ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగుళూరు: కేరళలోని కొచ్చి నుంచి కర్ణాటకలోకి బెల్గాం వరకు 3,200 జాలీరైడ్ చేసిన ఓ కుంటుంబం ఓలా డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. జూలై 1న ప్రారంభమైన జాలీరైడ్ పదకొండు రోజుల పాటు కొనసాగింది. కానీ, క్యాబ్ చార్జీలూ, హోటల్ చార్జీలు చెల్లించపోవడంతో అసలు విషయం బయటపడింది. వాళ్ల చేతిలో మోసపోయిన క్యాబ్ డ్రైవర్ బిత్తరపోయాడు. ఈ ఘటన ఔట్‌స్టేషన్‌కు వెళ్లే ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లకు కనువిప్పును కలిగించింది.
వివరాలు.. కొచ్చికి చెందిన కేవీ రాజీవ్ ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న షహన్‌షా తన కుటుంబంతో కలిసి జాలీరైడ్ చేయడానికి రాజీవ్ క్యాబ్‌ను ఔట్‌స్టేషన్ ట్రిప్‌కు బుక్ చేసుకుంది. కొచ్చి నుంచి ప్రాంభమైన వారి ప్రయాణం కోయంబత్తూరు, బెంగుళూరు మీదుగా బెల్గాం వరకు 11 రోజులపాటు సాగింది. అయితే ఆగిన చోటల్లా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన సదరు కుటుంబం రాజీవ్‌ను బాగా నమ్మించింది. ప్రయాణ సమయంలో అతనికి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. చివరికి బెల్గాంలోని మారియట్ హోటల్‌లో బస చేసిన షహన్‌షా కుటుంబం బండారం బయటపడింది.
సరిపడా డబ్బు లేకున్నా కుట్రపూరితంగా క్యాబ్‌లో జాలీ రైడ్, ఖరీదైన హోటల్‌లో బస చేశారని తేలింది. 70 వేల రూపాయల హోటల్ చార్జీలు చెల్లించకపోవడంతో మారియట్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారని కాకాటి సీఐ రమేష్ చౌదరి తెలిపారు. షహన్‌షాపై హైదరాబాద్‌లో రేప్, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, సదరు కుటుంబం నుంచి రావాల్సిన డబ్బులను మారియట్ హోటల్ కోర్టు ద్వారా వసూలు చేసుకోగా, రాజీవ్ క్యాబ్ చార్జీలు పాతికవేల రూపాయలు మాత్రం వసూలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment