బెథెస్డ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హోటళ్లు కలిగిన మ్యారియట్ సంస్థలో అంతర్గత సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా దాదాపు 50 కోట్ల మంది వినియోగదారుల సమాచారం ప్రమాదంలో పడింది. మ్యారియట్ హోటళ్లలో రూమ్‌లు తీసుకున్న వారి క్రెడిట్ కార్డు నంబర్లు, పాస్‌పోర్టు నంబర్లు, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ అడ్రస్‌లు తదితర సమాచార భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆ కంపెనీ వెల్లడించింది.
2014 నుంచి స్టార్‌వుడ్ నెట్‌వర్క్‌లో కొందరు అనధికారిక వ్యక్తులకు ఈ సమాచారానికి యాక్సెస్ లభించిందని కంపెనీ తెలిపింది. 2016లో స్టార్‌వుడ్‌ను మ్యారియట్ సొంతం చేసుకుంది. మ్యారియట్ హోటల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,700 హోటళ్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment