జీపీఎస్‌ ఆఫ్‌ చేసి.. నంబర్‌ ప్లేట్‌ మార్చి.. | Delhi Police Progress in Srikanth Goud Kidnap Case | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌ ఆఫ్‌ చేసి.. నంబర్‌ ప్లేట్‌ మార్చి..

Published Tue, Jul 11 2017 12:49 AM | Last Updated on Tue, Oct 9 2018 7:18 PM

శ్రీకాంత్‌ గౌడ్‌ (ఫైల్‌) - Sakshi

శ్రీకాంత్‌ గౌడ్‌ (ఫైల్‌)

అదే కారులో తిరుగుతున్న ఓలా క్యాబ్‌ డ్రైవర్‌
- శ్రీకాంత్‌గౌడ్‌ కిడ్నాప్‌ కేసులో ఢిల్లీ పోలీసుల పురోగతి
డ్రైవర్‌ కదలికలపై పూర్తి నిఘా.. ఏ క్షణంలోనైనా కేసు ఛేదిస్తాం
దర్యాప్తు అధికారి ఏసీపీ రాహుల్‌
20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
 
సాక్షి, న్యూఢిల్లీ: ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌గౌడ్‌ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసును ఏ క్షణంలోనైనా ఛేదిస్తామని పోలీ సులు చెబుతున్నారు. కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవరు వాహనంలో ఉన్న జీపీఎస్‌ను ఆఫ్‌ చేసి కారు నంబర్‌ ప్లేట్‌ మార్చి తిరుగుతున్నట్టు గుర్తించారు. కారు కదలికలపై పూర్తి నిఘా ఉం చామని చెబుతున్నారు. ఈస్ట్‌ ఢిల్లీ పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేప ట్టారు. ఏ క్షణంలోనైనా నిందితుడిని పట్టుకుం టామని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏసీపీ రాహుల్‌ తెలిపారు.
 
8 బుకింగ్‌లు తిరస్కరించి.. తొమ్మిదో బుకింగ్‌లో శ్రీకాంత్‌ కిడ్నాప్‌
కిడ్నాప్‌ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు పక్కా స్కెచ్‌ తో ప్రొఫెషనల్‌ ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి ఓలా నుంచి డబ్బులు డిమాండ్‌ చేయాలని నిర్ణయిం చుకున్నట్టు తెలుస్తోంది. గత గురువారం నిందితుడి క్యాబ్‌కు వినియోగదారుల నుంచి 8 బుకింగ్‌లు వచ్చినా.. బుక్‌ చేసుకున్న వారంతా సామాన్యులు కావడంతో తిరస్క రించాడు. తొమ్మిదో బుకింగ్‌కు శ్రీకాంత్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకోగా.. అతని సర్వీసు ను నిందితుడు తీసుకున్నాడు. శ్రీకాంత్‌ తన ఓలా అకౌంట్‌లో ‘డాక్టర్‌’ అన్న హోదాను పొందుపరచడంతో అతని బుకింగ్‌ను తీసుకున్నాడు. ప్రీత్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ వద్ద సీసీటీవీ కెమెరాల్లో చిక్కకుండా ఒక మూలకు కారును ఉంచి శ్రీకాంత్‌ను ఎక్కించుకున్నాడు.
 
నాకేమీ తెలియదు..
నిందితుడు లాగిన్‌ అయిన ఐడీ త్రిపాఠిది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ‘నాకేం తెలియదు’ అంటూ అత డు సమాధానం చెబుతున్నాడు. ఏజెంట్‌ అన్సా రీని గతంలో ఒకసారి కలిశానని, తన ఐడీలోకి లాగిన్‌ అవ్వడంలో సమస్య ఎదురైతే అన్సారీని సంప్రదించానని చెబుతున్నాడు. అయితే అన్సారీ అదే ఐడీని గుర్తుపెట్టుకొని కిడ్నాప్‌ చేసిన నిందితుడికి ఇచ్చి లాగిన్‌ చేయిం చినట్టు సమాచారం. అన్సారీ, సంజయ్‌ త్రిపాఠి లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
త్వరగా విడిపించండి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సోమవారం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి శ్రీకాంత్‌గౌడ్‌ కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నా రు. వీలైనంత త్వరగా కిడ్నాపర్‌ చెర నుంచి శ్రీకాంత్‌ను విడిపించాలని కోరారు.
 
అన్నీ నకిలీ పత్రాలే..
ఓలాలో క్యాబ్‌ సర్వీసును నడపడానికి నిందితుడు ఇచ్చినవన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు నిర్ధారించారు. ఓలాలో సర్వీసులు నడపాడానికి గతంలో పలుమార్లు దరఖాస్తు పెట్టుకున్నా పత్రాలు సరిగా లేకపోవడంతో తిర స్కరణకు గురయ్యాడు. దీంతో ఓలాకు క్యాబ్‌ లను అటాచ్‌ చేసే ఏజెంట్‌ అన్సారీ ద్వారా నకిలీ పత్రాలను సాధించి.. అప్పటికే ఓలాలో డ్రైవర్‌గా ఉన్న సంజయ్‌ త్రిపాఠీ ఐడీ ద్వారా ఆ పత్రాలను సమర్పించాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఓలా సర్వీసులు నడుపుతున్నాడు.
 
ఓలా సంస్థ వైఫల్యం..
సరైన పత్రాల్లేక 3 సార్లు తిరస్కరణకు గురైన వ్యక్తి.. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఇతర డ్రైవర్ల ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎలా ఎంపిక చేస్తారని త్రిపాఠి ప్రశ్నిస్తున్నాడు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా తాను ఇరుక్కున్నానని వాపోతున్నాడు. ఇది పూర్తిగా ఓలా వైఫల్య మేనని ఆరోపిస్తున్నాడు. ఓలా తన క్యాబ్‌ సర్వీసులను నిలిపేసిందని ఆవేదన చెందు తున్నాడు. ఏజెంట్లు కమీషన్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి డ్రైవర్ల ను చేర్చుతున్నారని ఆరోపిస్తున్నాడు.
 
వెరిఫికేషన్‌ జరిపితే దొరికిపోతానని..
ఓలా సర్వీసులు నడపడానికి సదరు డ్రైవర్లు పత్రాలు సమర్పించిన అనంతరం వాటిపై వారంలో సంస్థ ఒరిజినల్‌ పత్రాల ధ్రువీకరణ జరుపుతుంది. అయితే ఈ ధ్రువీకర ణ జరిపితే తన పత్రాలు నకిలీవిగా తేలిపోతాయని ముందే ఊహించిన నిందితుడు.. ఈలోగా తన పన్నాగాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 6వ తేదీ అర్ధరాత్రి శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఈ బుకింగ్‌ తీసుకోవడంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకొచ్చింది. సర్వీసులు నడిపే డ్రైవర్లకు ఓలా ఒక ఐడీని ఇస్తుంది. దీని ద్వారా డ్రైవర్లు సర్వీసులు నడపాలనుకుంటే ఓలా సర్వర్లలోకి అటాచ్‌ అవ్వాల్సి ఉంటుంది. శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన రోజున.. త్రిపాఠి ఐడీ ద్వారా నిందితుడు లాగిన్‌ అయి బుకింగ్‌ను తీసుకున్నాడు.


 

 

ఏడున్నవ్‌ బిడ్డా..!

 

 
 

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement