులు, ఆదాయంలో వాటా పెంపును కోరుతూ యాప్-బేస్డ్ క్యాబ్ డైవ్రర్లు ముంబయ్ వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి నిర్వహిస్తున్నారు. ఎవరూ పనుల్లోకి పోకుండా నిరసన పాటిస్తున్నారు. అయితే, బంద్ కొనసాగుతుండగా క్యాబ్ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇప్పుడీ విడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, డ్రైవర్‌పై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తమ ఆదాయాన్ని లాక్కుంటున్నారు.. ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ముంబయ్ వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది యాప్-బేస్డ్ డ్రైవర్లు నిరసనలకు దిగడంతో దేశ వాణిజ్య రాజధానిలో 90 శాతం మేర క్యాబ్‌లు షెడ్లకే పరిమితమయ్యాయి. కాగా, డ్రైవర్లు సోమవారం తమ నిరసనలను ముమ్మరం చేశారు. కుర్లాలోని ఊబర్ కార్యాలయం నుంచి అంధేరిలోని ఓలా ఆఫీస్ వరకు నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ తీశారు. ఓలా, ఊబర్ సంస్థలు కుట్రకు పాల్పడుతున్నాయనీ, కావాలనే వినియోగదారుల వద్ద తక్కువ వసూలు చేసి తమకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. -
ప్రయాణికురాలి పట్ల ఓలా డ్రైవరు అసభ్యప్రవర్తన
బనశంకరి : ఓలా క్యాబ్ డ్రైవరు మహిళకు అశ్లీల వీడియో చూపించి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యలహంక ఓల్డ్‌టౌన్ నుంచి జేపీ.నగర్‌కు వెళ్లడానికి గురువారం ఓ మహిళ ఓలా క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌డ్రైవర్, సదరు మహిళను క్యాబ్‌లో పికప్ చేసుకుని విధానసౌధ సిగ్నల్నుంచి క్వీన్స్సర్కిల్ వైపు వెళుతున్న సమయంలో వెనుక సీటులో కూర్చున్న మహిళకు బ్లూ ఫిలిం కనబడేలా తన మోబైల్‌ను పట్టుకున్నాడు. క్యాబ్‌డ్రైవర్ ప్రవర్తనతో భయపడిన మహిళ వాహనం ఆపాలని కోరింది. అయితే అతను పట్టించుకోకుండా జేపీ నగరలో ఆపాడు. దీంతో బాధితురాలు ఒకరోజు ఆలస్యంగా కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
జాలీ రైడ్.. ఓలా డ్రైవర్‌కు చుక్కలు..!
సాక్షి, బెంగుళూరు: కేరళలోని కొచ్చి నుంచి కర్ణాటకలోకి బెల్గాం వరకు 3,200 జాలీరైడ్ చేసిన ఓ కుంటుంబం ఓలా డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. జూలై 1న ప్రారంభమైన జాలీరైడ్ పదకొండు రోజుల పాటు కొనసాగింది. కానీ, క్యాబ్ చార్జీలూ, హోటల్ చార్జీలు చెల్లించపోవడంతో అసలు విషయం బయటపడింది. వాళ్ల చేతిలో మోసపోయిన క్యాబ్ డ్రైవర్ బిత్తరపోయాడు. ఈ ఘటన ఔట్స్టేషన్కు వెళ్లే ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లకు కనువిప్పును కలిగించింది. వివరాలు.. కొచ్చికి చెందిన కేవీ రాజీవ్ ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న షహన్షా తన కుటుంబంతో కలిసి జాలీరైడ్ చేయడానికి రాజీవ్ క్యాబ్‌ను ఔట్స్టేషన్ ట్రిప్‌కు బుక్ చేసుకుంది. కొచ్చి నుంచి ప్రాంభమైన వారి ప్రయాణం కోయంబత్తూరు, బెంగుళూరు మీదుగా బెల్గాం వరకు 11 రోజులపాటు సాగింది. అయితే ఆగిన చోటల్లా ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన సదరు కుటుంబం రాజీవ్‌ను బాగా నమ్మించింది. ప్రయాణ సమయంలో అతనికి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. చివరికి బెల్గాంలోని మారియట్ హోటల్లో బస చేసిన షహన్షా కుటుంబం బండారం బయటపడింది. సరిపడా డబ్బు లేకున్నా కుట్రపూరితంగా క్యాబ్‌లో జాలీ రైడ్, ఖరీదైన హోటల్లో బస చేశారని తేలింది. 70 వేల రూపాయల హోటల్ చార్జీలు చెల్లించకపోవడంతో మారియట్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారని కాకాటి సీఐ రమేష్ చౌదరి తెలిపారు. షహన్షాపై హైదరాబాద్‌లో రేప్, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, సదరు కుటుంబం నుంచి రావాల్సిన డబ్బులను మారియట్ హోటల్ కోర్టు ద్వారా వసూలు చేసుకోగా, రాజీవ్ క్యాబ్ చార్జీలు పాతికవేల రూపాయలు మాత్రం వసూలు కాలేదు. -
దారి మళ్లిన ఓలా, తప్పించుకున్న మహిళ!
సాక్షి, బెంగుళూరు: సురక్షిత ప్రయాణానికి హామీ అంటూ ఊదరగొట్టే ప్రయివేటు క్యాబ్ సర్వీసులు ప్రయాణీకుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల అకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా.. ఓలా క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహళపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం చేయాలని చూశాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బనాస్వాడిలో నివాసముండే ఓ మహిళ గురువారం ఉదయం ఓలా క్యాబ్‌లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి బయలుదేరారు. వాహనం ఎయిర్‌పోర్టును సమీపించగానే ఒక్కసారిగా డ్రైవర్ వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించాడు. వాహనం హైదరాబాద్ వైపుగా దూసుకుపోతుండడంతో మహిళ డ్రైవర్ని ప్రశ్నించింది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అయితే, వాహనం ఓ టోల్ ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్యాబ్‌ను అడ్డగింగి ఆమెను కాపాడారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ ఫూటుగా తాగి ఉన్నాడని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చిక్కజలా ఎస్సై తెలిపారు. ఈ వ్యవహారంపై ఓలా సంస్థ స్పందిచింది. డ్రైవర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
దుస్తులు విప్పేయ్.. చంపేస్తా...
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో మరో దారుణం వెలుగుచూసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతితో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా.. ఆమె దుస్తులిప్పించి నగ్న ఫోటోలను తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేయటంతో ఆ డ్రైవర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్(26) ఈ నెల 2వ తేదీన ముంబైకి ప్రయాణమైంది. క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. అయితే షార్ట్ కట్ అంటూ మార్గం మధ్యలో మార్గం మళ్లించిన డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కారు డోర్లు బిగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫోన్ లాక్కుని లొంగకపోతే తన స్నేహితులను పిలిచి గ్యాంగ్ రేప్‌కు పాల్పడతానని హెచ్చరించాడు. యువతి ప్రతిఘటించటంతో చివరకు దుస్తులిప్పాలని.. లేకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వాటిని వాట్సాప్ ద్వారా డ్రైవర్ తన స్నేహితులకు షేర్ చేశాడు. విషయం బయటికి చెబితే ఆ ఫోటోలను ఫేస్బుక్లో వైరల్ చేస్తానని బెదిరించి.. చివరికి ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే యువతి మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చింది. పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ అరుణ్‌ను వెంటనే అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరుణ్‌ని.. డ్రైవర్‌గా నియమించినందుకు సదరు క్యాబ్ కంపెనీకి పోలీసులు నోటీసులు పంపారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన క్యాబ్ సంస్థ.. తమ వైపు నుంచి కూడా అతనిపై చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఓలా క్యాబ్ క్యాన్సిల్, రచ్చ.. రచ్చ
లక్నో : క్యాబ్ బుక్ చేసుకుని.. ఆ వెంటనే దానిని రద్దు చేసుకున్న ఓ వ్యక్తి నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్ ఇస్లాం మతస్థుడు కావటమే తాను ఆ పని చేయటానికి కారణమంటూ సదరు వ్యక్తి ట్వీటర్లో పోస్టు చేసి పెను దుమారం రేపాడు. ఈ వ్యవహారంపై పలువురు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అయోధ్యకు చెందిన అభిషేక్ మిశ్రా లక్నోలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 20న అతగాడు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే తీరా క్యాబ్ డ్రైవర్, తదితర వివరాలను ఓలా అతని మొబైల్‌కు పంపగా.. అర్థాంతరంగా అతను తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ‘ఓలా క్యాబ్‌ను రద్దు చేసుకున్నా. ఎందుకంటే ఆ డ్రైవర్ ఓ ముస్లిం. నా సొమ్మును జిహాదీ ప్రజలకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు’ అంటూ ట్వీటర్లో పోస్టు చేశాడు. ఇక అతని ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో పలువురు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారు దేశానికి ప్రమాదకరమని కొందరు రీట్వీట్లు చేస్తే.. ఇలాంటోళ్లను దేశం నుంచి తరిమేయాలని కొందరు.. దేశానికి చెడ్డ పేరు తెచ్చేది ఇలాంటి వారేనంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై ఓలా కూడా స్పందించింది. ‘ఇలాంటి విద్వేషాలను మేం ఎప్పుడూ ఉపేక్షించబోం. డ్రైవర్లకు-కస్టమర్లకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యత మాది. ఒకరినొకరిని గౌరవించాలనే మేం చెప్పేది. అంతేకానీ, కుల, మత, ప్రాంతీయ బేధాలు మాకు లేవ్’ అంటూ ఓలా ట్వీట్ చేసింది. అభిషేక్ మిశ్రా మరో ట్వీట్... అభిషేక్‌కు వీహెచ్‌పీ, భజ్రంగ్దళ్, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలతో సంబంధం ఉంది. వీహెచ్‌పీ ఐటీ విభాగానికి అతను పని చేస్తున్నాడు కూడా. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను పలువురు కోరుతున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు అభిషేక్ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. హనుమంతుడి పోస్టర్లను క్యాబ్‌లపై వేసి నడిపించినప్పుడు.. నా వాదనను ఎందుకు అంగీకరించరు అంటూ ఓ మహిళ చేసిన ఫేస్బుక్ పోస్టును తన ట్వీటర్లో అభిషేక్ ఉంచాడు. Dear @Olacabs, if u don't believe in racial or religious discrimination of your employees, please block this moron's Ola account. https://t.co/OqhucFRNrK — Kapil (@kapsology) 22 April 2018 If this views acceptable then why my views are not acceptable ? pic.twitter.com/170MWQuBpn — Abhishek Mishra (@Abhishek_Mshra) 22 April 2018 -
బ్రాండెడ్ బట్టల కోసం దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: విలాసవంతమైన జీవితం గడపడం కోసం కొంతమంది యువకులు అడ్డదారి తొక్కారు. డబ్బు కోసం క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా హత మార్చారు. ఈ సంఘటన న్యూఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్కు చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ పథకం రచించారు. మార్చి 23న కశ్మీరీ గేట్ వద్ద ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్ వారి వద్దకు రాగానే బుకింగ్‌ను రద్దు చేసి.. తుపాకులతో డ్రైవర్‌ను బెదిరించి సోనిపట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్యమైన ప్రాంతంలో డ్రైవర్ని గొంతు నులిమి చంపేశారు. ఘటన తర్వాత అదే కారులో నగరానికి వచ్చి దాని రూపు రేఖలు మార్చేసి అమ్మేయాలని ప్రయత్నించారు. ఇక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో హత్యకు గురైంది ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పోలీసు నిర్ధారించారు. అతని వివరాలు సేకరించి కాల్ డేటా ఆధారంగా నిందుతులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు హత్య చేయడానికి గల కారణాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. పేదరికంలో మగ్గుతున్న వాళ్లు.. ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం కోసం ఈ హత్య చేసినట్లు తెలిపారు. కాగా, ఆరుగురు నిందితుల్లో ఒక మైనర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. -
హైదరాబాద్‌లో మరో ‘ఓలా’ దురాగతం
హైదరాబాద్ : మహిళా ప్రయాణికురాలిని తీవ్రంగా వేధించిన కేసులో మల్టీనేషనల్ కంపెనీ ఓలా క్యాబ్ డ్రైవర్ ఒకరు అరెస్టయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాబ్ డ్రైవర్ శివకుమార్(22)ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు వనస్థలిపురం పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాల్లోకివెళితే.. గచ్చిబౌలి సమీప గౌలిదొడ్డి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగానూ ఓ మహిళ ఓలా షేరింగ్ క్యాబ్‌ను బుక్ చేశారు. గౌలిదొడ్డిలో ఆమె కారు ఎక్కారు. కొద్ది దూరంలోనే మిగతా ప్యాసింజర్లంతా దిగిపోయారు. అదే డ్రైవర్.. ఒంటరి మహిళను వేధించడం మొదలుపెట్టి, మొబైల్నంబర్ ఇవ్వాల్సిందిగా బలవంతం చేశాడు. మాటల్లోనే కారును దారి మళ్లించి పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదకు తీసుకెళ్లాడు. అప్పటికే బెంబేలెత్తిన మహిళ.. గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దింపేసి పారిపోయాడు. అనంతరం ఆటోలో వనస్థలిపురంలోని ఇంటికి వెళ్లిన బాధితురాలు.. షీ టీమ్స్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదుచేసింది. క్యాబ్ డ్రైవర్ వివరాలు తీసుకున్న షీటీమ్స్.. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు, అటునుంచి కోర్టుకు తరలించారు. -
ఓలా క్యాబ్ డ్రైవర్ అనుచిత ప్రవర్తన
- మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ వికృత చేష్ట - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై: మొన్నటి కిడ్నాప్ ఉదంతం మర్చిపోకముందే.. ప్రఖ్యాత ఓలా సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ దురాగతం మరొకటి వెలుగులోకి వచ్చింది. తన క్యాబ్‌లో ప్రయాణిస్తోన్న మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ, ఆమె ముందు వికృత చేష్టకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ముంబైకి చెందిన ఓ మహిళ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అరుణ్ తివారి.. ఆమె వైపే చూస్తూ వికృతచర్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ప్రయాణికురాలు.. వెంటనే కారు దిగి పోలీసులకు ఫోన్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్ గౌడ్ విడుదల
-
కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్ గౌడ్ విడుదల
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి అక్కాల శ్రీకాంత్‌గౌడ్ ఉదంతం సుఖాంతం అయింది. కిడ్నాపర్ల చెర నుంచి అతడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఈ నెల 6వ తేదీని కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. కిడ్నాపర్లను పట్టుకునే సమయంలో ఫైరింగ్ జరిగిందని, ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు రేపు (గురువారం) శ్రీకాంత్ గౌడ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న శ్రీకాంత్ గౌడ్‌ను ఈ నెల ఆరో తేదీన ఆ క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేశాడు. అతడిని వదిలిపెట్టాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ తను పనిచేస్తున్న ఓలా సంస్థను డిమాండ్ చేశాడు. దీనిని తొలుత సీరియస్‌గా తీసుకోని ఓలా యాజమాన్యం.. 7వ తేదీన ఢిల్లీలోని ప్రీత్‌విహార్ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన శ్రీకాంత్ గౌడ్ సురక్షితంగా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడటంతో అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
జీపీఎస్ ఆఫ్ చేసి.. నంబర్ ప్లేట్ మార్చి..
అదే కారులో తిరుగుతున్న ఓలా క్యాబ్ డ్రైవర్ - శ్రీకాంత్‌గౌడ్ కిడ్నాప్ కేసులో ఢిల్లీ పోలీసుల పురోగతి - డ్రైవర్ కదలికలపై పూర్తి నిఘా.. ఏ క్షణంలోనైనా కేసు ఛేదిస్తాం - దర్యాప్తు అధికారి ఏసీపీ రాహుల్ - 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు సాక్షి, న్యూఢిల్లీ: ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌గౌడ్ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసును ఏ క్షణంలోనైనా ఛేదిస్తామని పోలీ సులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవరు వాహనంలో ఉన్న జీపీఎస్‌ను ఆఫ్ చేసి కారు నంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్నట్టు గుర్తించారు. కారు కదలికలపై పూర్తి నిఘా ఉం చామని చెబుతున్నారు. ఈస్ట్ ఢిల్లీ పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేప ట్టారు. ఏ క్షణంలోనైనా నిందితుడిని పట్టుకుం టామని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏసీపీ రాహుల్ తెలిపారు. 8 బుకింగ్‌లు తిరస్కరించి.. తొమ్మిదో బుకింగ్‌లో శ్రీకాంత్ కిడ్నాప్ కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు పక్కా స్కెచ్ తో ప్రొఫెషనల్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఓలా నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయిం చుకున్నట్టు తెలుస్తోంది. గత గురువారం నిందితుడి క్యాబ్‌కు వినియోగదారుల నుంచి 8 బుకింగ్‌లు వచ్చినా.. బుక్ చేసుకున్న వారంతా సామాన్యులు కావడంతో తిరస్క రించాడు. తొమ్మిదో బుకింగ్‌కు శ్రీకాంత్ క్యాబ్‌ను బుక్ చేసుకోగా.. అతని సర్వీసు ను నిందితుడు తీసుకున్నాడు. శ్రీకాంత్ తన ఓలా అకౌంట్లో ‘డాక్టర్’ అన్న హోదాను పొందుపరచడంతో అతని బుకింగ్‌ను తీసుకున్నాడు. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో చిక్కకుండా ఒక మూలకు కారును ఉంచి శ్రీకాంత్‌ను ఎక్కించుకున్నాడు. నాకేమీ తెలియదు.. నిందితుడు లాగిన్ అయిన ఐడీ త్రిపాఠిది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ‘నాకేం తెలియదు’ అంటూ అత డు సమాధానం చెబుతున్నాడు. ఏజెంట్ అన్సా రీని గతంలో ఒకసారి కలిశానని, తన ఐడీలోకి లాగిన్ అవ్వడంలో సమస్య ఎదురైతే అన్సారీని సంప్రదించానని చెబుతున్నాడు. అయితే అన్సారీ అదే ఐడీని గుర్తుపెట్టుకొని కిడ్నాప్ చేసిన నిందితుడికి ఇచ్చి లాగిన్ చేయిం చినట్టు సమాచారం. అన్సారీ, సంజయ్ త్రిపాఠి లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరగా విడిపించండి కేంద్ర మంత్రి దత్తాత్రేయ సోమవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి శ్రీకాంత్‌గౌడ్ కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నా రు. వీలైనంత త్వరగా కిడ్నాపర్ చెర నుంచి శ్రీకాంత్‌ను విడిపించాలని కోరారు. అన్నీ నకిలీ పత్రాలే.. ఓలాలో క్యాబ్ సర్వీసును నడపడానికి నిందితుడు ఇచ్చినవన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు నిర్ధారించారు. ఓలాలో సర్వీసులు నడపాడానికి గతంలో పలుమార్లు దరఖాస్తు పెట్టుకున్నా పత్రాలు సరిగా లేకపోవడంతో తిర స్కరణకు గురయ్యాడు. దీంతో ఓలాకు క్యాబ్ లను అటాచ్ చేసే ఏజెంట్ అన్సారీ ద్వారా నకిలీ పత్రాలను సాధించి.. అప్పటికే ఓలాలో డ్రైవర్‌గా ఉన్న సంజయ్ త్రిపాఠీ ఐడీ ద్వారా ఆ పత్రాలను సమర్పించాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఓలా సర్వీసులు నడుపుతున్నాడు. ఓలా సంస్థ వైఫల్యం.. సరైన పత్రాల్లేక 3 సార్లు తిరస్కరణకు గురైన వ్యక్తి.. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఇతర డ్రైవర్ల ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎలా ఎంపిక చేస్తారని త్రిపాఠి ప్రశ్నిస్తున్నాడు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా తాను ఇరుక్కున్నానని వాపోతున్నాడు. ఇది పూర్తిగా ఓలా వైఫల్య మేనని ఆరోపిస్తున్నాడు. ఓలా తన క్యాబ్ సర్వీసులను నిలిపేసిందని ఆవేదన చెందు తున్నాడు. ఏజెంట్లు కమీషన్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి డ్రైవర్ల ను చేర్చుతున్నారని ఆరోపిస్తున్నాడు. వెరిఫికేషన్ జరిపితే దొరికిపోతానని.. ఓలా సర్వీసులు నడపడానికి సదరు డ్రైవర్లు పత్రాలు సమర్పించిన అనంతరం వాటిపై వారంలో సంస్థ ఒరిజినల్ పత్రాల ధ్రువీకరణ జరుపుతుంది. అయితే ఈ ధ్రువీకర ణ జరిపితే తన పత్రాలు నకిలీవిగా తేలిపోతాయని ముందే ఊహించిన నిందితుడు.. ఈలోగా తన పన్నాగాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 6వ తేదీ అర్ధరాత్రి శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ బుకింగ్ తీసుకోవడంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకొచ్చింది. సర్వీసులు నడిపే డ్రైవర్లకు ఓలా ఒక ఐడీని ఇస్తుంది. దీని ద్వారా డ్రైవర్లు సర్వీసులు నడపాలనుకుంటే ఓలా సర్వర్లలోకి అటాచ్ అవ్వాల్సి ఉంటుంది. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన రోజున.. త్రిపాఠి ఐడీ ద్వారా నిందితుడు లాగిన్ అయి బుకింగ్‌ను తీసుకున్నాడు. ఏడున్నవ్ బిడ్డా..! క్యాబ్‌లో వెళ్తుండగా కిడ్నాప్ -
ఏడున్నవ్ బిడ్డా..!
- ఇంకా లభించని శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ - దుఃఖసాగరంలో తల్లిదండ్రులు గద్వాల/గద్వాల క్రైం: ‘తిన్నరా అని అడిగితివి.. ఇంటికి వస్తనంటివి..అందరి యోగ క్షేమాలు తెలుసుకుంటివి.. నీ క్షేమమే తెలియకపాయే బిడ్డా శ్రీకాంత్..!’అంటూ మూడురోజుల క్రితం ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రానికి చెందిన వైద్యవిద్యార్థి డాక్టర్ శ్రీకాంత్‌గౌడ్ తల్లిదండ్రులు జనార్దన్‌గౌడ్, భారతమ్మ ఆదివారం కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు అపహ రణకు గురవడంతో తల్లిదండ్రుల నోట మాటరావడం లేదు. గురువారం ఓలా క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని.. క్షోభ పెట్టొద్దని అతడి చెల్లెళ్లు ప్రాథేయపడు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి తమ అన్నను క్షేమంగా తీసుకురావా లని కోరుతున్నారు. కాగా కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డీకే అరుణ.. శ్రీకాంత్ తల్లితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వపెద్దలతో మాట్లాడి కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనసాగుతున్న గాలింపు చర్యలు.. కాగా, శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఓలా సంస్థ, శ్రీకాంత్ స్నేహితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మీడియాను పోలీస్ స్టేషన్ లోపలికి కూడా అనుమతిం చడం లేదు. మీడియాకు వివరాలు తెలిస్తే నిందితుడు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఓలా సంస్థ నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన అనంతరం క్యాబ్ డ్రైవర్ ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడు అనే దానిపై క్యాబ్‌లో ఉన్న జీపీఎస్ ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన అనంతరం నిందితుడు క్యాబ్‌ను ఒక చోట వదిలేసి ఇంకో వాహనాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ మొబైల్‌కు స్నేహితులు పదేపదే ఫోన్ చేస్తుండటంతో శనివారం ఫోన్ లిఫ్ట్ చేసిన నిందితుడు.. ఈ విషయమై ఆదివారం తేల్చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు నిందితుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. క్యాబ్‌లో వెళ్తుండగా కిడ్నాప్ -
క్యాబ్‌లో వెళ్తుండగా కిడ్నాప్
- ఢిల్లీలో గద్వాల వైద్య విద్యార్థి అపహరణ - కిడ్నాప్‌కు పాల్పడింది క్యాబ్ డ్రైవరే.. - రూ.5 కోట్లు ఇవ్వాలని ఓలా సంస్థకు డిమాండ్ - గురువారం అర్ధరాత్రి ఘటన.. శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు - శనివారం సాయంత్రం ఫోన్ లిఫ్ట్ చేసిన కిడ్నాపర్! - ప్రత్యేక బృందంతో గాలిస్తున్న ఢిల్లీ పోలీసులు - తెలియరాని క్యాబ్ డ్రైవర్ వివరాలు.. అతడు ఓలా సంస్థకు ఇచ్చిన డాక్యుమెంట్లూ నకిలీవే! సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల వైద్యవిద్య కోసం ఢిల్లీ వెళ్లిన శ్రీకాంత్ గౌడ్ అనే తెలుగు విద్యార్థి కిడ్నాపయ్యాడు. ఆయన తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకోగా.. ఆ క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేశాడు. శ్రీకాంత్‌ను వదిలిపెట్టాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ తను పనిచేస్తున్న ఓలా సంస్థను డిమాండ్ చేశాడు. దీనిని తొలుత సీరియస్‌గా తీసుకోని ఓలా యాజమాన్యం.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రీత్‌విహార్ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు శ్రీకాంత్ స్నేహితులు కూడా గురువారం రాత్రి నుంచి శ్రీకాంత్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ స్నేహితులను, బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? అతని పేరు, ఇతర వివరాలు, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది వంటి వివరాలేవీ బహిర్గతం కాలేదు. అటు పోలీసులుగానీ, ఇటు ఓలా సంస్థగానీ ఏమీ వెల్లడించకపోవడంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. నేడు తేలుస్తానన్న కిడ్నాపర్.. శ్రీకాంత్ ఫోన్ నంబర్‌కు ఆయన బంధువులు, స్నేహితులు పదే పదే కాల్ చేసి చూస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నాపర్ శనివారం సాయంత్రం ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ విషయమై తేలుస్తానంటూ.. హిందీలో ఏదో చెప్పారని శ్రీకాంత్ బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై పోలీసులను ప్రశ్నించగా.. తాము ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. అసలు ఏం జరిగింది? గద్వాల పట్టణానికి చెందిన అక్కాల శ్రీకాంత్‌గౌడ్ (29) చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో వైద్య విద్య పీజీ చేస్తూ.. అక్కడి ప్రీత్‌విహార్ ప్రాంతంలో ఉన్న మెట్రో ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రీన్‌పార్కు ప్రాంతంలోని గౌతమ్‌నగర్‌లో ఓ గదిలో స్నేహితులతో కలసి నివాసముంటున్నారు. గురువారం రాత్రి మెట్రో ఆస్పత్రిలో డ్యూటీ పూర్తయిన అనంతరం శ్రీకాంత్, మరికొందరు స్నేహితులు కలసి హోటల్ రాడిసన్ బ్లూలో భోజనం చేశారు. అనంతరం రాత్రి 11.30 సమయంలో శ్రీకాంత్‌ను మెట్రో స్టేషన్లో డ్రాప్ చేసి వెళ్లిపోయారు. అప్పటికే చివరి మెట్రో సర్వీసు వెళ్లిపోవడంతో శ్రీకాంత్ ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ మార్గమధ్యలోనే.. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన ఫోన్‌ను లాక్కుని స్విచాఫ్ చేసేశాడు. అనంతరం తాను పనిచేస్తున్న ఓలా యాజమాన్యానికి ఫోన్ చేసి.. శ్రీకాంత్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశానని, ఆయనను విడుదల చేయాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఓలా యాజమాన్యం శుక్రవారం ప్రీత్‌విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. శ్రీకాంత్ బంధువులకు గానీ, స్నేహితులకు గానీ, ఆసుపత్రికి గానీ ఫోన్ చేయకపోవడం గమనార్హం. అటు స్నేహితులు కూడా.. హోటల్లో స్నేహితులతో కలసి భోజనం చేసిన శ్రీకాంత్.. గురువారం రాత్రి రూమ్‌కు చేరలేదు. శుక్రవారం ఉదయం 9.00 గంటలకు ఆస్పత్రిలో రిపోర్టు చేయాల్సి ఉన్నా వెళ్లలేదు. దీంతో సహచర వైద్య విద్యార్థులు.. శ్రీకాంత్‌తో కలసి రూమ్‌లో ఉండే హేమంత్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే శ్రీకాంత్ గురువారం రాత్రి కాసేపట్లో రూమ్‌కు వస్తానని ఫోన్ చేశాడని, కానీ రూమ్‌కు రాలేదని హేమంత్ చెప్పారు. ఇక శ్రీకాంత్ ఫోన్ నంబర్‌కు తాము పంపిన ఎస్సెమ్మెస్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో డెలివరీ అయినట్టు అలర్ట్ ఎస్సెమ్మెస్ వచ్చిందని శ్రీకాంత్ సహచర వైద్యుడు సుబ్బారావు వెల్లడించారు. దాంతో ఫోన్ స్విచాన్ చేసి ఉంటారనే ఉద్దేశంతో కాల్ చేశామని.. తనకు ఆ ఫోన్ దొరికిందని, తాను ఎవరి వద్దా ఫోన్ తీసుకోలేదని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వ్యక్తి చెప్పాడని వెల్లడించారు. దీంతో శ్రీకాంత్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు స్నేహితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అప్పటికే శ్రీకాంత్‌ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లుగా ఓలా సంస్థ ఫిర్యాదు చేసిన విషయం వారికి తెలిసింది. ప్రత్యేక బృందంతో దర్యాప్తు శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే క్యాబ్‌లో ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనం ఎటు వెళ్లింది, ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ఓలా యాజమాన్యం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఫోన్ సిగ్నల్ టవర్ లొకేషన్ ప్రాంతాలనూ పరిశీలిస్తున్నారు. ఓలాలో పనిచేసేందుకు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా నకిలీవిగా గుర్తించినట్టు సమాచారం. కాగా శ్రీకాంత్ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని.. క్యాబ్ డ్రైవర్ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని ప్రీత్‌విహార్ పోలీసువర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. వైద్యుడిగా పనిచేస్తూ.. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన జనార్ధన్‌గౌడ్, భారతమ్మ దంపతుల ఏకైక కుమారుడు అక్కాల శ్రీకాంత్‌గౌడ్ (29). ఇంటర్ వరకు గద్వాలలోనే చదువుకున్న శ్రీకాంత్.. 2011లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తర్వాత నిబంధనల మేరకు మన దేశంలో వైద్యవృత్తి చేసేందుకు ఆలిండియా మెడికల్ కౌన్సిల్ పరీక్ష రాశారు. ఈ పరీక్ష కోసం మూడేళ్లపాటు ఢిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని మెట్రో ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తూనే.. వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తున్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు తమ కుమారుడు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు జనార్ధన్‌గౌడ్, భారతమ్మ ఆందోళనలో మునిగిపోయారు. దయచేసి తమ కుమారుడిని రక్షించాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కుమారుడిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే శ్రీకాంత్‌గౌడ్ బాబాయి నారాయణగౌడ్, బంధువులు ఢిల్లీకి చేరుకున్నారు. (కొడుకు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, ఇన్సెట్లో కిడ్నాప్‌కు గురైన శ్రీకాంత్) -
ఓలా డ్రైవర్‌ను పట్టించిన మహిళ ఫోన్
మంచి మాటలు చెబుతూ మహిళను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారయత్నం చేసినందుకు ఓలా క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి లాక్కున్న ఫోనే అతడిని పోలీసులకు పట్టించింది. షాదాబ్ మహ్మద్ ఇబ్రహీం షేక్ అనే నిందితుడు ఘట్కోపర్ ప్రాంతానికి చెందినవాడు. బాధితురాలు గృహిణి. తన ఏడేళ్ల కొడుకును స్కూలు నుంచి తీసుకొచ్చేందుకు ఆమె వెళ్తుండగా.. షేక్ ఆమెను పిలిచి తన క్యాబ్ ఎక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. తాను బేబీ సిట్టర్ కోసం చూస్తున్నానని చెప్పడంతో ఆమె క్యాబ్ ఎక్కేందుకు అంగీకరించారన్నారు. ముందుసీట్లో ఆమె కూర్చోగానే కారు డోర్లన్నీ లాక్ చేయడంతో పాటు అద్దాలు కూడా పైకి ఎత్తేశాడు. తనతో స్నేహంగా ఉండాలని, మొబైల్ నెంబరు ఇవ్వాలని ఆమెను బలవంతపెట్టాడు. చివరకు ఆమె ఫోన్ కూడా లాగేసుకున్నాడు. అతడితో స్నేహం చేయడానికి ఆమె నిరాకరించడంతో అతడు కారు స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆమె గట్టిగా అరిచినా, అద్దాలు వేసి ఉండటంతో ఎవరికీ వినిపించలేదు. కారు స్టీరింగ్ పట్టుకుని పక్కకు తిప్పేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎలాగోలా కారు తలుపును ఆమె తెరవగలిగారు. బయటకు దూకేందుకు ప్రయత్నించడంతో భయపడిన షేక్.. కారు ఆపాడు. వెంటనే ఆమె కిందకు దిగి, తన ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగారు. అతడు నిరాకరించగా.. అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫోనే క్యాబ్ డ్రైవర్‌ను పట్టించింది. షేక్ ఆ ఫోనును తన భార్యకు ఇవ్వగా.. కొడుకు వైద్య ఖర్చుల కోసం ఆమె ఆ ఫోనును రూ. 500కు అమ్మేసింది. కొన్న వ్యక్తి ఆ ఫోన్ స్విచాన్ చేయగానే పోలీసులు దాన్ని ట్రాక్ చేసి.. అక్కడకు వెళ్లారు. ఫోను కొన్న వ్యక్తి షేక్ ఇల్లు చూపించడంతో పోలీసుల పని సులభమైంది. ఓలా క్యాబ్ డ్రైవర్ షేక్‌పై పోలీసులు ఐపీసీ 354, 365, 392, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
క్యాబ్‌లో లైంగిక దాడి చేసి కాలువలో పడేశారు
కోల్‌కతా: నిత్యం కళ్లు తెరిపించే కథనాలు.. కఠిన శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు.. ప్రభుత్వాలు స్తంభించే స్థాయిలో నిరసనలు.. ఇన్ని రకాల అంశాలు చోటుచేసుకుంటున్నా.. కొందరు కామాంధులు తెగబడుతునే ఉన్నారు. దేశంలో ఏదో ఒకమూలన లైంగిక దాడులతో రెచ్చిపోతున్నారు. కోల్‌కతాలో రోడ్డుపక్కన బతుకీడుస్తున్న ఓ కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలిక గొంతు నులిమి చంపి ఓ కాలువలో బ్రిడ్జీపై నుంచి పడేశారు. ఈ చర్యకు పాల్పడినవారిలో ఒకరు ఓలా క్యాబ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. బుధవారం వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కోల్‌కతాలోని ఓ వీధిలో రోడ్డుపక్కన ఉన్న కాలిబటలో గుడిసె వేసుకొని జీవిస్తున్న కుటుంబానికి చెందిన 12 బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఎత్తుకెళ్లారు. వాళ్లు కిడ్నాప్ చేసుకొని వెళుతుండటం చూసిన తల్లి చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేసేలోగా వారు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. పార్క్ సర్కస్ ప్లై ఓవర్ పక్కనే కారును ఆపిన ఆ ఇద్దరు కారులోనే బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతు నులిమి చంపి కొద్ది దూరంలోని కాలువలో బ్రిడ్జిపై నుంచి పడేసి వెళ్లిపోయారు. ఈ దుర్మార్గానికి పాల్పడటానికి ముందు వారిద్దరు పీకలదాకా మధ్యం తాగినట్లు తెలుస్తోంది. -
ఓలా క్యాబ్ డ్రైవర్ ఎంత పనిచేశాడు?
నందనం: తమిళనాడులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. బతికుండగానే తన భార్యను కారులో పడేసి నిప్పంటించాడు. ఇద్దరు పిల్లలను కూడా అందులోనే నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు. అయితే, మంటల్లో తగులబడుతున్న ఆ మాతృమూర్తి తన బిడ్డలను కారు అద్దాల నుంచి బయటపడేయడంతో పిల్లలు మాత్రం బ్రతికి బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాగరాజు (30) అనే వ్యక్తి తన ఓలా క్యాబ్ లో భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. అయితే, వారి మధ్య ఏదో అంశంపై మాటల యుద్ధం మొదలైంది. అయితే, భర్తను బెదిరించేందుకు క్యాబ్ లో అత్యవసర పరిస్థితుల్లో అవసరానికోసం ఉంచిన పెట్రోల్ ను పోసుకుంది. ఆమె అలా చేసిందో లేదో వెంటనే కారు ఆపిన ఆ భర్త పిల్లలను కూడా అందులోనే ఉంచి డోర్లు వేసి వెంటనే నిప్పంటించి పారిపోయాడు. మంటలు ప్రారంభంకాగానే ఆమె పిల్లలను బయట పంపించగలిగింది. అయితే, తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రిలోనే ఆమె కన్నుమూసింది. -
పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట
కుటుంబసభ్యులనుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలివీ.. హమాలీబస్తీకి చెందిన రేవతి (20), ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్ (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పది రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లి వెంకన్నస్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. రేవతిపై మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతు రేవతి, శ్రీనివాస్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. సర్టిఫికెట్లు పరిశీలించి మేజర్లేనని ధ్రువీకరించుకున్న పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో పలువురు బస్తీ నాయకులు రేవతి, శ్రీనివాస్‌లకు అండగా నిలిచారు. దండలు మార్పించి కలిసిమెలసి జీవించాలని ఆశీర్వదించారు. -
మహిళా జడ్జిపై వేధింపులు.. ఓలా డ్రైవర్ అరెస్టు
దేశ రాజధాని నగరంలో మహిళా జడ్జిని వేధించి, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. తీస్ హజారీ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఫిర్యాదు మేరకు సందీప్ అనే ఆ డ్రైవర్‌ను గుర్గావ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 28వ తేదీన తాను ఉత్తర ఢిల్లీలోని ఓ మార్కెట్లో షాపింగ్ చేసేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నానని, షాపులోకి వెళ్తూ కాసేపు వేచి చూడాలని తాను డ్రైవర్‌ను కోరానని, అయితే రెండు నిమిషాలు గడిచాయో లేదో, ఆ డ్రైవర్ తనను నోటికి వచ్చినట్లు అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడని మహిళా జడ్జి చెప్పారు. ఆమె బ్యాగ్‌ను రోడ్డుమీద పారేశాడు. దాంతో ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆమె బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో ఐపీసీ సెక్షన్లు 354 ఎ (మహిళలపై లైంగిక వ్యాఖ్యలు చేయడం), 509 (మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం లేదా ప్రవర్తించడం), 427 (మోసం చేయడం) కింద రూప్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టి, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
కాల్ డేటా మొత్తం డిలీట్ చేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో బెల్జియన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓలా క్యాబ్ డ్రైవర్ కేసు ఘటన గురించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వాకబు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరి, ఆమె ముందు కూర్చున్న తర్వాత లైంగికంగా, అసభ్యకరంగా తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ డ్రైవర్ కాల్ డేటా ఫోన్ లో నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఫోన్ కాల్స్ తోపాటు.. ఇతర ఫోన్ కాల్స్ వివరాలు, సందేశాలు డిలేట్ చేసినట్లు తెలిసింది. అరెస్టు నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశంతోనే అతడు ఆ పనిచేసినట్లు తెలిసింది. -
రూట్ చెప్పడానికి ముందు సీట్లో కూర్చొమ్మని..
న్యూఢిల్లీ: ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ అసభ్యతకు దిగాడు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేసుకుంది. 'ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే మేం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడు' అని పోలీసులు తెలిపారు. గూర్గావ్ ప్రాంతంలో ఓ బెల్జియం మహిళ ఢిల్లీకి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరాడు. అనంతరం ఆమె ముందు కూర్చొని దారి చూపించే క్రమంలో లైంగికంగా, అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. అలా, ఆమె వచ్చే మార్గంలో చాలాసేపు లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.