Marriott Hotel
-
బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ బనానా లెక్క తీరింది. రెండు అరటిపళ్లకు జీఎస్టీ అంటూ రూ.442.50 బిల్లు వేసారని అతను చేసిన ట్వీట్‌పై ఎక్సైజ్-పన్నుల శాఖ స్పందించింది. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై చర్యలు తీసుకుంది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపళ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు. అయితే ఆ అరటి పళ్ల బిల్లు చూసి కళ్లు తేలేసాడు. ఆ రెండు అరటిపళ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలపి ఏకంగా రూ.442.50 బిల్లు వేసింది. ‘పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.’ అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట తెగహల్‌చల్ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించి ఆ హోటల్‌పై రూ.25వేల జరిమానా వేసింది. Fine of Rs 25,000 imposed on hotel JW Marriott by Excise and Taxation Department, Chandigarh for violation of section 11 of CGST (illegal collection of tax on an exempted item) in connection with actor Rahul Bose's tweet over the price of two bananas served to him by the hotel. — ANI (@ANI) July 27, 2019 చదవండి: బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..! -
ప్రమాదంలో 50 కోట్ల మంది సమాచారం
బెథెస్డ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హోటళ్లు కలిగిన మ్యారియట్ సంస్థలో అంతర్గత సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా దాదాపు 50 కోట్ల మంది వినియోగదారుల సమాచారం ప్రమాదంలో పడింది. మ్యారియట్ హోటళ్లలో రూమ్‌లు తీసుకున్న వారి క్రెడిట్ కార్డు నంబర్లు, పాస్‌పోర్టు నంబర్లు, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ అడ్రస్‌లు తదితర సమాచార భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆ కంపెనీ వెల్లడించింది. 2014 నుంచి స్టార్‌వుడ్ నెట్‌వర్క్‌లో కొందరు అనధికారిక వ్యక్తులకు ఈ సమాచారానికి యాక్సెస్ లభించిందని కంపెనీ తెలిపింది. 2016లో స్టార్వుడ్ను మ్యారియట్ సొంతం చేసుకుంది. మ్యారియట్ హోటల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,700 హోటళ్లున్నాయి. -
జాలీ రైడ్.. ఓలా డ్రైవర్‌కు చుక్కలు..!
సాక్షి, బెంగుళూరు: కేరళలోని కొచ్చి నుంచి కర్ణాటకలోకి బెల్గాం వరకు 3,200 జాలీరైడ్ చేసిన ఓ కుంటుంబం ఓలా డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. జూలై 1న ప్రారంభమైన జాలీరైడ్ పదకొండు రోజుల పాటు కొనసాగింది. కానీ, క్యాబ్ చార్జీలూ, హోటల్ చార్జీలు చెల్లించపోవడంతో అసలు విషయం బయటపడింది. వాళ్ల చేతిలో మోసపోయిన క్యాబ్ డ్రైవర్ బిత్తరపోయాడు. ఈ ఘటన ఔట్స్టేషన్కు వెళ్లే ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లకు కనువిప్పును కలిగించింది. వివరాలు.. కొచ్చికి చెందిన కేవీ రాజీవ్ ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న షహన్షా తన కుటుంబంతో కలిసి జాలీరైడ్ చేయడానికి రాజీవ్ క్యాబ్‌ను ఔట్స్టేషన్ ట్రిప్‌కు బుక్ చేసుకుంది. కొచ్చి నుంచి ప్రాంభమైన వారి ప్రయాణం కోయంబత్తూరు, బెంగుళూరు మీదుగా బెల్గాం వరకు 11 రోజులపాటు సాగింది. అయితే ఆగిన చోటల్లా ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన సదరు కుటుంబం రాజీవ్‌ను బాగా నమ్మించింది. ప్రయాణ సమయంలో అతనికి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. చివరికి బెల్గాంలోని మారియట్ హోటల్లో బస చేసిన షహన్షా కుటుంబం బండారం బయటపడింది. సరిపడా డబ్బు లేకున్నా కుట్రపూరితంగా క్యాబ్‌లో జాలీ రైడ్, ఖరీదైన హోటల్లో బస చేశారని తేలింది. 70 వేల రూపాయల హోటల్ చార్జీలు చెల్లించకపోవడంతో మారియట్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారని కాకాటి సీఐ రమేష్ చౌదరి తెలిపారు. షహన్షాపై హైదరాబాద్‌లో రేప్, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, సదరు కుటుంబం నుంచి రావాల్సిన డబ్బులను మారియట్ హోటల్ కోర్టు ద్వారా వసూలు చేసుకోగా, రాజీవ్ క్యాబ్ చార్జీలు పాతికవేల రూపాయలు మాత్రం వసూలు కాలేదు. -
ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్‌కు వెళ్లకండి!
పాక్‌లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరిక వాషింగ్టన్: పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులకు అమెరికా ఎన్నడూలేని రీతిలో చాలా కచ్చితమైన హెచ్చరికలు చేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న మారియట్ హోటల్‌కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దని సూచించింది. ఈ మేరకు తమ దేశ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వయిజరీని అమెరికా విదేశాంగ శాఖ జారీచేసింది. ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు పెద్ద ముప్పే పొంచి ఉన్నట్టు అక్కడి తమ రాయబార కార్యాలయానికి సమాచారముందని తెలిపింది. 'రానున్న కొన్ని రోజులపాటు ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లరాదని అమెరికా పౌరులకు చాలా కచ్చితమైన సలహా ఇస్తున్నాం' అని విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్‌లో నెలకొన్న భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశానికి వెళ్లే అనవసరమైన పర్యటనలన్నింటీని వాయిదా వేసుకోవాలని అమెరికా తన పౌరులను కోరింది. పాకిస్థాన్‌లో ఇటీవల ఉగ్రవాద హింస పెచ్చు మీరుతున్న సంగతి తెలిసిందే. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో అమెరికన్లతోపాటు విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 16న ఓ అమెరికా విద్యావేత్తను పాక్‌లో మోటారు బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. -
అందమైన భామలు..
-
ఒబామా బస చేసిన హోటల్ వద్ద ఇద్దరి అరెస్ట్!
బ్రిస్బేన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస చేసిన హోటల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు సూట్ కేసులతో బ్రిస్బేన్ లోని మారియట్ హోటల్ వద్ద అనుమానస్పందంగా తిరగడం పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. జీ20 సమావేశాల్లో పాల్టొంటున్న ఒబామా ప్రస్తుతం మారియట్ హోటల్ లో బస చేశారు. -
లిటిల్ స్టార్స్
ఐదు నక్షత్రాల హోటల్లో లిటిల్‌స్టార్స్ వెలుగుపూలు వెదజల్లారు. కాస్ట్లీ హోటల్‌కు తమ ఆటపాటలతో కాంతులు అద్దారు. నిరుపేద చిన్నారులకు చేయూతను అందించే రెయిన్బో హోమ్స్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ మారియట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన ‘రీక్లెయిమ్ చైల్డ్‌హుడ్’ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ ఝాన్సీ, దర్శకుడు శేఖర్ కమ్ముల, నటీమణులు చందనా చక్రవర్తి, మాధవి పాల్గొన్నారు.