Airport Security
-
సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్‌ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.లగేజీ చెకింగ్ తర్వాతే లోనికిసికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.రైలు అనౌన్స్మెంట్ అయ్యాకే ప్లాట్‌ఫామ్ పైకిప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.ఆలస్యంగా వస్తే అంతేసరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్‌ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.మిగతావాటి సంగతేంటి..?ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు. సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్‌భారత్ స్టేషన్లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్‌భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. -
హీరోయిన్‌కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్‌స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్‌పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్‌స్టా గ్రామ్‌లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
‘బాంబు’ జోక్ ఎంతపని చేసింది!
న్యూఢిల్లీ: వారిద్దరు స్నేహితులు.. ఇండోర్ చెందిన వారు గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సొంతూరికి బయలుదేరారు. విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడినప్పుడు ఓ మిత్రుడు సరదాగా జోక్ చేశాడు. ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో అన్నాడు. ఈ మాట ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది చెవిన పడింది. వారేదో నిజంగా ‘బాంబు’తో ఎక్కుతున్నట్టు హడలిపోయిన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు ఈ విషయాన్ని చేరవేశారు. ఎయిర్పోర్ట్ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ స్నేహితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. వారిని చాలాసేపు విచారించి.. ప్రశ్నించి.. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించికున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులని వదిలేశారు. కానీ, ఆ ఇద్దరు సరదాగా వేసిన జోక్.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి బాంబు కలకలాన్ని రేపింది. సరదాకు ‘బాంబు’ అన్న పదాన్ని ఉచ్చరించినందుకు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇటీవలికాలంలో ఉగ్రవాద ముప్పు భారీగా పొంచి ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అనుమానమున్నా.. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. గత నెల ఓ కశ్మీరి మెడికల్ విద్యార్థిని కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. ఆమె బ్యాగుపై ‘ఇందులో బాంబు ఉండొచ్చు’ అన్న గ్రాఫిటీ ఉండటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. -
'సీరియస్ గా తీసుకుంటున్నాం'
న్యూఢిల్లీ: ఎయిర్ పోర్టుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విమానాలకు బాంబు బెదిరింపులను సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. సెక్యురిటీ డ్రిల్స్ పటిష్టంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ డైరీని గురువారం ఆయన ఆవిష్కరించారు. కాగా, బుధవారం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజు స్పందించారు. ఢిల్లీలో రెండు, బెంగళూరులో ఒక విమానానికి నిన్న బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. -
రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక
పోలవరం(టెక్కలి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రక్షణలో విశిష్ట సేవ లు అందజేసినందుకు గా ను టెక్కలి మండలం పోల వరం గ్రామానికి చెందిన పి.వి. రమణబాబు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ యన ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కిరండోల్లోని బీఐఓఎ మ్లో క్రైమ్ అండ్ ఇంటెలిజె న్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1988 సంవత్సరంలో సిఐఎస్ఎఫ్లో విధుల్లో చేరిన రమణబాబు సుమారు 14 సంవత్సరాలు వివిధ రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ సెక్యురిటీ విభాగంలో పనిచేశారు. ఇప్పటివరకూ 80కు పైగా వివిధ అవార్డులు, రివార్డులు పొందారు. 2012 సంవత్సరంలో కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా డెరైక్టర్ జనరల్ డిస్క్‌ను అందుకున్న ఈయన ప్రస్తుతం రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యూరు. మార్చిలో దీన్ని అందుకోనున్నారు.