కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్ గౌడ్ విడుదల
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి అక్కాల శ్రీకాంత్‌గౌడ్ ఉదంతం సుఖాంతం అయింది. కిడ్నాపర్ల చెర నుంచి అతడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఈ నెల 6వ తేదీని కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. కిడ్నాపర్లను పట్టుకునే సమయంలో ఫైరింగ్ జరిగిందని, ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పోలీసులు రేపు (గురువారం) శ్రీకాంత్ గౌడ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న శ్రీకాంత్ గౌడ్‌ను ఈ నెల ఆరో తేదీన ఆ క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేశాడు. అతడిని వదిలిపెట్టాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ తను పనిచేస్తున్న ఓలా సంస్థను డిమాండ్ చేశాడు. దీనిని తొలుత సీరియస్‌గా తీసుకోని ఓలా యాజమాన్యం.. 7వ తేదీన ఢిల్లీలోని ప్రీత్‌విహార్ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన శ్రీకాంత్ గౌడ్ సురక్షితంగా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడటంతో అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.