క్యాబ్లో లైంగిక దాడి చేసి కాలువలో పడేశారు | 2 Cab Drivers Allegedly Raped 12-Year-Old, Threw Body in canal | Sakshi
Sakshi News home page

క్యాబ్లో లైంగిక దాడి చేసి కాలువలో పడేశారు

Published Wed, Aug 31 2016 2:22 PM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

క్యాబ్లో లైంగిక దాడి చేసి కాలువలో పడేశారు - Sakshi

క్యాబ్లో లైంగిక దాడి చేసి కాలువలో పడేశారు

కోల్కతా: నిత్యం కళ్లు తెరిపించే కథనాలు.. కఠిన శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు.. ప్రభుత్వాలు స్తంభించే స్థాయిలో నిరసనలు.. ఇన్ని రకాల అంశాలు చోటుచేసుకుంటున్నా.. కొందరు కామాంధులు తెగబడుతునే ఉన్నారు. దేశంలో ఏదో ఒకమూలన లైంగిక దాడులతో రెచ్చిపోతున్నారు. కోల్కతాలో రోడ్డుపక్కన బతుకీడుస్తున్న ఓ కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలిక గొంతు నులిమి చంపి ఓ కాలువలో బ్రిడ్జీపై నుంచి పడేశారు. ఈ చర్యకు పాల్పడినవారిలో ఒకరు ఓలా క్యాబ్ డ్రైవర్ కూడా ఉన్నాడు.

బుధవారం వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కోల్కతాలోని ఓ వీధిలో రోడ్డుపక్కన ఉన్న కాలిబటలో గుడిసె వేసుకొని జీవిస్తున్న కుటుంబానికి చెందిన 12 బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఎత్తుకెళ్లారు. వాళ్లు కిడ్నాప్ చేసుకొని వెళుతుండటం చూసిన తల్లి చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేసేలోగా వారు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు.  పార్క్ సర్కస్ ప్లై ఓవర్ పక్కనే కారును ఆపిన ఆ ఇద్దరు కారులోనే బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతు నులిమి చంపి కొద్ది దూరంలోని కాలువలో బ్రిడ్జిపై నుంచి పడేసి వెళ్లిపోయారు. ఈ దుర్మార్గానికి పాల్పడటానికి ముందు వారిద్దరు పీకలదాకా మధ్యం తాగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement