Actress Shraddha Srinath Shares Her Bad Experience With Cab Driver And Airport Security, Details Inside - Sakshi
Sakshi News home page

Shraddha Srinath: హీరోయిన్‌కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట

Published Wed, Apr 6 2022 8:08 PM | Last Updated on Wed, Apr 6 2022 8:28 PM

Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security - Sakshi

Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్‌ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్‌ హిజ్‌ లీల',‍ 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా.



అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్‌ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణించేప్పడు డ్రైవర్‌ ఏసీ ఆన్‌ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్‌ నిరాకరించాడు.  

'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్‌ డ్రైవర్‌ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్‌స్టాలో తెలిపింది.



అలాగే తనకు ఎయిర్‌పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్‌పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్‌స్టా గ్రామ్‌లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్‌ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement