పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట | Love Couple Married in a police station | Sakshi
Sakshi News home page

పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట

Published Tue, Jul 19 2016 6:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Love Couple Married in a police station

కుటుంబసభ్యులనుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలివీ.. హమాలీబస్తీకి చెందిన రేవతి (20), ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్ (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

 

పది రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లి వెంకన్నస్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. రేవతిపై మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతు రేవతి, శ్రీనివాస్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. సర్టిఫికెట్లు పరిశీలించి మేజర్లేనని ధ్రువీకరించుకున్న పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో పలువురు బస్తీ నాయకులు రేవతి, శ్రీనివాస్‌లకు అండగా నిలిచారు. దండలు మార్పించి కలిసిమెలసి జీవించాలని ఆశీర్వదించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement